*భగవద్గీత.....*
1. *మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత భోధిస్తుంది.*
2. *శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము. మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని భగవానుడు చెపుతాడు.*
3. *ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే. ఎవరు శాశ్వతము కాదు, కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది శాశ్వతమైనది.*
4. *కోపమే అన్ని అనర్ధాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి. మిగిలిన రెండు మోహము, ఆశ. కోపము లో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతా డు, అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు.*
5. *కర్మను అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి.*
6. *ఈ జగత్తులో మార్పు అనేది సహజము. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు.*
7. *ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు.*
8. *నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైనా గాని సుఖ శాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు.*
9. *కోరికలను జయించాలి లేదా అదుపుచేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది.*
10. *జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో వున్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.*
11. *ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది... కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు...*
12. *మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.*
13. *భగవద్గీత లో స్పష్టంగా వ్రాసి ఉంది!! దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని!! బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే!!! నీవు కాదని!!!*
14. *దాచిపెట్టిన ధనం పరులపాలు అందమైన దేహం అగ్నిపాలు అస్థికలన్నీ గంగ పాలు కొడుకు పెట్టిన తద్దినంకుడు కాకుల పాలు నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరిపాలో? కానీ నువ్వు చేసిన ధాన, ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతి పాలు*
15. *మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నాధనమెంత పెరిగింది అని. విధి నవ్వుతూ మనిషి ఆయుష్షు లెక్కిస్తూ ఉంటుంది. నిన్నటికి ఈరోజుకి నీ ఆయుష్షు ఇంత తరిగింది అని.*
16. *భగవద్గీతకు మించిన స్నేహితుడు కాలాన్ని మించిన గురువు... ఎక్కడ దొరకడు.*
17. *గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు, అవి రెండూ శాస్వితం కాదని తెలిసిన వాడు నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు.*
18. *ప్రతి ఒక్కరిలో ఆత్మ స్వరూపాన్ని చూడాలి... అందరూ పరమాత్మ సంతానమైన ఆత్మలే, ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనని తాను ద్వేషించుకుంటున్నట్లే, కష్టపడినచో పని పూర్తి అవుతుంది కళలు కంటూ కూర్చుంటే జీవిత కలం వృధా అవుతుంది.*
19. *ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు. నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.*
20. *జననం మరణం సహజం ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించారు జీవితం అనేది యుద్ధం లాంటిది పోరాడి గెలవాలి ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.*
21. *అతిగా స్పందించడం... కోపం... వ్యక్తులపైన, వస్తువుల పైన, వైభవాల పైన లోబం మోహము మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం... అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.*
22. *నానావిధాలైన అనేక మాటలు వినడం వల్ల చలించిన నీ మనస్సు, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.*
23. *పరమాత్మ చెప్తారు ఎవరైతే నన్ను ప్రీతితో తలంపు చేస్తారో వారి హృదయాలలో నేనుంటాను ప్రాణుల సృష్టి, స్థితి, లయలు నేనే...*
24. *ఆత్మని అస్త్ర శాస్త్రాలు ఎవరు ఏమి చేయలేరు... ఆత్మ చేధింపబడజాలదు... దహింపబడజాలదు...తడుపబడజాలదు...*
25. *శరీరం శాశ్వతం కాదు ఆత్మ శాశ్వతం... మరణం అనివార్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఆత్మ అమర్- అవినాసి, శరీరం వినాసి.*
26. *నీవు ఆత్మ స్వరూపడివి అందరిలో ఉండే ఆత్మ స్వరూపాన్ని చూడు... ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది!!!*
*┈┉━❀꧁ శ్రీమద్భగద్గీత ꧂❀━┅┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🌷🦚 🙏🕉️🙏 🦚🌷🦚
No comments:
Post a Comment