🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺
*కేదారేశ్వర వ్రతం –*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
కేదార గౌరీ వ్రతం లేదా కేదార వ్రతం అనేది శివుని భక్తులకు ఒక ముఖ్య మైన ఉపవాస ఆచారం, సాధారణంగా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పాటిస్తారు.
దీపావళి అమావాస్య రోజున జరుపుకుంటారు, ఇది దీపావళి సమయంలో లక్ష్మీ పూజ రోజుతో సమానంగా ఉంటుంది.
ఈ కేధార వ్రతాన్ని ఆశ్వయుజ బహుళ అష్టమి నుండి ఆచరిస్తారు మరియు ఆశ్వయుజ అమావాస్య నాడు ముగిస్తారు.
*కానీ, ఆచరణలో కేదార గౌరీ వ్రతం ఒకే రోజు అంటే దీపావళి అమావాస్య రోజున నిర్వహిస్తారు.’*
ఇది భార్యాభర్తలిద్దరూ కలిపి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకోవచ్చు. భార్యకు వీలుకాక పోతే మాత్రం భర్త ఒక్కడే చేయ కూడదు. వివాహంకాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చు. ముందుగా 21 పేటల పట్టు దారాన్ని కాని, నూలు దారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. కలశంలోకి, ప్రతిమలోకి కేదారేశ్వరుని ఆవాహన చేయాలి. 21 ఉపచారాలతో పూజ చేయాలి. గోధుమపిండితో 21 నేతి అరిసెలు వండాలి.పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం, అన్ని రకాల కూరలు, పళ్లు నివేదన చేయాలి. కథ చెప్పుకున్నాక అక్షింతలు వేసుకోవటం మర్చిపోకూడదు.ఇలా 21 సంవత్సరాలు చేయాలి. కేదారం అంటే మాగాణం. వరి పండే పొలం. దానికి అధిపతి కేదారే శ్వరుడు. పార్వతీదేవి ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తి హీనుడయిన గాథను వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రతకథ స్త్రీ పురుషుల సమానత్వాన్ని తెలియచేస్తుంది. గౌరీదేవి లేనిదే శివుడికి పూజలేదు. గౌరితో కూడిన సాంబశివుణ్ణి పూజించే అరుదైన వ్రతం ఇది.
No comments:
Post a Comment