Tuesday, October 21, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩
19/10/25

1) దైవం గుఱించి మనం మాట్లాడటం కాదు. మనందరి ద్వారా మాట్లాడేది దైవమే.

2)ఎప్పుడూ ఉండేది ఆనందం. వచ్చిపోయేదంతా మనఃకల్పితం.

3)ఎదగడం అంటే, పుస్తక జ్ఞానంతో మెదడును నింపడం కాదు.
అన్నీ దులుపుకుని ఖాళీగా నిలబడడం.

4) నామరూపాలు కలిగిన దేవుడే జీవుడు. నామరూపాలు తొలగిన జీవుడే దేవుడు.

5) నగలు - బహువచనం. బంగారం - ఏకవచనం. ప్రపంచం - బహువచనం.
దైవం - ఏకవచనం.

6) తోకాడితే కుక్కాడినట్టే.
పెదవి నవ్వితే మనిషి నవ్వినట్టే.
ప్రతి చలనం అనిలాచలునిదే.

No comments:

Post a Comment