Thursday, February 12, 2026

 *“జీవితం చిన్నది — ప్రేమించు.... నటించకు....*
 
“అరిచే వాడి కోపం కన్నా, మౌనంగా ఉండే వాడి కోపమే చాలా ప్రమాదకరం.”

“పరీక్ష లేకుండా వచ్చే విజయం పతనానికి దారి తీస్తుంది. కష్టాలను దాటి వచ్చే విజయం చరిత్రను సృష్టిస్తుంది. వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే ప్రయాణం కఠినంగా ఉండాలి.”

“నువ్వు చేసే ప్రతి సాయం తప్పకుండా తిరిగి వచ్చి నిన్నే చేరుతుంది.”

సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. నమ్మించు, నమ్మకద్రోహం చేయకు. జీవించు, నిన్ను నీవు మోసం చేసుకోకు.”

“అందం ముఖంలో మాత్రమే కాదు. కొన్ని సార్లు మనసులో, మరికొన్ని సార్లు మాటల్లో కూడా కనిపించాలి.”

“స్నేహాన్ని పువ్వుతో పోల్చవద్దు — వాడిపోతుంది. మంచుతో పోల్చవద్దు — కరిగిపోతుంది. ఆకుతో పోల్చవద్దు — రాలిపోతుంది. మీ నవ్వుతో పోల్చండి — శాశ్వతంగా నిలిచిపోతుంది.”

“అందరితో కలసి ఉండవచ్చు, అందరిలానే నవ్వవచ్చు. కానీ అందరినీ మనవాళ్లే అనుకోకూడదు.

 నటనతో కూడిన ప్రేమ — విషం కన్నా ప్రమాదకరం.

చెడు, దుష్టశక్తులనేవి ఏమీ సమస్య కాదు, మనిషి తన కోరికలు తీర్చుకోవటానికి, మరొకరిపై ఆ మాటలతో నిందిస్తారు.

నేను దేవుడిని పూలు అడిగాను, ఆయన వాన కురిపించాడు, తద్వారా తర్వాత పూలు పుష్పించాయి. 

ఇది అర్ధం ఐతే, దేవుడు ప్రకృతి మనకిచ్చే ప్రతి విషయం కాలంలో ఉపయోగిస్తాయనేది, మనకి అర్ధం అవుతుంది.

నువ్వు శాంతి ఆనందాలకోసం చేసే ప్రతిదీ, అంతకుముందు సహజంగా నీ వద్ద ఉన్న ఆనందాన్ని నాశనం చేస్తుంది.

No comments:

Post a Comment