Wednesday, October 18, 2023

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రియే ఎందుకు పెట్టుకుంటాడు?

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రియే ఎందుకు పెట్టుకుంటాడు?*
💖 *ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదే అని శాస్త్రం చెప్తున్నది.*
❤️ *కన్యాదాత దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు.*
💞 *కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.*
💕 *మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత  ఔదార్యానికి తలవంచాలిగా?*
💓 *కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది*
💝 *దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలూ, కానుకలూ, లాంఛనాలూ అవీ ఇవీ అడగచ్చునని ఎవరు చెప్పారు ?*
💖 *దానం పుచ్చుకునేవాడికి అది కావాలీ, ఇది కావాలీ అని అడిగే అధికారం ఉందా?*
❤️ *కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే.*
💝 *వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు.*
💞*అంతకన్నా ఇంకేంకావాలి?*

💝 *”సీతారాముల్లా ఉండండి!” అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది.*
💞 *జనక మహారాజు దశరథ మహారాజుని అడిగారు “మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?” అని. అప్పుడు దశరథ మహారాజు ఏమన్నారా తెలుసా? “అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది” అని.*
💖 *దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన శ్రీరామచంద్రుడు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.*
💖 *అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరువర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి.*
❤️ *ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!*
💕 *అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.*
💞 *తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా?*
💝 *”పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!” అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా?*
💓 *కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు.*
💖 *దానం పుచ్చుకోవడానికి వచ్చినవాళ్లకు ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు కదా…!*
💝 *కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు … ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.*
❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment