*చరిత్ర చెప్పని పాఠాలు!*
*చెల్లని గాంధీగిరి 1️⃣*
---------------------------
గాంధీగిరి, నెహ్రూయిజంలు 1947 వ సంవత్సరంలో భారతీయులకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించాయి అనుకుంటే పేద్ద తప్పులో కాలేసినట్లే!
కేవలం వాళ్లిద్దరు వల్లించిన అహింస [#NonViolence], శాంతివచనాల [#PeacePreaches] కు భీతిల్లి [#ScaredBy] ఆంగ్లేయులు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లారని ఎవరైనా భావిస్తే, అంతకంటే ఘోరం మరొకటి ఉండదు!
ఓవైపు అధర్మం రాజ్యం ఏలుతుంటే, మరోవైపు శాంతి కాముకత్వం ప్రదర్శించుమని ఏ ఇతిహాసం [#Epic] చెప్పలేదు!
అన్యాయాన్ని ఎదిరించడానికి అహింసా మార్గాన్ని అనుసరించడం మాత్రమే పరమధర్మమని ఏ ప్రాచీనవాఙ్మయమూ [#AncientLiterature] నొక్కి వక్కాణించ లేదు!
ఆ మాటకొస్తే, లంకలో శ్రీరాముడు శాంతిజపం చేస్తూ కూచుని ఉంటే, ఆనాడు రావణాసురుడు సీతను వదిలేసే వాడా?
కురుక్షేత్ర సంగ్రామం జరపకుండా అహింసా మార్గాన్ని అనుసరించి ఉంటే, మహాభారతంలో పాండవులు తమ న్యాయమైన రాజ్యభాగాన్ని సాధించే వాళ్లా?
నెవర్...
అలా ఎన్నటికీ సాధ్యమయ్యేది కాదు!
అందుకే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం, అధర్మాన్ని, అన్యాయాన్ని నిలువరించడం కోసం సామ, దాన, బేధ, దండోపాయాలను ఉపయోగించాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు!
ఇక, శతాబ్దాల విదేశీపాలనకు చరమగీతం పాడుతూ భారతీయులు బానిస సంకెళ్లను తెంచుకునే క్రమంలో 1857 విప్లవమే తొలి అడుగు!
వినాయక్ దామోదర్ సావర్కర్ ప్రకారం మీరట్లో ఉవ్వెత్తున ఎగసిన ఆ సిపాయిల తిరుగుబాటు [#SepoysMutiny] ను మొదటి స్వతంత్ర్య సంగ్రామంగా పరిగణిస్తే, 1946 వ సంవత్సరం బాంబేలో రాజుకున్న నేవీ మ్యుటినీ [#NavyMutiny] ని ఆఖరిపోరాటంగా ఉటంకించవచ్చు!
ఆనాటి ఆ ఇండియన్ రెబెలియన్ను ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే లాంటి వాళ్లు నడిపిస్తే, రాయల్ ఇండియన్ నేవీకి చెందిన సలీల్ శ్యాం, బీసీ దత్, మదన్ సింగ్ లాంటి వాళ్లు చివరిదైన నేవీ రెబెలియన్లో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు!
ఇదిలా ఉంటే, బెంగాల్ మాజీ గవర్నర్ పీబీ చక్రవర్తి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, క్లెమెంట్ అట్లీ చెప్పిన కొన్ని సమాధానాలు భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చడం వెనక ఉన్న అసలు కారణాలను ఆ తరవాత క్రమంలో తేటతెల్లం చేశాయి!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ [#INA] మాంచి దూకుడుపై ఉండటం, అప్పటి బ్రిటిష్ ఆర్మీలో అధిక శాతంగా ఉన్న ఇండియన్స్ లో పెద్దఎత్తున రివోల్ట్ రావడం, బాంబే నేవీ మ్యుటినీ, వలస పాలకుల [#ColonialRulers] గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి!
అంతకుముందు 1939 నుంచి 1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో సాంకేతికంగా ఇంగ్లాండ్ గెలిచినా, వాళ్ల ఆర్థిక పరిస్థితి చిద్రం ఐంది! దీంతో, వెనకడుగు వేసిన సామ్రాజ్యవాద ప్రభుత్వం [#ImperialGovernment], భారతదేశం లాంటి అతిపెద్ద కాలనీని ఇకపై భరించలేమని ఒక నిర్ధారణకు వచ్చింది!
ఆ తరవాతే 1947, ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్యం ప్రకటించింది!
సరిగ్గా ఇవే విషయాలను ఆ సమయంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న క్లెమెంట్ అట్లీ [#ClementAttlee] చేసిన వ్యాఖ్యలు ధృవీకరిస్తున్నాయి!
కాగా, ఈ కారణాలన్నిటినీ కప్పి పుచ్చుతూ, కేవలం అహింసామార్గంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నడిపిన శాంతియుత ఉద్యమం ద్వారానే భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించిందనేది మన చరిత్ర పుస్తకాలు చెప్తున్న పాఠం!
గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ [#NonCooperation], పౌరుల శాసనోల్లంఘన [#CivilDisobedience], క్విట్ ఇండియా [#QuitIndia] ఉద్యమాలు [#Movements] మనకు స్వాతంత్ర్యాన్ని [#Independence] సాధించి పెట్టాయనేది సోకాల్డ్ హిస్టరీ పాఠ్యాంశాల ఉవాచ!
కానీ, కొంచం లోతుగా పరిశీలిస్తే, ఇవి వట్టి డొల్ల అని ఇట్టే తెలిసిపోతుంది!
స్వతహాగా కాస్త చంచల స్వభావం కలిగిన గాంధీ, ఈ మూడు ఉద్యమాలనూ స్వయంగా నిర్వీర్యం చేశాడు!
1919-21 ల మధ్య పిలుపిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం ఉచ్ఛ స్థాయికి చేరుతున్న దశలో, ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ జిల్లాలోని చౌరీ చౌరా గ్రామంలో ఉద్యమకారులు [#Revolutionists] పోలీస్ స్టేషన్ కు నిప్పంటించిన ఒక చిన్నఘటనకు వెరసి, దాన్ని విరమింపజేశాడు!
1930 లో శాసనోల్లంఘనలో భాగంగా ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన దండిమార్చ్ ది అదే పరిస్థితి! కొన్ని మినహాయింపుల కోసం రౌండ్ టేబుల్ [#RoundTable] సమావేశంలో పాల్గొనేందుకు ఒప్పుకుంటూ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ తో గాంధీ దొంగచాటుగా చేసుకున్న ఒప్పందం [#IrwinPact] తో ఉప్పుసత్యాగ్రహం చతికిలబడింది!
ఇదే అంశంపై నెహ్రూ నిలదీసినప్పుడు తన చంచల స్వభావాన్ని గాంధీ స్వయంగా ఒప్పుకున్నాడు!
ఇక, 1942 వ సంవత్సరంలోని క్విట్ ఇండియా నినాదం కేవలం రెండంటే రెండే నెలలకు మూగబోయింది!
గాంధీ ప్రకటనలో నిర్దిష్ట కార్యాచరణ లేకపోవడం, ఆయన నిర్ణయంపై కాంగ్రెస్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఇండియన్ ముస్లింలీగ్ [#MuslimLeague], కమ్యూనిస్టు [#Communist] పార్టీ, హిందూ మహాసభ [#HinduMahasabha] లు, ఆ మూవ్మెంటును తీవ్రంగా వ్యతిరేకించడం, అనేక మంది స్వాతంత్రోద్యమకార్లు జైళ్ల పాలవడం ఇందుకు ప్రధాన కారణాలు!
అందుకే, భారత్ కు స్వాతంత్ర్యం ఇవ్వాలనే తమ నిర్ణయంపై మోహన్ దాస్ కరంచంద్ గాంధీ చేసిన అహింసాయుత పోరాటం ప్రభావం ఏమాత్రం లేదంటారు ఆనాటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ!
ఈ నేపథ్యంలో, ఆనాటి ఆ పోరులో చోటు చేసుకున్న అనేక పరిణామాలు, వందల మంది విప్లవకారుల ప్రాణ త్యాగాలన్నిటినీ తోసిరాజని *కేవలం గాంధీ, నెహ్రులు అనుసరించిన అహింస, శాంతియుత విధానాల వల్ల మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందని రాజ్యప్రేరేపిత మార్క్సిస్టు చరిత్రకారులు [#MaxistHistorians] పుస్తకాలు రాయడం* నిజంగా మన దౌర్భాగ్యం!
తొలి ప్రధానమంత్రిగా దేశ అధికార పీఠాన్ని ఎక్కిన జవహర్ లాల్ నెహ్రూ బెదిరింపులకు దాసోహం అంటూ, ఇలాంటి నిజాలేవీ భవిష్యత్తరాల [#FutureGenerations] కు తెలియకుండా, వాటిని కాలగర్భంలో కలుపుతూ, పూర్తి ఉద్దేశపూర్వకంగా ప్రస్తుతం మనం చదువుతున్న చరిత్రరచన [#Historiography] జరిగింది!
ప్రజలను, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా, ఆనాటి కుహనా చరిత్రకారులు [#PseudoHistorians] చరిత్రను వక్రీకరించి లిఖించారు!
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన క్రెడిట్ అంతా ఒక్క భారత జాతీయ కాంగ్రెస్ [#IndianNationalCongress] కే ధారాదత్తం చేసేశారు!
పైపెచ్చు, హోరాహోరీగా సాగిన స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలొడ్డిన విప్లవకారులపై ఉగ్రవాదులనే ముద్రవేశారు!
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు లాంటి ఎందరో స్వతంత్ర సమరయోధుల [#FreedomFighters] కు సరైన గుర్తింపు ఇవ్వకుండా, మన పాఠ్యపుస్తకాలు ఇప్పటికీ వాళ్లను టెర్రరిస్టులుగా పేర్కొనడం శోచనీయం!
(ఇంకా ఉంది)
-- సూరజ్ వి. భరద్వాజ్
No comments:
Post a Comment