*చిన్నారుల రక్షకాలు... టీకాలు!*
*++++++++++++++++++++*
ముల్లును ముల్లుతోనే తీయాలి... వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. ఇవి భారతంలో శకుని చెప్పిన డైలాగులో, మన జాతీయాలో కాదు. ప్రకృతి సూత్రాలు. ఈ సూత్రాల ఆధారంగానే టీకాలు తయారయ్యాయి. జబ్బు కలిగించే జీవి లేదా పదార్థాన్నే జబ్బు రానీయకుండా చేసే సాధనంగా వాడడం ఇందులోని మర్మం.
ఒక నాయకుడి మీద ఒకసారి దాడి జరిగిందనుకోండి.. వెంటనే భద్రతను పటిష్టం చేస్తారు. ఆయన ఎటు వెళ్లినా చుట్టూ పోలీసుల రక్షణ వలయం ఉంటుంది. ఇక్కడ నాయకుడు మన శరీరం అయితే, దాడిచేసింది వ్యాధికారక క్రిములు. మరి భద్రతనిచ్చేదే వ్యాధి నిరోధక వ్యవస్థ. నాయకుడి భద్రతను పటిష్టం చేయడానికి హోమ్ శాఖ చురుగ్గా కదిలినట్టుగానే మన వ్యాధినిరోధక వ్యవస్థ క్రిముల దాడిని ఎదుర్కోగల పోలీసులను శరీరానికి ఏర్పరుస్తుంది. ఆ పోలీసులే యాంటీ బాడీలు లేదా ప్రతి రక్షకాలు. ఈ యాంటీ బాడీల భద్రతా వలయంలో ఉన్నంతవరకు మొదట దాడి చేసిన క్రిమి మళ్లీ మన జోలికి రాదు.
ఆ ఒక్కసారి కూడా దాడి జరగకముందే పోలీసుల భద్రతా వలయం పటిష్టంగా ఉంటే దాడి చేయదలచుకున్నవాళ్లు వెనుకంజ వేస్తారు. అదే విధంగా జబ్బు రాకముందే యాంటీ బాడీలు తయారై పోరాటానికి సిద్ధంగా రక్షణ వలయం ఏర్పరిచి ఉంటే, ఇక మనకు ఆ జబ్బు రావడానికి అవకాశమే ఉండదు. ఇదే టీకా లేదా వ్యాక్సిన్‌లో ఇమిడివున్న అంశం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఓ రెండు శతాబ్దాలకు పైగా వెనక్కి వెళ్లాలి.
1796 వ సంవత్సరము
ఇంగ్లండులో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాడు.
ఇంగ్లండులో మశూచి వ్యాధి (స్మాల్ పాక్స్) భయపెడుతున్న రోజులవి. విచిత్రంగా పాల వ్యాపారం చేసే మహిళలెవ్వరికీ మశూచి రావడం లేదు. అందుకు కారణం వాళ్లకు ఆవుల నుంచి సంక్రమించే కౌపాక్స్ వ్యాధి సోకడమేనని తేలింది. గ్రామీణ డాక్టర్‌గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ జెన్నర్‌కి వెంటనే ఫ్లాష్ల వెలిగింది ఐడియా. అది వైద్యరంగాన్ని అద్భుతమైన మలుపు తిప్పింది. ఒక పాలు అమ్మే మహిళ చేతిగాయం నుంచి తీసిన పదార్థాన్ని 8 ఏళ్ల జేమ్స్ ఫిప్స్‌కి ఎక్కించాడు. అతనికి కౌపాక్స్ వచ్చి కొద్దిరోజుల్లో తగ్గిపోయింది. ఆరు వారాల తరువాత మశూచికి సంబంధించినదాన్ని
ఎక్కించాడు. చిత్రంగా ఎన్నేళ్లయినా, మశూచి ఉన్నవాళ్లతో కలిసి తిరిగినా అతనికి వ్యాధి రాలేదు. అలా జెన్నర్ ఐడియా నుంచి పుట్టింది టీకా లేదా వ్యాక్సిన్. దీనికి 1798లో గుర్తింపు లభించింది. వేరియోలే వాక్సినే అంటే ఆవులకు వచ్చే మశూచి అని అర్థం. ఈ పదం నుంచే వ్యాక్సిన్ అన్న పదం పుట్టింది. 19వ శతాబ్దంలో మశూచికి టీకాలు వేయించుకోవడం వల్ల బ్రిటన్‌లో మశూచితో చనిపోయేవారి సంఖ్య 2000 నుంచి 100కు పడిపోయింది. ఆ తరువాత 1980 నుంచి ప్రపంచవ్యాప్తంగా మశూచి కనుమరుగైంది.
