Friday, March 3, 2023

:::: గుంపు మనస్తత్వం ::::

 *:::::: గుంపు మనస్తత్వం ::::::::::*

   ప్రతి వారికి వారి వారి మనస్తత్వం వుంటుంది. దానిని అనుసరించి వారి ఆలోచనా విధానం, ప్రవర్తన వుంటుంది.
    మనిషి సంఘజీవి.  రకరకాల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఆ సంఘానికి ఒక మనస్తత్వం వుంటుంది.
     సంఘంలో వున్నప్పుడు తన ప్రత్యేకతను కోల్పోయి సంఘ మనస్తత్వం తో మనిషి ప్రవర్తిస్తాడు.

   మనిషి ఒక్కొక్క సారి, అనుకోకుండా, తాత్కాలికంగా, ఒక గుంపు లోకి ప్రవేశిస్తాడు. ఆ గుంపు ఒక తాత్కాలిక మనస్తత్వాన్ని, అప్పటికప్పుడు ఏర్పరచు కుంటుంది. ఈ మనిషి ఆ గుంపు ప్రవర్తనలో భాగం అవుతాడు . ఇది అతడి సహజ మనస్తత్వానికి పూర్తి విరుద్ధంగా వుంటుంది.
  సంఘాల ఎంపికలో అప్రమత్తత అవసరం.
  ధ్యానం చేద్దాం.మనలను మనం సంస్కరించుకుంద్దాం .

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment