*(ఫిబ్రవరి 15 - 2026).. మహాశివరాత్రి మహాత్మ్యం....*
*బ్రహ్మ విష్ణువు.. తామిద్దరిలో ఎవరు గొప్ప అనే వాదోపవాదం లో ఉన్నప్పుడు.. ఈ సమస్యని పరిష్కరించడానికి పరమేశ్వరుడు అవయవరహితమై ఆద్యంతాలు తెలియడానికి వీలులేనంత ఎత్తుగా మహాలింగ రూపంలో సాక్షాత్కరించాడు. ఈ లింగానికి అద్యంతాలు తెలుసుకోవడమే విజయానికి చిహ్నంగా విష్ణువు వరహారూపంలో కిందకి, బ్రహ్మ హంసరూపంలో మీదకి ఎంతవెళ్ళినా ఆద్యంతాలు కనుగొనలేక పోయారు. కానీ గెలుపు కోసం మహాలింగం ఊర్ధ్వ భాగాన్ని చూసినట్లు చెప్పడానికి నిశ్చయించుకుని సాక్ష్యానికి కామధేనువు, మొగలిపూవు లను తోడు తెచ్చుకున్నాడు. తాను శిరస్సు దాకా వచ్చినట్లు మొగలిపూవుతో, శివలింగంపై పాలు అభిషేకం చేసి వస్తున్నట్లు కామధేనువుతో చెప్పమన్నాడు. వారిద్దరినీ వెంటబెట్టుకొని వచ్చిన బ్రహ్మ తాను మహాలింగాగ్రాన్ని చూశానని విష్ణువుతో చెప్పాడు. తాను మహాలింగ మూలాన్ని చూడలేకపోయానని విష్ణువు అంగీకరించాడు. బ్రహ్మ అసత్యం చెప్పాడని గ్రహించిన పరమేశ్వరుడు.. ఇకనుంచి నువ్వు పూజలకు అనర్హుడవు.. అని శపించాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మొగలిపూవును.. నువ్వు నా పూజకు పనికిరావని.. అని, కామధేనువును.. నీవు కూడా పూజకి అర్హురాలవు కావు.. అని శపించాడు. కామధేనువు.. స్వామీ నా తల అబద్ధం చెప్పినా నా తోక చెప్పలేదు కదా.. క్షమించమని ప్రాధేయపడింది. పరమేశ్వరుడు శాంతించి.. నీ తల పూజార్హం కాదు. నీ తోక, వెనుక భాగమే పూజకు యోగ్యం. గోమూత్రం పేడ లే పవిత్రం.. అని శాసించాడు. ఇది ఈశ్వరాజ్జ. అసత్యం పలికితే ఎంతటివారైనా శిక్షార్హులే.. పరమేశ్వరుని ఆగ్రహానికి గురి కావాల్సిందే. ఇదే మహాశివరాత్రి మనకిచ్చిన మహోన్నత సందేశం.. ఉపదేశం.. హితులకు సన్నిహితులకు మిత్రులకు అభిమానులకు.. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.. పరమేశ్వరుడి దయ మనందరిపై సర్వదా ఉండాలని కోరుకుంటూ.....*
No comments:
Post a Comment