ఈ సృష్టిలో ప్రతిదీ మార్పు చెందుతూనే ఉంటుంది .అది ఎలాగో తెలుసుకుందాం.
సృష్టి మార్పుల వేదిక . జననం నుంచి మరణందాకా ప్రాణి దేహంలో క్షణక్షణం మార్పులు జరుగుతూనే ఉంటాయి. విత్తనానికి తడి తగిలితే మొలకెత్తుతుంది. జీవ జంతుజాలమైనా, మనిషి అయినా భౌతిక మార్పులకు లోనుకాక తప్పదు. ఆలోచనలు, అవగాహన, ఆచరణలు మార్పు చెందుతూనే ఉంటాయి. దేహంమీద మనసు ప్రభావం చాలా ఉంటుంది. మనసే తన భావాలన్నింటికీ శరీర చర్యల ద్వారా రూపకల్పన చేసుకుంటుంది. కొందరి మనసులు ఆశల పుట్టలు, మరి కొందరివి ఆశయాలకు నెలవులు. ఆశ- ఆశయం మధ్యగల అంతరాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోవాలి. ఆశలన్నీ పేకమేడలు. వాటిని పేర్చుకుంటూపోతాం. అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. ఆశయాలు నిశ్చయమనే పునాదిమీద నిర్మితమవుతాయి. ఒక్కో ఇటుకనీ జాగ్రత్తగా బిగిస్తూ నిర్మాణం చేసినట్లు, ఆచితూచి వ్యవహరిస్తాం. మన గమ్యం, లక్ష్యం స్థిరంగా మనసులో ఉంటాయి. ఆలస్యంగానైనా గమ్యం చేరుకుంటాం.
చంచలమైన మనసును చైతన్యవంతంగా మార్చుకోవడంలోనే మన ప్రజ్ఞ దాగి ఉంటుంది. మనసును నిగ్రహించుకోవాలి. ఆ నిగ్రహం ద్వారానే స్థిరబుద్ధి కలుగుతుంది. స్థిరబుద్ధి లేకుండా మనం ఏమీ సాధించలేం..
'మనసు, బుద్ధి, అహంకారం' ఎనిమిది. రకాల మాయలలో భాగాలుగా గీతాకృష్ణుడు చెబుతాడు. అహంకారం. రజోగుణానికి సంబంధించింది. సత్వ గుణంతో ఉన్నంత కాలం ఆహంకారం. మనలోకి ప్రవేశించదు. అహంకారం. లేనంతకాలం మన ఆధ్యాత్మిక సాధనలు, ప్రాపంచిక వ్యవహారాలు సత్ఫలి తాలనిస్తాయి. తమోగుణం అంటే ఒక అజ్ఞాన శిబిరం అక్కడ మూర్ఖత్వం దట్టంగా వ్యాపించి ఉంటుంది. దాన్ని ఛేదించాలంటే వివేకం అనే దీపకళిక వెలగాలి. గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్లు, పిసరంత వివేకం మనసులోని ఆజ్ఞానాన్ని నెట్టివేస్తుంది. వేదాంతులు మనిషి ఆధ్యాత్మిక ఉన్నతి. పొందడానికి తమోగుణంలోంచి రజో గుణంలోకి, అందులోంచి సత్వగుణంలోకి మారాలంటారు.
మార్పు రెండు విధాలుగా ఉంటుంది. పైకి ఎదగడం, కిందకి జారడం. ఉన్న స్థితి నుంచి పైకి ఎదగడం అభివృద్ధి కిందకు జారడం పతనం. మనిషి ఒక్కోసారి ఏమీ తోచని జడస్థితిలో ఉంటాడు. ప్రజ్ఞ ఉంటుంది. కాని, దాన్ని సద్వినియోగం చేయలేకపోతుంటాడు. మారాలనుకుంటాడు. అలా అనుకుంటూనే రోజులు గడిపేస్తుంటాడు. విద్యార్థులు గొప్పగా చదవాలనుకుంటారు. సాధకులు అవరోధాలను అధిగమించి ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకోవాలనుకుంటారు. కానీ, ఆలోచనలు ఆచరణగా మార్చుకోలేనంతవరకు ఎవరైనా ఎలాంటి అభివృద్ధి సాధించలేరు.
మనం చాలా విషయాల్లో విఫలం కావడానికి కారణం మనలోని సోమరితనాన్ని జయించలేకపోవడమే. ఆదే మన ప్రథమ శత్రువు. మారాలనుకుంటూ మారలేకపోవడానికి బద్దకం పెద్ద ప్రతిబంధకం. ముందు బద్దకాన్ని వదిలించుకోవాలి. అనారోగ్యమనే వంక బద్దకానికి కవచం. దీన్ని ఛేదించాలి. వికలాంగులు సైతం సంకల్పబలంతో ప్రతికూల పరిస్థితుల్ని. జయించడాన్ని గమనించి కృషిచేస్తే మనలో మార్పు తథ్యం.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment