*_సమస్య వచ్చినప్పుడు మనకు ఉండాల్సింది బాధ కాదు... నమ్మకం. ఎవ్వరిని నమ్మాలి అనేది నీ మనస్సు చెప్తే ఎంత నమ్మాలనేది మన అనుభవం చెప్తుంది._*
*_దాదాపు ఓడిపోయాము అనుకున్నప్పుడే గట్టిగా ప్రయత్నిస్తే అప్పుడే అద్భుతాలు జరుగుతాయి..._*
*_ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో, ఓడిన మనిషికి ఓదార్పు అంత ముఖ్యం._*
*_ఓడిన వ్యక్తి వాళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటారు, వేదనతో క్రుంగిపోతారు అలాంటి సమయంలో..._*
*_గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని, ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసిపట్టుకుని, ఎక్కువ ఉత్సాహంతో తలపడితే విజయం తథ్యమన్న మాటలు చెబితే వాళ్ళ మనసు కుదుటపడి, తదుపరి పోటీకి సిద్ధంగా ఉంటారు._*
*_అలా కాకుండా వారిలోని ధైర్యాన్ని చంపేసి వాళ్ళని ఎదగనీయకుండా చెయ్యడానికి మన పక్కనే శకుని లాంటివారు ఉంటారు..._*
*_అలాంటి వారెవరో ముందే పసిగట్టి పక్కన పెడితేనే జీవితంలో ఎదగగలం లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాము._*
*_యత్నం, ప్రయత్నం, దైవయత్నం అన్నారు... కాబట్టి ఎప్పుడు నీ లక్ష్యం చేరేదాకా మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు చేసే ప్రయత్నాన్ని ఆపకు.☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🪷🪷 🌺🙇♂️🌺 🪷🪷🪷
No comments:
Post a Comment