Thursday, January 16, 2025

 *సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుంది?*

సరస్వతీ దేవి ఏ పటంలోనైనా రాతి మీద వీణ పట్టుకునే కూర్చుంటుంది. లక్ష్మిలా నిలకడ లేని తామర పువ్వులో తన స్థానముండదని చెప్పటమే ప్రథమ ఉద్దేశ్యము.

సిరిసంపదలు హరించుకుపోవచ్చు... నేర్చుకున్న విద్య, విజ్ఞానం ఎక్కడికి పోలేనివని పరమార్థం.

సరస్వతి వాహనము హంస. హంస జ్ఞానము కలది. పాలూ, నీళ్ళూ కలిపి దాని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది. అనగా విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చునని. అలాగే నెమలి... సృష్టి తత్త్వానికి వ్యతిరేకంగా సంగమం లేకుండా మగనెమలి కంటి నీరు త్రాగి గర్భం ధరిస్తుంది.

*షోడశ మహాదానములన్న ఏవి ?*

గోవు, భూమి, తిలలు, హిరణ్యము, రత్నము, విద్య, కన్య, దాసి, శయ్య, గృహము, అగ్రహారం, రథము, గజము, అశ్వము, మేక, మహిషము.         

No comments:

Post a Comment