Sunday, October 6, 2024

****తల్లి -దండ్రులు

 🙏🌹🙏 తల్లి -దండ్రులు 🙏🌹🌷

#ఆత్మ అనేది భగవంతుని యొక్క అణు-అంశ కాబట్టి, దాని యొక్క అన్ని అనుబంధాలూ #ఆయనతోనే. కానీ, భౌతిక శారీరిక దృక్పథంలో, మన శారీరిక సంబంధీకులనే మనము తండ్రి, తల్లి, సఖి/సఖుడు, బిడ్డ మరియు స్నేహితుడు అని అనుకుంటాము. వారి పట్ల మమకార ఆసక్తులతో వారినే పదేపదే మన మనస్సులోకి తెస్తాము, దీనితో #భౌతికదృక్పథంలోమరింతబంధించి
వేయబడుతాము. 🍁🌹🌷🍀

#కానీ, ఈ ప్రాపంచిక బంధువులు ఎవ్వరూ కూడా మనకు, మన ఆత్మ పరితపించే దోషరహిత సంపూర్ణ ప్రేమను ఇవ్వలేరు. ఇది రెండు కారణాల వలన ఇలా ఉంటుంది. మొదటగా, ఈ అనుబంధాలు #తాత్కాలికమైనవి, మరియు మనం వెళ్లిపోయినప్పుడో లేదా వారు వెళ్ళిపోయినప్పుడో, విడిపోవటం అనేది తప్పదు. రెండోది, వారు #బ్రతికున్నంత కాలం కూడా, ఆ అనుబంధం స్వార్థం పై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అది స్వార్ధ #ప్రయోజనం నేరవేరినంత మేర ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఈవిధంగా, ప్రాపంచిక ప్రేమ యొక్క గాఢత మరియు పరిధి రోజంతా అనుక్షణం మారుతూ ఉంటుంది. "నా భార్య చాలా మంచిది... #అంత మంచిది కాదు.... ఫరవాలేదులే ... ఆమె ఇంత ఘోరమా" ఇలా..; జగన్నాటకములో ప్రాపంచిక ప్రేమ యొక్క చాంచల్యము ఇంతగా ఉంటుంది. ⚜️🍀🌷

#మరో పక్క, భగవంతుడు జన్మ జన్మల నుండి మనతోనే ఉన్న బంధువు. ఒక జన్మ నుండి ఇంకో జన్మ కి, ప్రతి జీవ రాశి రూపంలో, భగవంతుడు మనతోపాటే ఉన్నాడు మరియు మన #హృదయంలోనే స్థితమై ఉన్నాడు. అందుకే ఆయన మన శాశ్వత బంధువు. అంతేకాక, ఆయనకు మననుండి ఏమీ స్వప్రయోజనము అవసరం లేదు; ఆయనే దోషరహితుడు మరియు సంపూర్ణుడు.

 #ఆయన మనలను నిస్వార్థంగా ప్రేమిస్తాడు, ఆయన కేవలం మన శాశ్వత సంక్షేమం మాత్రమే కోరతాడు. అందుకే శాశ్వతుడు, నిస్వార్థుడూ అయిన భగవంతుడు మాత్రమే మన నిజమైన #బంధువు.🙏🌹🌷

#ఈ విషయాన్ని మరో దృక్కోణం నుండి అర్థంచేసుకోవాలంటే, సముద్రము మరియు దాని నుండి వచ్చే అలలను ఉపమానంగా చూడండి. #రెండు పక్కపక్కనున్న అలలు కలిసి కొంతకాలం ప్రయాణిస్తాయి, మరియు ఏదో గాఢమైన అనుబంధము ఉన్నట్లుగా, ఉల్లాసముగా ఒకదానితో ఒకటి ఆడుకుంటాయి. కానీ, కొంచెం దూరం వెళ్ళిన తరువాత, ఒకటి సముద్రం లోనికి జారిపోతుంది, మరికాసేపట్లో ఇంకోటి కూడా కలిసిపోతుంది. వాటికి తమ మధ్యలో ఏదైనా అనుబంధం ఉందా ? లేదు, అవి రెండూ సముద్రం నుండి జనించాయి మరియు వాటి సంబంధం సముద్రము తోనే. ఇదే విధంగా, #భగవంతుడు ఒక సముద్రం వంటి వాడు మరియు మనమందరమూ దాని నుండి ఉద్భవించే అలలము. మనము మన శారీరిక సంబంధీకులపై అనురాగం పెంచుకుంటాము; కానీ మరణ సమయంలో అందరిని విడిచి తదుపరి జన్మ లోకి ఒంటరిగానే #వెళ్తాము.. 🌷🍀⚜️

#యదార్థమేమంటే, ఆత్మలకు ఒకదానితో ఇంకోదానికి సంబంధము లేదు, కేవలం మనమందరమూ ఎక్కడ నుండీ జనించామో, ఆ #భగవంతుని తోనే ఉంది.... 🌷🍀⚜️

      ⚜️🌷సర్వం శివార్పణ మస్తు ⚜️🌷.              

No comments:

Post a Comment