🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷
🌸 *మంచి ఆలోచన* 🌸
ఒకానొకప్పుడు ఓ పెద్దాయన దగ్గర ఆశీస్సులకోసం ఒక మహానుభావుడు వెళ్ళినప్పుడు..
*"ఆలోచనలుబట్టే నీ జీవితం సాగుతుంది"*
అని ఆశీర్వదించారు.
ఆయనతో ఉన్న చనువుండటంతో నూరేళ్ళు చల్లగా ఉంటావని కదండీ దీవిస్తారు....మీరేమో ఆలోచనలుబట్టి జీవితం సాగుతుందని చెప్పారేంటీ అని అడిగినందుకుగాను.
అప్పుడాయన ఇలా చెప్పారు...
"ఆలోచనలు మంచివై వాటిని ఆచరిస్తే నీ జీవితం సాఫీగా మంచిగా సాగుతుంది. నీతో మాట్లాడటానికీ నీతో ఉండటానికీ నలుగురూ ఇష్టపడతారు. అలాకాకుండా నీవన్నీ చెడు ఆలోచనలైతే నీతో ఎవరుంటారు? కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలి...నవ్వూ నవ్వించూ అనేది మరచిపోకు...."
అంటూ ఓ విషయాన్ని ఉదహరించారు...
ఓమారు రామభక్తుడైన త్యాగయ్య పూజకోసం అన్నీ సిద్ధం చేస్తున్న సందర్భమది. త్యాగయ్య వాళ్ళ అన్నయ్య పువ్వులు కొనుక్కుని తన భార్యకిచ్చి ముచ్చటపడాలనుకున్నాడు. అయితే అతను ఇంటికొచ్చేసరికి భార్య ఇంట లేదు. దాంతో అతను ఆ పువ్వులను తమ్ముడు త్యాగయ్యకిచ్చేశాడు.
త్యాగయ్య ఆ పువ్వులను అందుకుని రాముడి పటానికి వేసి ఓ కీర్తన ఆలపించారు.
ఆ పాటలో శృంగారరసం ధ్వనించింది.
అనేక కీర్తనలు ఆలపించిన తన నోటంట ఇలా ఒకే ఒక్క కీర్తనలో శృంగార రసం ఉండటమేంటీ అనుకున్నాడు త్యాగయ్య.
ఆ విషయాన్నే తన అన్నయ్యతో ప్రస్తావించాడు.
అప్శుడా అన్నయ్య ఆ పువ్వులు తన భార్య కోసం తీసుకొచ్చానని, కానీ తను లేకపోవడంతో నీకిచ్చాను అన్నాడు.
ఈ మాటతో త్యాగయ్యకు విషయం బోధపడింది. తన అన్నయ్య ఏ ఆలోచనతో పువ్వులు తెచ్చుకున్నాడో ఆ ఆలోచనకు తగ్గట్టే తన పాటా సాగిందనుకున్నాడు త్యాగయ్య.
అందుకే ... ఆలోచనలు బట్టే మన చేతలూ ఉంటాయి. మంచి ఆలోచనలూ.. ఆ ఆలోచనలకు తగినట్లు మన ప్రవర్తనా ఉంటే అంతా మంచే జరుగుతుంది.
అతనిని దీవించిన ఆ పెద్దాయన...
త్యాగయ్య ఆలపించిన ఆ కీర్తనను చెప్పలేదు, నాటి సంఘటనను మాత్రమే చెప్పారు. ---
🙏 *సర్వేజనా సుఖినోభవంతు*
🌷🌻🌷🌻🌷🌻🌷🌻🌷
No comments:
Post a Comment