*ఓ నరసింహ స్వామీ!* భూమియంద లి
తీర్ధయాత్రలన్నియు చేయ వచ్చును.
ముఖ్య నదులలో మునగావచ్చు.
ముక్కు మూసుకొని, సంధ్యావందనం చేయవచ్చు.
జపమాలతో జాగ్రత్తగా జపించ వచ్చు.
వేదాల కర్దము విడమర్చి చెప్పవచ్చు.
గొప్పవైన యజ్ఞములను చేయవచ్చు.
విరివిగా దానములు చేయవచ్చు.
నియమనిష్టలతో ఆచార వ్యవహాములు నాచరించ వచ్చు.
కాని...
*దేవదేవా!*
ఏకాగ్రతతో నీ పాదపద్మములను కొలుచుట సాధ్యము కాకున్నది తండ్రీ!
No comments:
Post a Comment