Saturday, January 4, 2025

 *ధ్యాన 😌మార్గ*
ఎప్పుడూ చంచలమైనది మనస్సు, నిశ్చయంగా ఒక విషయాన్ని
నిర్ణయించగలిగేది బుద్ధి. కాని ఈ బుద్ధి బాహ్య విషయాలను మాత్రమే
నిర్ణయించగలుగుతుంది; ఆంతరిక సత్యాలను చూసే శక్తి దీనికి లేదు. ఎందుకంటేఇది జాగృతి చెందని స్థితిలోని బుద్ధి. అది జాగృతి చెందినప్పుడు మాత్రమే తీక్షణతను సంతరించుకుంటుంది. ఆ తీక్షణమైన బుద్ధి చేతనే ఆత్మను గ్రహించగలం.
❤️🕉️❤️
పశువుల కాపరి ఆవు యొక్క గమనాన్ని దాని అడుగుజాడలతో గుర్తుపట్టి ఆవుని వెతుక్కున్న రీతిలో దివ్యత్వం యొక్క అడుగుజాడలు మానవునియందే ఎక్కువగా ముద్రితమయి ఉన్నందున, మనయందే దివ్యత్వాన్ని వెతకగలగాలి.
 ❤️🕉️❤️
మీరు మీ ఆదర్శాన్ని ధ్యానిస్తే, మీరు దాని స్వభావాన్ని పొందుతారు. పగలు రాత్రి భగవంతుని తలచుకుంటే భగవంతుని స్వరూపం లభిస్తుంది. -రామకృష్ణపరమహంస
❤️🕉️❤️
శ్రీరామకృష్ణులు: గృహస్థుడుగా ఉంటూ భగవంతుని ప్రార్థించే వ్యక్తి నిజంగానే వీరభక్తుడు. 'సంసారాన్ని త్యజించిన వ్యక్తి నన్ను తప్పక ప్రార్థిస్తాడు, నాకు తప్పక సేవలు చేస్తాడు. దాన్లో ఏం గొప్పతనం ఉంది. అతడు నన్ను ప్రార్థింపకుంటే అందరూ అతణ్ణి ఛీకొడతారు. కాని ఎవడు సంసారంలో ఉంటూ నన్ను ప్రార్థిస్తాడో, అడ్డంకిగా ఉన్న పెద్ద బండరాయిలాంటి అవరోధాలను వైదొలగిస్తూ నన్ను ప్రార్థిస్తాడో అతడే ధన్యుడు. అతడే ఘనుడు, అతడే
వీరపురుషుడు' అని భగవంతుడు భావిస్తాడు.          

No comments:

Post a Comment