*ఇలా పనిచేస్తుంది!*
మన శరీరంలో ప్రతి కణం మీద కొన్ని రకాల ప్రొటీన్లు ఉంటాయి. వీటిని యాంటీజెన్లు (ప్రతిజనకాలు) అంటారు. ఇవి ప్రతి జీవిలోనూ ఉంటాయి. అది బాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధి కారక క్రిమి ఏదైనా కావొచ్చు. ఆ వ్యాధికారక క్రిమి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రొటీన్ ను మన వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) పసిగట్టేస్తుంది. వెంటనే ఆ యాంటిజెన్ ను అతుక్కో గలిగే దాని వ్యతిరేక ప్రొటీన్లయిన యాంటీబాడీలను (ప్రతి రక్షకాలు) తయారుచేస్తుంది. ఇవి యాంటిజెన్లతో చర్యలు పొంది, వ్యాధి కారక క్రిమిని చంపేస్తాయి. కొన్ని రకాల జబ్బుల్లో ఇలా ఉత్పత్తయిన యాంటీబాడీలు జీవితాం తం అలాగే ఉండిపోతాయి. అందువల్ల తిరిగి అవే వ్యాధికారక క్రిములు మళ్లీ జబ్బును కలిగించలేవు. ఇలా జబ్బును కలిగించే వ్యాధికారక క్రిమి, దానికి సంబంధించిన పదార్థాలను ఆరోగ్యంగా ఉన్నప్పుడే టీకా రూపంలో తయారుచేసి ఇస్తారు. ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటిజెన్లు వ్యాధినిరోధక వ్యవస్థను ఎలా ప్రేరేపిస్తాయో ఈ టీకాలు కూడా వాటి లాగానే యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇవి మనకు భవిష్యత్తులో ఆయా వ్యాధికారక క్రిముల వల్ల మనకు జబ్బు రాకుండా రక్షణ కల్పిస్తాయి. ఇదీ స్థూలంగా టీకా కథ.
*ఎన్ని రకాలు?*
వ్యాధికారక క్రిములనే కాదు, దానిలోని యాంటి
జెన్లు, అది తయారుచేసే కొన్ని రకాల హానికరమైన ప్రొటీన్లను కూడా టీకాల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఇలా టీకా కోసం ఉపయోగించిన పదార్థాన్ని బట్టి వివిధ రకాల వ్యాధులకు వివిధ రకాల టీకాలున్నాయి.
• 👉🏻టీకాలను వ్యాధిజనక క్రిమిని శక్తిహీనం చేసి గాని, చంపి గాని, లేక దానిలోని యాంటిజెన్ ప్రొటీని ని .. ఇలా రకరకాలుగా తయారుచేస్తారు. వ్యాధికారక క్రిమికి యాంటిజెనెసిటీ (యాంటీబాడీ లను పేరేపించే తత్వం), పాథోజెనెసిటీ (వ్యాధిని కలిగించే శక్తి) రెండూ ఉంటాయి. కేవలం పాథోజెనెసిటీ లేకుండా చేసిన క్రిమిని టీకాగా ఇస్తే, దాన్ని లైవ్ అటిన్యుయేటెడ్ వ్యాక్సిన్ అంటారు. అతిసారవ్యాధికి ఇచ్చే రోటావైరస్ వ్యాక్సిన్ ఇలాంటిదే. ఇంతేకాకుండా నోటిలో చుక్కల రూపంలో ఇచ్చే ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఒపివి) కూడా ఈ రకమైనదే. దీనిలో పోలియో కలిగించే వైరస్‌ను శక్తిహీనం చేసి దాన్ని చుక్కల రూపంలో ఇస్తారు.
