అహం బ్రహ్మశ్మి నాకు ఎందుకు అనుభవం లోకి రావటం లేదు?
సిద్ధాంతం సరిగ్గా అవగతం కాక పోవటం చేత.
1.పరమాత్మ పరిపూర్ణుడు. జీవాత్మ అపరిపూర్ణుడు.
జ్ఞానం నిరాకారము. మీరు ఇంజనీరా లేక డాక్టరా అన్న విషయం మిమ్ములను చూస్తే తెలియదు.
అంటే మీ జ్ఞానము నిరాకారము కదా.
2. సత్ అంటే ఉండటం. చిత్ అంటే గుర్తించటం.
ఈ రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇదే అర్థ
నారీశ్వరి తత్వం. సదానందం చిదానందం విడిగా
ఆనందాన్ని ఇవ్వదు. సత్చితనందం మాత్రమే
ఆనందాన్నిస్తుంది. అఖండమైన బ్రహ్మాండం నుండి
పిండాండం ఏర్పడటం వలన మానవులకు పరిమితమైన జ్ఞానము మాత్రమే లభించింది.
ఈ జ్ఞానము నిరాకారం మాత్రమే కాకుండా పర
మాత్మకు పరిపూర్ణ జ్ఞానం వుంది. అందువలన
మానవులు తమ పరిమిత జ్ఞానాన్ని విస్తరించు కోవాలి. కానీ అందుకు భిన్నంగా మనము మన దేహానికి పరిమితం చేసి దీనినే ఆత్మ అనే భ్రమలో వుండిపోయాము.
3. పై కారణంగా మనలో అహంకారం మరియు మమకారం బాగా పెంచుకొన్నాము. నేను అంటే దేహాత్మ భావనంలో ఇరుక్కున్నాము. అందువలన మనలోని అహంకారాన్ని గుర్తుంచుకొని మనము దానిని ముందు మానశికముగా విడనాడాలి. అహంకారం పోతే మమకారం సహజంగానే పోతుంది. కానీ ఇది అంత సులభంగా పోదు.
చాలా చాలా కృషి చేయాలి.
4. పరమాత్మ పరిపూర్ణుడు. జ్ఞానం నిరాకారం కాబట్టి
అదృశ్య రూపంలో ఉంటాడు. అవ్యక్తరూపంలో ఉంటాడు. అవసరార్థం ఏర్పడినప్పుడు అవతారరూపంలో ఉదభవించి
తదనంతరం అదృశ్యమైపోతాడు. ఇది అతని విభూతి.
5. కలికాలంలో ప్రపంచకమే ఆతని విభూతి.
అందువలన మనం ఈ ప్రపంచకములో దేనిని
నిందించినా పరమాత్ముని దూశించినట్లే. ఈ
విషయం బాగా గుర్తుంచుకోవాలి. దీనికి బాగా
మానసిక సాధనం అత్యవసరం. శ్రద్ధ మరియు దీక్ష చాలా చాలా అవసరం.
6. వ్యవహారరీత్యా ముందు మనం మానసికంగా ఎదగాలి. ఎందుకంటే ఒకేసారి మనం బాహాతంగా మన సాధనాన్ని ప్రదర్శించటం అనుచితం కదా.
దీనికి తగు దీక్ష అవసరం.
7. పరమాత్ముని అఖండజ్ఞానం ముందు మానవుని
పరిమిత జ్ఞానం ఏపాటిది? కానీ ఇది నిరాశకు గురి
కానీయరాదు. జ్ఞానం విస్తరించుకోవటం అన్నది పెద్ద
విషయం కానే కాదు. దీనికి కావలసినది ధ్యానం మాత్రమే. మానసిక పరిశుద్ధతకు పతంజలి సూత్ర
పద్దతిలో అవసరం. కానీ దీనితర్వాత పరిపూర్ణ జ్ఞానానికి అవసరమైనది అద్వైత విధాన పద్దతి మాత్రమే. అనగా ప్రహ్లాద భక్తి విధానం. అంటే తింటూ తిరుగుతూ మాట్లాడుతూ వగైరా వ్యవహారాన్ని సాగిస్తూ మానసికంగా ధ్యాన పద్ధతిని కొనసాగించాలి.
8. అద్వైత సిద్ధికి అవసరమైనది జ్ఞాతవ్యమే అంటే తెలుసు కోవటం మాత్రమే కానీ కర్తవ్యము ఏది లేదు. స్వతహాగా వస్తుసిద్ధి జన్మతహా వుంది. కాకపోతే బుద్దిశుద్ధిలో లోపం విపరీతం. వస్తుసిద్ధి అంటే జన్మతః ఆత్మరూపంలో మనలో పరమాత్మ తత్త్వం దాగేవుంది. కాకపోతే దానిని మనం గ్రహించలేక పోతున్నాము. కారణం విస్మృతి. అనగా మరిచిపోవటం.
9. శ్రీ ఆదిశంఖరుల వారి సందేశం ఏమిటంటే ఈ
విస్మృతిని అధిగామించటానికి ప్రత్యభిజ్ఞ అని ఉపాయంగా సెలవిస్తారు. అంటే తిరిగి గుర్తు తెచ్చుకోవటం. ప్రత్యక్ అంటే వెనక్కి వెనక్కి పోవటం పరాక్ అంటే ముందుముందుకు పోవటం.
ఆ విధంగా వెనక్కి పోతే ప్రత్యగాత్మ అంటారు.
ఈ స్థాయికి చేరుకోవటం అంటే మరణానికి సాక్షిగా
మారటమే. మరియు పునర్జన్మని ఆదిగమించటమే.
ఇదే అహంబ్రహ్మశ్మి.
10. బ్రహ్మజ్ఞానం కొద్దో గొప్పో బహుసులభమే కానీ
బ్రహ్మనిష్ఠ అత్యవసరం. అనగా మానసికంగా సదా ఆ ఎరుకలో గతి తప్పకుండా ఉండడం అతిముఖ్యం.
No comments:
Post a Comment