*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*రామాయణం త్రేతాయుగంలోనిది.*
*అది సూర్యవంశం. మహాభారతం ద్వాపరయుగంలోనిది వీరిది చంద్రవంశం! ఈ రెండు చరిత్రలు మధ్య ఎవరు పాలించారు? యుగసంధి కాలంలో సూర్యవంశం నుండి చంద్రవంశానికి ప్రధాన పాలనధికారం రావడానికి జరిగిన మార్పులు ఏమిటి? చాలా క్లిష్టమయిన ప్రశ్న. యెందుకంటే రామాయణం 24 వ మహాయుగములో జరిగింది. మహాభారతం 28 వ అంటే ప్రస్తుత మహాయుగములో జరిగింది. అంటే రెండిటికి మధ్యన మూడు మహాయుగాలు మరియు నాలుగు యుగాలు గడిచాయి. లెక్కకు నాలుగు యుగాలు ఒక మాహాయుగము.*
*కృత యుగమునందు నాలుగువేల దివ్య సంవత్సరాలు + 800 వందల సంధ్య + సంధ్యాంశముల దివ్య సంవత్సరాలు మొత్తం = 4800 దివ్య సంవత్సరాలు వుండును. యిదేవిధముగా త్రేతా యుగములో 3600 దివ్య సంవత్సరాలు, ద్వాపరంలో 2400, కలియుగములో 1200 దివ్య సంవత్సరాలు వుండును. నాలుగు యుగములలో మొత్తం 12000 దివ్య సంవత్సరాలు వుండును. మానవుల ఒక్క సంవత్సరము దేవతల ఒక్క దినముతో సమానము. ఈ లెక్క ప్రకారము కలియుగం 432000, ద్వాపరము 864000, త్రేతాయుగము 1296000, కృతయుగము 1728000 సంవత్సరాలు.*
*దీనిప్రకారం మీరు మూడు మహాయుగాలు + ఒక ద్వాపర, ఒక కలియుగము, ఒక కృతయుగము, ఒక త్రేతాయుగము మొత్తం ఎన్ని లక్షల సంవత్సరాలో లెక్క చూసుకోండి. అందుకని ఏ ఋషీశ్వరులో తప్ప మామూలు మనుష్యులు మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరు. కల్పానికి ఒకసారే రామాయణ మహాభారతాలు జరుగుతాయి. ఈ రెండూ ఈ వరాహ కల్పంలో యేడవదైన వైవస్వత మన్వంతరములో జరిగాయి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌵🌴 🌵🌴🌵 🌴🌵🌴
No comments:
Post a Comment