ఈ గుహలోనే యోగి రామయ్య గారు తపస్సు చేసుకున్నారు....
అరుణాచలశివ 🌹
*శ్రీ రమణ బోధ
*
*
ఒకసారి కావ్యకంఠ గణపతి ముని గారు మహర్షితో ఇలా అన్నారు. స్వామి! అందరికీ ఆత్మ విచారణ మార్గం కష్టం కదా! మీ వద్దకు వచ్చిన వారికి కష్టమైన ఈ మార్గాన్ని ఎందుకు బోధిస్తారు.
అందుకు మహర్షి ఇలా సెలవిచ్చారు... నేను ఈ ఆత్మ విచారణ మార్గాన్ని ఆచరించి ఎదుటివారికి వేరే మార్గాన్ని ఎలా బోధించేది?
అలా అని మహర్షి ఎవరినీ తన మార్గంలోకి రమ్మని చెప్పలేదు అని భక్తుల చరిత్రలో మనం చూస్తూ ఉంటాము. భక్తులు ఎన్నుకున్న మార్గంలోనే మహర్షి దారి చూపే వారు.
ఉదాహరణకు అన్నామలై స్వామి... మహర్షి, స్వామిని చూడడం తోటే నీవు గతజన్మలో గొప్ప ఇంజనీర్.
ఈ జన్మలో ఈ ఆశ్రమానికి సంబందించిన కట్టడాలు కట్టి మోక్షాన్ని పొందు అని చెప్పారు. ఇదే నీకు చివరి జన్మ అని కూడా చెప్పారు. స్వామి హఠ యోగము అభ్యసించారు.
మరొకరు సౌరిస్ మాత ... వీరు రమణ మహర్షి చెప్పిన ఆత్మవిచారణ మార్గము, నేనెవరు అని విచారించి మోక్షాన్ని పొందారు.
మరొకరు మురుగనార్.. భక్తి యోగాన్ని అభ్యసించి లక్ష్యాన్ని చేరారు.
రమణ సంభాషణలు రాసిన మునగాల వెంకట్రామయ్య గారు హఠ యోగాన్ని అభ్యసించి లక్ష్యాన్ని చేరారని మనం వింటూ ఉంటాం.
రామయోగి గారు హఠ యోగాన్ని అభ్యసించి లక్ష్యాన్ని చేరారు.
ఈ రామయోగి గారిని క్రియాయోగ పరమహంస యోగానంద బృందం కలిసింది.
రమణ ఆశ్రమం పక్కనే ఉన్న అన్నామలై స్వామి సమాధి వద్ద ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయికి ఒక చిన్న చెక్కతలుపు. దాని లోపల రామయోగి సాధన చేస్తూ ఉంటే బయట ఒక పెద్ద నాగుపాము కాపలా ఉండేది . రామయోగిని చూడటానికి పాల్ బ్రంటన్ వచ్చినప్పుడు ఒక పెద్ద నాగుపాము పాల్ బ్రంటన్ ఎదురుపడింది . రామయోగి గారు తటాలున చెక్క తలుపు తీసుకొని వచ్చి నాగుపాముతో ఒరేయ్ , వీరు మన వారు. వెళ్ళిపో అని అనే సరికి నాగుపాము వెళ్ళిపోయింది.
అదేవిధంగా పరమహంస యోగానంద ఇలా అన్నారు. ఇంకా కొద్ది సమయం గనుక నేను రామయోగితో ఉన్నట్లయితే నేను ఈ భారత దేశం వదలి విదేశాలు వెళ్లి ఉండేవాడిని కాదు అని. అంతటి గొప్పవారు రామయోగి.
ఇంకా ఎందరో భక్తులు ఉన్నారు. కానీ అందరూ మహర్షి చెప్పిన మార్గాన్ని అనుసరించ లేదు కానీ లక్ష్యాన్ని పొందారు. అంటే ఈశ్వరుని సృష్టిలో అన్ని యోగాలు ఉన్నాయి . అంటే భక్తి, జ్ఞానము, ధ్యానం, కర్మ వీటి ద్వారా లక్ష్యాన్ని పొందవచ్చు అని ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉంది కదా.
మహర్షి సెలవిచ్చినట్లు ....
పవిత్రమైన ఈ అరుణాచల క్షేత్రములో , పైగా సాన్నిధ్య బలముచేత ఎటువంటి యోగాన్ని అభ్యసించినా త్వరగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
ఇక్కడ మనకు సాన్నిధ్య బలము అంటే రమణ మహర్షి సన్నిధి.
ఎందరో విదేశీయులు మహర్షి సన్నిధిని వదలి వెళ్ళలేక పోతున్నారు.
ఈ పది సంవత్సరాల నా రమాణాశ్రమ అనుభవంలో తెలుసుకున్నది ఇదే.
మహర్షి యొక్క సాన్నిధ్యము అంతగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేము .
ఎంతో మంది దేశ విదేశాల వాళ్ళు రమణ మహర్షి సన్నిధిని ఆశ్రయించి పాతుకు పోయారు.
అంటే మహర్షి యొక్క సాన్నిధ్య బలాన్ని మాటల్లో వర్ణించలేము.
అది ఎవరికి వారు అనుభవిస్తేనే తెలుస్తుంది.
అరుణాచల శివ.
ఉదాహరణకు నావరకు... నాది మొదట క్రియా యోగము .అక్కడి నుంచి రామకృష్ణ మఠానికి రావడం జరిగింది. అక్కడ నుంచి రమణాశ్రమం రావడం జరిగింది . ఇక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళగలం. దీనిమీద ఏదీ లేదు కదా.
రమణశ్రమం లో యోగి రామయ్య తపస్సు చేసిన గుహ ఇదే.
తిరువణ్ణామలై. అరుణాచలం.
ఓ మరునాచలేశ్వరాయ నమః 🌹🙏
అరుణాచల శివ 🌹
No comments:
Post a Comment