•👉🏻 కొన్ని రకాల క్రిములు శక్తిహీనం అయిన తరువాత వ్యాక్సిన్ రూపంలో శరీరంలోకి ప్రవేశించిన కొన్నాళ్లకు చైతన్యవంతం అవుతాయి. ఇలాంటి వాటికి లైవ్ వ్యాక్సిన్లు తయారుచేయరు. ఇలాంటప్పుడు ఆ క్రిమిని చంపివేసి టీకాగా తయారుచేస్తారు. దీన్ని కిల్డ్ వ్యాక్సిన్ అంటారు. దీనికి మంచి ఉదాహరణ ఇంజెక్టబుల్ పోలియో
వ్యాక్సిన్ (ఐపివి). ఈ పోలియో ఇంజెక్షన్ల ఖరీదు ఎక్కువ. కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మన ఇండియా పోలియోరహిత దేశం అయినప్పటికీ పోలియో డ్రాప్స్ పాటుగా ఒక డోసు ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ (ఐపివి)ని ఇవ్వడం ప్రారంభించి, తరువాత ఐపివినే కొనసాగిస్తారు.
• 👉🏻టీకా లక్ష్యం యాంటీబాడీలను తయారుచేయడం. కాబట్టి కొన్ని రకాల జబ్బుల కోసం యాంటిబాడీల ఉత్పత్తిని ప్రేరేపించే ప్రతిజనకాన్ని మాత్రమే క్రిమి నుంచి సేకరిస్తారు. దీన్ని టీకాగా రూపొందిస్తే దాన్ని కాంజుగేట్ వ్యాక్సిన్ అంటారు. న్యూమోకోకల్, మెనింజోకోకల్ వ్యాక్సిన్లు ఇలాంటివే. టైఫాయిడ్ టీకా కూడా ఇప్పుడు ఈ కోవలోకే చేరింది. 65
👉🏻టైఫాయిడ్‌కి మొదట 1978లో మొదట ఫినాల్ కిల్అ వ్యాక్సిన్ తయారుచేశారు. అయితే ఈ టీకా తీసుకున్న తరువాత చేయి వాచిపోయి, జ్వరం లాంటి సాధారణ సమస్యలు కలిగాయి. అందుకే దీన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడం కోసం లైవ్ ఓరల్ టైఫాయిడ్ వ్యాక్సిన్‌ని తయారుచేశారు. అయితే దీని సమర్థత కేవలం 60 నుంచి 65 శాతం మాత్రమే. వ్యాధికారక శక్తిని నశింపచేసినప్పుడు దానితో పాటుగా యాంటిజెనిసిటీ కూడా తగ్గుతుంది. అందువల్ల లైవ్ అటిన్యుయేటెడ్ వ్యాక్సిన్లు కొన్నిసార్లు అంతగా సమర్థంగా ఉండవు.
ఈ సమస్యను అధిగమించడానికి తయారైందే టిసివి • టైఫాయిడ్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్. దీన్ని మనదేశం లోనే భారత్ బయోటెక్ వాళ్లు తయారుచేశారు. ఇది మొట్టమొదటి కాంజుగేట్ వ్యాక్సిన్.
• 👉🏻కొన్ని రకాల సూక్ష్మజీవులు విడుదల చేసే విషపదార్థాల వల్ల జబ్బులు వస్తాయి. ఇలాంటప్పుడు జబ్బుకు కారణమయ్యే విషపదార్థం నుంచి తయారుచేసే టీకాను టాక్సాయిడ్ వ్యాక్సిన్ అంటారు. క్రిమిలో ఉండే టాక్సిన్ (విషపదార్థం) ప్రభావాన్ని తీసేసి
దాన్ని టాక్సాయిడ్గా మారుస్తారు. ఇలా తయారుచేసిన టాక్సాయిడ్ వ్యాక్సిన్‌ను ఇస్తే యాంటీ టాక్సిన్స్ తయారవుతాయి. దీనికి మంచి ఉదాహరణ డిప్తీరియా వ్యాక్సిన్.
