*ధ్యాన 😌మార్గ*
శాశ్వతమైన దాని కోసం క్షణికమైన వాటిని త్యజించండి. అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్పసుఖాలను వదిలివేయండి.
❤️🕉️❤️
భగవత్ దర్శనం పొందిన వ్యక్తి, విగ్రహాలు మొదలైన వాటినన్నింటిని భగవత్ చైతన్యపు బాహ్యరూపాలే అవి అని గుర్తిస్తాడు. అతడికి విగ్రహం మృణ్మయంగా కాక చిన్మయంగా గోచరిస్తుంది.- శ్రీ రామకృష్ణ
❤️🕉️❤️
ఏకాంత ప్రదేశంలో ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించటం ముఖ్యం. మొక్కగా ఉన్నప్పుడు కంచె అవసరం. కాని అది పెరిగి పెద్దయ్యాక పశువులు దాన్ని మేసి, పాడుచేయలేవు. అదే రీతిలో కొన్ని సంవత్సరాలు ధ్యానం చేసి స్థిరచిత్తం ఏర్పడ్డాక నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవరితో కలిసిమెలసి తిరిగినా నీ మనస్సులో మార్పు ఉండదు
❤️🕉️❤️
అగ్నికీ దాని దాహకశక్తికీ (కాల్చేశక్తి) ఉన్న సంబంధం ఎలాంటిదో, శక్తికీ బ్రహ్మానికీ ఉన్న సంబంధం అటువంటిది.
No comments:
Post a Comment