పెట్టుబడి అనగానే మనకి గుర్తొచ్చేది డబ్బే. అన్నింటికన్నా విలువైందిగా మనం భావించేదీ అదే. తెల్లారి లేచి ఏం కావాలన్నా డబ్బుతోనే పని.
కానీ నిజానికి అన్నింటికన్నా విలువైన పెట్టుబడి... ఎవరూ మనకివ్వలేనిదీ మన దగ్గర నుంచి ఎవరూ దోచుకోలేనిదీ... సమయం.
అయినా డబ్బును వాడుకోవడంలో దాచుకోవడంలో ఉన్న జాగ్రత్తా దూరదృష్టి సమయం విషయంలో ఉండవు. ఎందుకంటే- అది ఉచితంగా వస్తోంది కాబట్టి లైట్ తీసుకుంటాం.
'వాడు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తాడు' అంటుంటాం కానీ మనం సమయాన్ని నీళ్లకన్నా ఎక్కువగా వృథా చేస్తాం. మళ్లీ ఎవరే పని చెప్పినా 'అబ్బే అస్సలు టైం లేదు' అని క్షణం తీరికలేనివాళ్లలా పోజు కొడతాం.
👉ఒక్కసారి డబ్బు సంగతి పక్కనపెట్టి సమయాన్ని పెట్టుబడిగా పెట్టడం గురించి ఆలోచించండి.
🌿అమ్మానాన్నలుగా పిల్లలతో గడ పడానికి, ఆరోగ్యం కోసం మంచి జీవనశైలిని అలవరచుకోడానికి, చదువులోనూ ఆటల్లోనూ రాణించేందుకు సాధనమీద, ఉద్యో గంలో పైకి వెళ్లడానికి నైపుణ్యాల పెంపు మీద, మానసికోల్లాసం కోసం నచ్చిన హాబీ మీద... మీ సమయాన్ని పెట్టుబడి పెట్టి చూడండి.
👉కొత్త సంవత్సరంలో మిమ్మల్ని మీరే సరికొత్తగా కను గొంటారంటే నమ్మండి!... ✍️
No comments:
Post a Comment