👉🏻యాంటిజెన్ కూడా ఒక ప్రొటీన్. ఈ ప్రొటీన్తయారీకి కారణమయ్యే జన్యు ప్రోబ్‌ను తీసుకుని దాన్ని యాంప్లిఫికేషన్ ద్వారా అసంఖ్యాక నమూనాలు తయారుచేస్తారు. వీటిని ఈస్ట్ కణాల్లోకి ఎక్కిస్తారు. ఈస్ట్ కణాలు అత్యంత వేగంగా పెరిగేకణాలు. మనకు అవసరమయ్యే యాంటిజెన్ నన్ను కలిగివున్న సూక్ష్మజీవిని కల్చర్చేసి పెంచడానికి పట్టే సమయం కన్నా ఈస్ట్ కణాల పెరుగుదలకు అతి తక్కువ సమయం చాలు. అందువల్ల తక్కువ సమయంలో మనకు కావలసిన యాంటిజెన్ సమృద్ధిగా లభిస్తుంది. దీన్ని వ్యాక్సిన్‌గా తయారుచేసి ఇస్తారు. దీనికి ముఖ్యమైన ఉదాహరణ హెచ్బివి.
👉🏻• గతంలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ (హెచ్బివి)ని బెల్జియం కంపెనీ ఒకటే తయారుచేసేది. కాబట్టి దాని ధర వేలల్లోనే ఉండేది. మన రాష్ట్రంలోని శాంత బయోటెక్ వాళ్లు దీన్ని రీకాంబినెంట్ డిఎన్ఎ టెక్నాలజీని ఉపయోగించి తయారుచేయడంలో విజయం సాధించారు. తరువాత దీని ధర ఒక్కసారిగా పదుల్లోకి పడిపోయింది. ఇప్పుడు భారత్ బయోటెక్ వాళ్లు ఎబోలా వైరస్‌కి రీకాంబినెంట్ వ్యాక్సిన్‌ను తయారుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంకా ట్రయల్స్‌లో ఉంది.
👉🏻జబ్బులు ఎక్కువైనప్పుడు వాటిని నివారించే టీకాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఇన్ని వ్యాక్సిన్లను తీసుకోవడం ఇబ్బంది కాబట్టి, కొన్ని రకాల వ్యాక్సిన్లను కలిపేసి, ఒకే వ్యాక్సిన్‌గా తయారుచేస్తారు. ఇలాంటిదాన్నే కాంబినేషన్ వ్యాక్సిన్ అంటారు. మూడు, నాలుగు టీకాలను కలిపి ఒకే టీకాగా ఇస్తారు. • 3 రకాల వ్యాక్సిన్లు కలిపి ఇస్తే ట్రిపుల్ వ్యాక్సిన్
అంటారు. ట్రిపుల్ పోలియోలో టైప్ 2, 3
వైరస్‌లుంటాయి. వీటిలో 1వ రకం రావడం తగ్గిన
తర్వాత దీన్ని బైవలెంట్ వ్యాక్సిన్‌గా మార్చారు. ఇందులో 2, 3 రకాల పోలియో వైరస్‌లను ఉపయోగించేవారు. మొన్నటివరకు మన దేశంలో మిగిలిన పోలియో వైరస్ 1వ రకంది మాత్రమే. అందువల్ల దీన్ని మోనోవలెంట్ పోలియో వ్యాక్సిన్‌గా 2వ రకం వైరస్‌ను మాత్రమే ఉపయో గించి ఇచ్చారు. డిక్తీరియా, పర్చుసిస్ (కోరింత దగ్గు), టెటానస్ (ధనుర్వాతం)లకు కలిపి ట్రిపుల్ యాంటిజెన్ (డిపిటి) ఇస్తున్నారు. మీజిల్స్ (తట్టు), మమ్స్ (గవదబిళ్లలు), రుబెల్లా వ్యాధులకు కలిపి ఎంఎంఆర్ ఇప్పించాల్సి ఉంటుంది. 4 రకాల టీకాలను కలిపితే క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్ అంటారు. డిపిటి వ్యాక్సిన్‌కి హిబ్ (HiB) (హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి) వ్యాక్సిన్‌ను కలిపి తయారు చేస్తారు. డిపిటికి హెచ్బివి (హెపటైటిస్ బి వైరస్) వ్యాక్సిన్‌ను కూడా కలుపుతారు.
