*శ్రీ రమణాశ్రమం* - *శ్రీ విశ్వనాథ స్వామి ఆరాధన*
〰️〰️〰️〰️🌻🌷〰️〰️〰️〰️
ఈ రోజు (22/10/2025) శ్రీ రమణాశ్రమంలో శ్రీ విశ్వనాథ స్వామి ఆరాధన జరిగింది.
ఆయన సమాధి వద్ద అభిషేకం, హారతి నిర్వహించారు. వేదపారాయణ అనంతరం అక్షరమణమాల పఠనం నిర్వహించారు. శ్రీ విశ్వనాథ స్వామి అద్భుతమైన సంస్కృత మరియు తమిళ పండితులు మరియు భగవాన్ యొక్క అనేక గ్రంథాలను వారు అనువదించారు. శ్రీ భగవాన్‌తో అతని ప్రారంభ సంవత్సరాల్లో చోటు చేసుకున్న అంశాలు మరియు శ్రీ రమణుల జీవితంలోని చివరి కొన్ని గంటల్లో భగవాన్ వర్షించిన అనుగ్రహానికి సంబంధించిన ఘట్టాలను శ్రీ విశ్వనాథ స్వామి తన రచనలలో ఎంతో మనోహరంగా ఆవిష్కరించారు. అంతే కాకుండా వీరు శ్రీ రమణ అష్టోత్తరం కూడా రచించారు.
అతని జీవిత చరిత్ర సంక్షిప్తంగా క్రింద ఇవ్వబడింది:
శ్రీ విశ్వనాథస్వామి తన 17వ ఏట 1921లో స్కందాశ్రమంలో శ్రీ భగవానులను దర్శించుకున్నారు. ఆయన తండ్రి రామసామి అయ్యర్ దిండిగల్‌లో న్యాయవాది. రామస్వామి అయ్యర్ శ్రీ భగవాన్‌కు మేనమామ. 1923లో శ్రీ భగవాన్ శ్రీడయార్ సమాధి కుటీరంలో ఉన్నప్పుడు విశ్వనాథ స్వామి ఇక్కడకు వచ్చి బస చేశారు.
అష్టావక్రగీత, తిరుచ్చుళి పురాణం, రమణగీతలను తమిళంలోకి అనువదించిన మహనీయులు శ్రీ విశ్వనాథ స్వామి. "టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి" అనే ఆంగ్ల గ్రంథాన్ని తమిళంలోకి 'వచనామృతం' అనే పేరుతో శ్రీ విశ్వనాథ స్వామి అనువదించారు. ప్రసిద్ధ శ్రీ రమణ అష్టోత్తరాన్ని కూడా రచించారు. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షులవారి జీవితం మరియు బోధనలలోని చారిత్రక మరియు ఉపదేశ భాగాలతో నిండి ఉండటం విశేషం. విశ్వనాథ స్వామి రచించిన శ్రీ రమణ అష్టోత్తరాన్ని, శ్రీ రమణులు స్వయంగా, క్షుణ్ణంగా మరియు వివరంగా పరిశీలించి ప్రశంసించారు.
పెక్కు ఆశ్రమ ప్రచురణలకు శ్రీ విశ్వనాథ స్వామి ముందుమాట అందించారు. 1964లో విశ్వనాథ స్వామి ఆశ్రమంలో ప్రారంభమైన 'మౌంటెన్ పాత్' అనే ఆంగ్ల పత్రికకు 1973 నుంచి 1979 వరకు సంపాదకులుగా ఉంటూ అద్భుతమైన సంపాదకీయాలు రాశారు. ఆశ్రమానికి వచ్చే కొత్త భక్తులకు శ్రీ భగవాన్ ఉపదేశాలను సరళంగా వివరించేవారు. ఈ భక్తుడు 22-10-1979న భగవాన్ పాద కమలములను చేరారు. అతని సమాధి ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడింది.
సేకరణ : *"శ్రీ రమణ మహర్షి"* ముఖపుస్తకం నుండి
No comments:
Post a Comment