"నువ్వు ధ్యానం గురించి ఇంకా తపన చెందుతున్నట్లు కనిపిస్తున్నది" అని. "అవును భగవాన్ ఇక్కడ నాకేముంది భగవాన్ ఎడతెరపి లేని పనితప్ప", అన్నారామె. భగవాన్ ఆమెను జూచి చిరునవ్వు నవ్వి అన్నారు "నీ చేతులు పని చేస్తుండ వచ్చును కానీ, నీ మనసు నిలకడగా ఉండవచ్చును. ఏదైతే ఎప్పటికీ చలింపదో అదే నీవు. దానిని గుర్తించు. అప్పుడు నీకు పని భారమనిపించదు. నువ్వు ఈ శరీరాన్ని అనీ, నువ్వు పనిచేస్తున్నాననీ భావిస్తే, నీ జీవితం ఒక అంతులేని పనిగా అన్పిస్తుంది, నిజానికి మనసు పనిచేస్తున్నది. శరీరము కాదు. నీ శరీరము విశ్రాంతిగా ఉన్నంత మాత్రాన నీ మనసు కూడా విశ్రాంతిగా ఉంటుందా? నిద్రలో కూడా కలలతో మనసు తీరుబాటు లేకుండా ఉంటుంది”. ఆమె అడిగారు, “నేను, నేనీ శరీరాన్ని కాను అని ఎల్లవేళలా ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాను? భగవా నవ్వి అన్నారు, “ఎందుకంటే నువ్వింకా తగినంత జ్ఞానానుభవము పొందలేదు గనుక”.
*రమణ పెరియ పురాణం పుస్తకం నుండి* 🙏🙏🙏
No comments:
Post a Comment