పెంటావలెంట్ వ్యాక్సిన్లు
ఇటీవల ఈ పదానికి ప్రాధాన్యం పెరిగింది. 5 రకాల వ్యాధులకు కలిపి ఈ పెంటావలెంట్ వ్యాక్సిన్‌ను తయారుచేశారు. త్వరలో ఇది పూర్తి ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానుంది. పెంటావలెంట్ వ్యాక్సిన్‌లో డిపిటి, హిబ్, హెచ్బివిలను ఒకేసారి ఇస్తారు.
👉🏻• వీటిలో హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి (హిబ్- HiB) టీకా కూడా ఉండడం మరింత ప్రయోజనకరం. ఎందుకంటే న్యుమోనియాతో పాటు మెదడులో ఇన్ఫెక్షన్లు, మెనింజైటిస్,
ఆర్థరైటిస్, చెవిలో ఇంక్షన్లు (ఆటైటిస్), సైనసైటిస్, రక్తంలో ఇన్ఫెక్షన్స్ రావడానికి హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా నీ ఫాన్-HiB) అనే బాక్టీరియా కారణమవుతున్న మంచ మాన దేశాల్లో హిబ్ వల్ల 5 ఏళ్లలోపు చిన్నారులు, మ్యుమోనియా, బాక్టీరియల్ మెనింజైటిస్లకు పరవుతున్నారు. టీకా అసలే వేయించకపోయినా, టీకాను పూర్తి డోసులో ఇప్పించక అశ్రద్ధ చేసినా, వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడి ఉన్నా హిబ్ దాడి చేస్తుంది. ఇండియాలో 72 వేలమంది ప్రతి ఏటా దీనివల్ల మరణిస్తున్నారు. 60 వేల మంది హిబ్ వల్ల కలిగే న్యుమోనియాతో, హిబ్ మెనింజైటిస్ వల్ల 9వేల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. 1988 నుంచి హిబ్ టీకా అందుబాటులో ఉంది. ఇప్పటికి 99 శాతం వరకు తగ్గిపోయింది. అయితే వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ దాని వల్ల కలిగే మెనింజైటిస్ వల్ల చెవుడు, పక్షవాతం, బుద్ధి మాంద్యం లాంటి దీర్ఘకాలిక సమస్యలకు గురవుతున్నారు. అందువల్ల ఈ టీకా కూడా ముఖ్యమైనది. ఇప్పుడు పెంటావలెంట్ వ్యాక్సిన్‌లో దీనికి కూడా చోటు ఉంది. భారత ప్రభుత్వం దీన్ని రెండున్నరేళ్ల క్రితం విడుదల చేసింది. దీన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.
© 4 నుంచి 18 నెలల వయసు పిల్లల్లో న్యుమోనియా సర్వసాధారణం. కొంతమంది పిల్లల్లో ఎటువంటి లక్షణాలుండవు గాని వారిలో వైరస్ ముక్కు, గొంతుల్లో ఉంటుంది. వీళ్ల నుంచి ఇతరులకు దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుంది. దీనికి పెంటావలెంట్ వ్యాక్సిన్ ఇప్పించడం సురక్షితం. ఈ టీకా వల్ల ఎక్కువ ఇంజెక్షన్లను గుచ్చే పని తగ్గుతుంది. ఈ వ్యాక్సిన్ ద్వారా తెలంగాణాలో 6.31 లక్షల మంది లబ్ధి పొందారు.
