Sunday, October 26, 2025

 *🕉️🙏'జై శ్రీకృష్ణ' 🕉️🙏*

🕉️🙏
*'కృష్ణం వందే జగద్గురుమ్'*
🕉️🙏

🕉️🙏
*'శ్రీమద్భగవద్గీత'*
🕉️🙏

*🕉️🙏'3.కర్మ యోగం' 🕉️🙏*

*ఏ కామమూ(కోరిక)*
లేకుండా 
ఊరక కూచుంటే
దినచర్య ఎలా జరగాలి.
దినచర్య అంటే 
*'కర్మే'* గదా.
*'కామం'(కోరిక)*
లేకుండా 
*'కర్మ'*
 ఎలా చేయగలం.
*'నహికశ్చిత్ క్షణమపి'*
ఒక్క క్షణం కూడా 
ఊరకకూచోలేడెవడూ 
*'నిద్ర తప్ప'.*
అప్పుడు
*'కామం' లేదు.'కర్మ'లేదు.*
కాని 
దాని 
*'వాసన'* 
లుంటాయి.
అవి మరలా 
*'జాగ్రత్తు'* లో
బయట పడతాయి.
ఇక ఎప్పుడీ 
*'కర్మ బంధం'* 
నుంచి 
*విముక్తి❓*

*'కర్మ'* 
అంటే 
చేయటమూ,
*'నిష్కర్మ'* 
అంటే 
మానటమూ కాదు.❗
ఏ పని చేసినా
అది
*'మానసికమే' కాదు,*
*'వాచికము' కాదు,*
*'కాయకమే' కాదు,*
*'యజ్ఞార్ధమని'* 
చేస్తూ పోవాలి.

యజ్ఞమంటే ❓
*'ఈశ్వర స్వరూపం'.*
*'ఈశ్వర చైతన్యమే'*
నాచేత 
ఈ 
*'పని'*
చేయిస్తున్నదని
భావించాలి.
అప్పుడే
*'నేననే'* 
*'అహంకారం'* 
పోతుంది.
*'ముక్తసంగుడయి'*
చేయాలి కూడా.
అంటే 
*'ఫలితం'* 
నాకు అనుకూలించాలనే
*'కామం'(కోరిక)* 
కూడా పనికిరాదు.
అదీ 
ఆ ఈశ్వరుడికే
*'అప్ప జెప్పాలి'.*
అప్పుడు 
*'మమకారం'* 
కూడా తొలగిపోతుంది.
*'అహం మమలు'*
రెండు పోతే 
*'కామం'(కోరిక)* లేదు.
*'కర్మ'* లేదు.

అవి ఉన్నా 
జీవుడివి కావు.
జీవుడీశ్వరుడికి
అర్పించాడు.
కాబట్టి ఈశ్వరుడివే.
జీవకర్మ ఈశ్వరుడి కర్మ.
జీవుడి కామం
ఈశ్వర కామమే.
*'ఇదీ'* 
*'కర్మయోగ సూత్రం'.*
🕉️🙏

🕉️🙏
*'విశ్వసాక్షి సుఖీభవ'*
🕉️🙏

🕉️🙏
*'సర్వం కృష్ణార్పణ మస్తు'*
🕉️🙏

No comments:

Post a Comment