Saturday, October 25, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩
25/10/25

1) ముక్కూ మొహం తెలియని అపరిచితుడినైనా నమ్ముతామే గాని దేవుడ్ని అస్సలు నమ్మం, నమ్మినట్టు నటిస్తాం. ఆ విషయం మనకు, దేవుడికి మాత్రమే తెలుసు.

2)తత్త్వం తెలిసినవాడికి లోకం పిచ్చిది. తాత్త్వికుడు లోకానికి పిచ్చివాడు.

3)నీవు ఒక్కడివి లేనే లేవు అని నికరంగా నీవు తెలిసికుంటే నీకు మాయ లేదు. మంత్రం లేదు. ఆ తెలిసికొనే నీవే అసలైన నీవు. 

4)సన్యాసం అనేది మన సనాతన ధర్మం కాదు. అది బౌద్ధం. భార్య లేని ఋషి లేడు మన వేదాల్లో .

5)శాస్త్రం వలన పొందడం జరగదు.
పొందిన తరువాత శాస్త్రం రూఢి పరుస్తుంది.
శాస్త్ర ప్రయోజనం అంతవరకే.

6)“దైవమే కుటుంబ రూపంగా ఉన్నది” అన్న సత్యాన్ని తెలుసుకున్న బుద్ధిమంతుడే జ్ఞాన స్వరూపుడు.

No comments:

Post a Comment