హైదరాబాదీ వ్యాక్సిన్.. కుక్కల దవాఖాన!
© 1920-30ల కాలం నుంచి హైదరాబాద్
లోని నారాయణగూడ ప్రాంతంలో ఓ కుక్కల దవాఖాన ఉంది. కుక్కల దవాఖాన అంటే కుక్కలకు మందులిచ్చే ఆస్పత్రి కాదు. పిచ్చికుక్క కాటు ద్వారా వచ్చే రేబిస్ వ్యాక్సిన్‌ను ఇక్కడ తయారుచేసి ఇచ్చేవాళ్లు. ఇందుకు కావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం అంతా నిజాం ప్రభుత్వానిదే.
ప్లేగు, కలరా(గత్తర్) కూడా అప్పట్లో ప్రజల్ని భూతాల్లా భయపెట్టాయి. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయేవి ఈ జబ్బుల వల్ల. ఒకవైపు పారిశుద్ధ్యంపై అవగాహన కలిపిస్తూ, మరోవైపు టీకాలు వేయడం వల్లనే కలరా కంట్రోల్ అయింది. ప్లేగు వ్యాధి కూడా తగ్గిపోవాలని కులీకుతుబ్‌షా చార్మినార్ దగ్గరే ప్రార్థనలు చేశాడట. ఆ వ్యాధి నిర్మూలన జరిగిందానికి గుర్తుగానే చార్మినార్‌ను కట్టించాడట
వయసులో.. ఏ టీకా?
• పుట్టగానే బిసిజి, పోలియో చుక్కలు, హెచ్బివి మొదటి డోసు
• 6 వారాలు డిటిఎపి/డిపిటి - 1, ఐపివి/ పోలియో చుక్కలు(ఒపివి) -1, హెచ్బివి-2, హిబ్-1, పిసివి-1, రోటా వైరస్ వ్యాక్సిన్-1
© 10 వారాలు - డిటిఎపి-2/డిపిటి -2, హిబ్- 2, పిసివి-2, రోటావైరస్ వ్యాక్సిన్-2
© 14 వారాలు డిటిఎపి/డిపిటి-3, ఐపివి/ పోలియో చుక్కలు-3, హిబ్-3, పిసివి-3
© 14-24 వారాలు హెచ్బివి - 3
© 6 నెలలు - ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్-1
© 7 నెలలు - ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్-2
© 9 నెలలు - తట్టు (మీజిల్స్ వ్యాక్సిన్)
© 12 నెలలు - హెపటైటిస్-ఎ
• 15 3 (చికెన్ పాక్స్) ఎంఎంఆర్-1, వేరిసెల్లా-1
© 18 నెలలు - డిటిఎపి/డిపిటి-1 బూస్టర్, ఐపివి/ పోలియో చుక్కలు (ఒపివి) 1 బూస్టర్, హిబ్ 1 బూస్టర్, పిసివి 1 బూస్టర్, హెపటైటిస్ ఎ-2
© స్పెషల్ సిట్- పిపివి 23
• 2 సంవత్సరాలు - టైఫాయిడ్ వ్యాక్సిన్ (3 ఏళ్ల తరువాత బూస్టర్)
© 4-5 సంవత్సరాలు డిటిఎపి/డిపి-2 బూస్టర్, ఐపివి/పోలియో చుక్కలు-2 బూస్టర్, వేరిసెల్లా-2 (చికెన్ పాక్స్)
© 5-9 సంవత్సరాలు - ఎంఎంఆర్-2
© 10 సంవత్సరాలు – హెచ్పివి 1
© 2 నెలల తరువాత హెచ్పివి 2
• 6 నెలల తరువాత హెచ్పివి 3
© 10 సంవత్సరాల తరువాత - టిడిఎపి
© 15 సంవత్సరాల తరువాత - టిడిఎపి
*అపోహలు వద్దు!*
