🙏 *రమణోదయం* 🙏
*తాను ఒకరికి ఇస్తానని ముందే యిచ్చిన మాటతప్పి, తర్వాత ఇవ్వకుండా నిరాకరించటం అనధికారికి చెప్పే వేదాంతం కంటే కూడా తప్పు.*
మరొక భావం: *పరిపక్వత లేని వానికి "ఆత్మయే పరవస్తువు" అనే సత్యాన్ని చెప్పటం చెప్పేవాని దోషమే అవుతుంది. ఇంతకుముందు అతనికి తాను చెప్పిన వ్యవహారిక సత్యాన్ని నిజమే అని నమ్మాడు. ఇప్పుడు దానికి మారుగా చెప్పిన పరమార్థ సత్యాన్ని అతడు అసత్యమని నిరాకరిస్తాడు.*
'నా శరీరం' అనుకునే శరీరం నాదికాదు.
'నా జీవితం' అనుకునే జీవితం నాదికాదు.
ఇది భగవంతుని శరీరం,
ఇది భగవంతుని నాటకం అని
స్థిమితంగా ఉండేవారు స్థితప్రజ్ఞులు!
నీవు అరుణాచలంలో ఉండటం కాదు.
నీవే అరుణాచలంలా ఉండు..
తనువును, మనసును కదలనీకు...
ఇదే గొప్ప సాధన!
కాశీకి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా
తనలో ఉండే దేవుడినే
తాను చూసేది.
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.820)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹

No comments:
Post a Comment