Thursday, March 23, 2023

 శేషాద్రిస్వామి వీరిపాండిత్యం,జ్ఞానం,మహిమలు అమోఘం.స్వామి ఎప్పుడు ఆహారం తీసుకునే వారు కాదు,నిద్ర పోయేవారు కాదు.ఎప్పుడు తనలో తాను మాట్లాడుకుంటుండేవారు.ఒంటి మీద మంచి బట్టలు ఉంటే అవి ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చేసి ఆయన వాళ్ళ చిరిగిన బట్టలు వేసుకునేవారు.స్వామి వారు త్రికాలజ్ఞులు,ఎవరైనా క్షమించరాని తప్పులు చేసి స్వామి దర్శనానికి వస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి ఇక్కడినుంచి వెళ్లిపో అని పంపించేసేవారు.ఆయన ఎదుటివ్యక్తి మొహం చూసి అన్ని విషయాలు చెప్పేసేవారు.ఒక్క రమణుల దగ్గర మాత్రం స్వామి ఎక్కువ ఏమి మాట్లాడేవారు కాదు.రమణులు ఒక్కరే శేషాద్రి స్వామికి ధీటుగా ఎదురుగా ఉండి సమాధానం చెప్పగలిగిన వ్యక్తి.ఇంకెవరైనా స్వామి జ్ఞానం ముందు ఆయన భక్తులు తప్పించి మిగతావాళ్ళు పక్కకెళ్లి పోవడమే. రమణులు,శేషాద్రి స్వామి ఇరువురికి పరస్పర గౌరవభావం ఉండేది.ఇద్దరూ ఎవరికెవరు తీసిపోని బ్రహ్మజ్ఞానులే.కావ్య కంఠ గణపతి ముని రమణ మహర్షిని పరమ గురువులా భావిస్తే  శేషాద్రి స్వామిని ఆంతరంగిక గురువులా భావించేవారు.శేషాద్రి స్వామి,రమణులు కలిసి మాట్లాడుకునే సంఘటనలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం శ్రీ శేషాద్రి స్వామి గురుభ్యోనమః

No comments:

Post a Comment