Tuesday, January 21, 2025

 *నేటి మంగళవారం స్పెషల్ స్టోరీ*          " ఒక లక్ష్యాన్ని చేరాలంటే పట్టుదల,నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, ధృడచిత్తం అవసరం.. ఎన్నో కష్టాలు ఎదురుకొని..తన లక్ష్యసాధనలో ఏమాత్రం అధైర్యపడక చివరికి ఈ ప్రపంచానికే వెలుగులు పంచిన ఒక స్త్రీ మూర్తి కథ..నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం ,మార్గదర్శకం ఈ స్త్రీ మూర్తి జీవితం!
  
1867 నవంబరు 7 పోలెండ్ రాజధానిలో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో ఐదవ సంతానంగా పుట్టింది ఆ అమ్మాయి..చాలీచాలని జీతాలప్పుడు..అదీగాక పోలెండు అప్పుడు రష్యా చేతిలో బానిస దేశం...కానీ ఆ పాపకు చదువంటే ప్రాణం.ఆమె ఐదవ యేటనే తల్లి,సోదరీ మరణించారు.అయినా చదువు మాత్రం మానలేదు..తను చదివిన స్కూల్ లో ప్రధమస్థానం సాధించింది..ఇంతలో నాన్న బాధ్యత మరచి త్రాగుడుకు బానిసై ఎటో వెళ్ళిపోయాడు...ఒక అక్క మెడిసిన్ చేస్తుంది...ఆర్థిక సమస్యలు ప్రారంభమైనాయి. ధనవంతుల ఇండ్లలో పనికి చేరింది.. చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పసాగింది..వచ్చిన డబ్బును అతి జాగ్రత్తగా ఖర్చు చేసేది. ఆ డబ్బులోనే కొంత తన సోదరి చదువుకు పంపేది.తన చదువు కోసం కొంత దాసుకొనేది...చదవాలి...సైన్సు సబ్జెక్ట్ లో పరిశోధనలు చేయాలి...ఎలాగైనా చదువు కొనసాగించాలి.ఇదే ఆమె తపన..

తన 24 యేట కొంత డబ్బు దాచుకొని ఆస్ట్రియాలోని కాకో యూనివర్సిటిలో చేరాలని ప్రయత్నించగా స్త్రీలకు సైన్సులో ప్రవేశం లేదనే నిబంధనతో ఆమెకు సీటు నిరాకరించబడింది..అయినా ధైర్యం కోల్పోలేదు..ఎలాగైనా ఫ్రాన్స్ వెళ్ళాలనుకుంది.. మొత్తానికి ఫ్రెంచ్ పౌరసత్వం పొంది ,అతి కష్టం మీద ప్రాన్స్ లోని "సోబర్న్ యూనివర్సిటీలో మ్యాథ్స్ , ఫిజిక్స్ ,కెమెష్ట్రీ లతో డిగ్రీలో నైట్ కాలేజ్ స్టూడెంట్ గా చేరింది.డబ్బులు కోసం పగలు ల్యాబ్ లేటరీలో పరికరాలు అమర్చే సహాయకరాలుగా పనిచేసింది.బయట భోదకురాలుగా పనిచేసేది..అప్పుడే పియర్ క్యూరీ అనే లెక్చరర్ తో పరిచయం అయిందామెకు. ఆయన ఆమెలోని ప్రతిభను గుర్తించి తన ల్యాబ్ లో పరిశోధనలకు అనుమతినిచ్చాడు.1893 లో మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేసింది..1894 లో అదే కళాశాలలో పరిశోధన(డాక్టరేట్ ) కు హెన్రీ బెకరల్ దగ్గర చేరింది..ఆయన అప్పటికే రేడియోధార్మికతను కనుగొని దానిపై పరిశోధనలు చేస్తున్నాడు. ఇందులో ఈమె కూడా భాగస్వామ్యమైంది..ఫియరీక్యూరీ కూడా వీరితో కలిసాడు.1896 లో పియరీని వివాహం చేసుకున్నారు..1903 లో రేడియోధార్మికత పరిశోధలకై ఈ ముగ్గురికీ "నోబుల్ బహుమతి" వచ్చింది. 1906 లో పియరీక్యూరీ ఒక రోడ్ ప్రమాదంలో మరణించాడు..పిడుగులాంటి ఆ దుర్వార్త విని కుప్పకూలిందామె. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు..ఆమె కళాశాల ఆమెకు అండగా నిలిచింది. పియరీక్యూరీ ఉద్యోగం ఆమెకు ఇచ్చింది.ఫిజిక్స్ కు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా నియమించింది..చరిత్రలో ఈ స్థానం దక్కిన తొలి మహిళ ఈమె. ఒక ప్రక్క ఉద్యోగం..పరిశోధనలు..మరొక ప్రక్క పిల్లల ఆలనా పాలనాలతో క్షణం తీరిక లేకుండా గడిపేది. యూరేనియం కంటే ఎక్కువ పవర్ ఫుల్ రేడియోధార్మికత కలిగిన ఫిచ్ బండ్ ను కనుగొనింది. తర్వాత x కిరణాలపై పరిశోధన మొదలెట్టింది. 1911లో మళ్ళీ నోబుల్ బహుమతి పొందింది. ఇలా భౌతిక,రసాయన శాస్త్రాలలో నోబుల్ ఫ్ర్రెజ్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఈమె..1914 లో మొదటి ప్రపంచయుద్దంలో రేడియాలజిస్టుగా పనిచేసింది.. క్యాన్సర్ ను అదుపుచేసే రేడియోకణాలను కనుగొని ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచింది.తల్లిగా తన కూతుర్లిద్దరినీ ప్రయోజకవంతులను చేసింది.పెద్దకూతురు శాస్త్రవేత్తగాకా,చిన్న కూతురు సోషల్ వర్కర్ గా పేరు గడించింది. తన కనుగొనిన ఒక మూలకానికి తన మాతృదేశమైన పోలెండ్ పేరు మీద "పోలోనియం" అనే పేరు పెట్టింది...అయితే ఏ క్యాన్సర్ నైతే జయించేందుకు కృషి చేసిందో ..ఆ క్యాన్సర్ కే 1934 లో బలైపోయింది..

ఈమె ఎవరో తెలుసా?? మారియా ఉరఫ్ మేరీ క్యూరీ..శాస్త్రపరిశోధనలో ఒక గొప్ప పరిశోధకరాలు. బానిసదేశంలో పుట్టి,కటిక దరిద్రం అనుభవించి, ఆయాగా పనిచేసి, ట్యూషన్స్ చెప్పి,తన లక్ష్యసాధనలో ఎన్నో అవాంతరాలను ఎదురుకొని చివరికి తన లక్ష్యాన్ని విజయవంతంగా అధిరోహించిన మహిళ. శాస్త్రవేత్తగానే కాదు ఒక తల్లిగా 100% విజయం సాధించిన ఆదర్శమహిళ!!  

No comments:

Post a Comment