© టీకా ఇప్పించిన తరువాత పసిపిల్లలకు జ్వరం రావడం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట ఎర్రగా కందిపోయి, వాచిపోవడం సాధారణంగా కనిపి స్తుంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరిలోనూ రావు. లక్ష మందిలో ఒకరికి ఇలాంటి సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యలు అందరిలోనూ కనిపించకపోవడానికి కారణం వారి జన్యుతత్వమే. టీకా ఇచ్చినప్పుడు మొత్తం వ్యాధినిరోధక వ్యవస్థ ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఇలాంటప్పుడు యాంటీబాడీలను తయారుచేసే కణాలతో పాటుగా ఇతరత్రా వ్యాధినిరోధక కణాలు (ఇమ్యూన్ సెల్స్) కూడా పనిచేస్తాయి. వీటిలో సైటోకైన్స్ ఒకటి. టీకా ఇచ్చినప్పుడు చైతన్యమయ్యే సైటోకైన్స్ రకం, అవి చర్యలు జరిపే తీరు ప్రతి ఒక్కరిలోనూ ఒకేవిధంగా ఉండకపోవచ్చు. కాబట్టి కొందరిలో మాత్రమే ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తాయి. ప్రాణ రక్షణ కల్పించే టీకా వల్ల పెద్ద ఎత్తున కలిగే లాభం ముందు ఇదంత పెద్ద విషయమి కాదు. టీకాలు తీసుకోకపో వడం వల్ల ప్రతి వెయ్యిమందికి 30 మంది మీజిల్స్ (తట్టు) వస్తున్నది. వెయ్యిలో 20 మందిని కోరింత దగ్గు (పర్చుసిస్) బారి నుంచి కాపాడ వచ్చు. ప్రతి వెయ్యి ప్రసూతిy మరణాల్లో ధనుర్వా తం వల్ల 10 మంది తల్లీబిడ్డలు మరణిస్తున్నారు. టీకా ద్వారా వందశాతం దీన్ని అరికట్టవచ్చు. సాధారణంగా ఏ జబ్బుకైనా వ్యాక్సిన్
కణాలు అత్యంత వేగంగా పెరిగే
కవరేజి 80 శాతానికన్నా ఎక్కువ ఉంటే ఆ వ్యాధి నిర్మూలింపబ డినట్టే. కాని మనం చాలా జబ్బులకు కనీసం 60 శాతం కూడా దాటలేదు. 1978 నుంచే టీకాలకు సంబంధించిన జాతీయ పథకాలు ప్రారంభమ య్యాయి. 1985లో ఈపీఐ (ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్), 1990లో యూఐపీ (యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్) మొదలయ్యాయి. కాని కవరేజ్‌లో ఫెయిల్ అవుతు న్నాయి. దీనికి అపోహలు ఎక్కువ, అవగాహన తక్కువ ఉండడమే ప్రధాన కారణం. లేకుంటే చాలా జబ్బులు ఇప్పటికే నిర్మూలింపబడి ఉండేవి. 29 శాతం శిశుమరణాలను ఇమ్యునైజేషన్ (టీకాలు ఇప్పించడం) ద్వారా తగ్గించవచ్చు. పారిశుద్ధ్యం లాంటి అంశాలు కూడా వ్యాధుల నిర్మూలనలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాని వాటి కన్నా టీకాల ద్వారా జరిగే వ్యాధి నిర్మూలన వేగవంతంగా ఉంటుంది. ఏడాదికి 1.1 లక్ష మందిని న్యుమోనియా వల్ల మరణించకుండా కాపాడుకోవచ్చు. పీసీవీ (న్యూమోకోకల్ వ్యాక్సిన్) వేయించుకోవడమే దీనికి ఉత్తమ మార్గం. తట్టు, హిబ్, కోరింతదగ్గు, ఇవన్నీ న్యుమోనియాకు కారణం అవుతాయి. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన పెంటావలెంట్ వ్యాక్సిన్ మరింత సౌకర్యవంతంగా రక్షణ కల్పిస్తుంది. టీకాల పట్ల అపోహలు వీడి తల్లిదండ్రులు ముందుకు రావాలి...
No comments:
Post a Comment