Friday, October 31, 2025

 ఆకలితో నువ్వు పస్తుంటే 
నీ రెక్కలు ఎండిపోయేరా 
నా కొడుకా...

చెట్టు చెట్టుకి చెబుతున్న 
నీ కడుపు నింపమని 
నా కొడుకా... 

నిద్దుర లేఖ నువ్వుంటే
 నీ కన్నులు ఎర్రగా మారేరా 
నా కొడుకా... 

నీలి మబ్బుతో చెబుతున్న
 నీ జోల పాడమని 
నా కొడుకా... 

మనిషికి మనిషే దూరము రా 
ఇది మాయా లోకపు ధర్మము రా... 

*అందుకే...!*
"దేవుడు అన్ని చోట్ల తను ఉండలేక, తల్లిని సృష్టించాడు..

తల్లి ప్రేమ ఎలాంటిది అంటే
తీరాలను తాకే అల లాంటిది

ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా 
వాటన్నింటినీ తట్టుకొని తన కొడుకుకి స్వచ్ఛమైన ప్రేమను పంచుతుంది...

నువ్వు ఎంత వద్దనుకున్నా,
చివరి వరకు వచ్చేది తల్లి ప్రేమ ఒక్కటే...!

*జీవితంలో త్యాగం చేసేది నాన్న"*

*జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ...!!*

No comments:

Post a Comment