Saturday, February 14, 2026

****ఓ స్త్రీ, నీ మనసు రేట్ ఎంత? | VALENTINES DAY SPECIAL | Anukula Vedam || Telugu Podcast

ఓ స్త్రీ, నీ మనసు రేట్ ఎంత? | VALENTINES DAY SPECIAL | Anukula Vedam || Telugu Podcast

https://www.youtube.com/watch?v=TtTUQv2l0Qg



Transcript:
(00:05) ఎక్కడైతే పరీక్ష ఉంటదో అక్కడ ప్రేమ ఉండదు. కేవలం వ్యాపారం మాత్రమే ఉంటది. అవును నేను వాడిన పదం కరెక్టే వ్యాపారం అసలు పరీక్ష అనేది ఎవరికి పెడతారు మీరు సంతకెళ్లి బియ్యం కొంటున్నారు. ఆ బియ్యాన్ని చేతిలోకి తీసుకొని నలిపి వాసన చూసి ఇది క్వాలిటీగా ఉందా లేదా అని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. అవునా అంటే మీరు పరీక్ష చేసేది ఒక వస్తువుని మరి ఒక మనిషిని పరీక్షిస్తున్నారు అంటే అర్థం ఏంటి అవతలి వ్యక్తిని మీరు మనిషిగా చూడటం లేదు ఒక వస్తువుగా ఒక సరుకుగా చూస్తున్నారు.
(00:39) వీడు నాకు పనికొస్తాడా వీడి వల్ల నాకేంటి లాభం వీడు నా భారాన్ని మొయ్యగలడా ఇది ప్రేమ లేక మార్కెట్లో దొరికే బేరమా? దయచేసి దీన్ని ప్రేమ అని పిలిచి ఆ పవిత్రమైన పదాన్ని కలుషితం చేయకండి. దీన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా వ్యాపారం అని అనండి. ఒప్పుకుంటాను నేను ఒక డీల్ కుదుర్చుకుంటున్నాను అని చెప్పండి ఒప్పుకుంటాను కానీ మీరేమంటారు అదేంటండీ అంత నిర్మోహమటంగా వ్యాపారం అంటున్నారు మరి జీవితాంతం తోడుండే లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త ఉండాలి కదా అని నిజమే 100% నిజం కానీ గుర్తుపెట్టుకోండి సెలెక్షన్ వేరు అఫెక్షన్ వేరు అడవిలో ఒక ఆడపులి
(01:13) మగపుల్లిని ఎంచుకునేటప్పుడు బలవంతుడిని వెతుక్కుంటది. ఎందుకంటే ప్రకృతికి నీ ఆనందంతో పని లేదు. ప్రకృతికి కేవలం సంతానోత్పత్తి మాత్రమే కావాలి. అందుకే ఆడవారి మైండ్ లో ఉన్న ఆ dఎన్ఏ లో ప్రకృతి సహజంగా ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసి పెట్టింది. బలవంతుడిని వెతుకు రక్షించేవాడిని పట్టుకో అని ఆమె నిన్ను పరీక్షించడం లేదు నీలో ఉన్న రిసోర్సెస్ ని పరీక్షిస్తుంది.
(01:35) ఆమె వెతుకుతుంది రాముణని కాదు ఒక రక్షకుడిని ఆమె కోరుకుంటుంది తోడ్ని కాదు ఒక సెక్యూరిటీ గార్డ్ ని నీ దగ్గర డబ్బు ఉందా పవర్ ఉందా సమాజంలో హోదా ఉందా రేపు పొద్దున ఆమెకి ఆమె పిల్లలకి నువ్వు రక్షణ ఇవ్వగలవా ఇంతే ఇది మాత్రమే చూస్తుంది. ఇది ప్రేమ కాదు బాస్ ఇది కేవలం సర్వైవల్ ఇన్స్టింట్ బ్రతకడానికి ఆడే ఒక ఆట.
(01:56) ఒక ఆడపక్షి మగపక్షి కట్టుకున్న గూడుని పరీక్షిస్తుంది. ఆ గూడు కట్టడానికి ఉపయోగించిన పుల్లలు గట్టిగా ఉన్నాయో లేదో పరీక్షిస్తుంది. అది స్ట్రాంగ్ గా ఉంటేనే లోపలికి వెళ్తది. మరి మనం కూడా అదే చూస్తుంటే మనుషులుగా ఉన్న మనకి పక్షులకి తేడా ఏంటి? నువ్వు ప్రేమ పేరుతో జంతు ప్రవృత్తిని సెలబ్రేట్ చేసుకుంటున్నా. పైగా దానికి సైకాలజీ అని పేరు పెట్టి బిల్డప్ ఇవ్వడం ఒకటి నిజాయితిగా ఒప్పుకోండి నా భవిష్యత్తు గురించి నాకు భయం అందుకే నా భయాన్ని పోగొట్టే సెక్యూరిటీ గార్డ్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాను అని చెప్పండి అంతేగాని నేను పరీక్షిస్తున్నాను అని చెప్పి దానికి ఏదో రొమాంటిక్ కలర్ ఇవ్వకండి ఎందుకంటే ఆ కలర్
(02:29) ఏదో ఒక టైంలో వెలిసిపోతుంది. అసలు పరీక్షించే వారికి తమ మీద తమకు నమ్మకం ఉందా ఫస్ట్ బాగా ఆలోచించండి. ఎవరైతే లోపల ఖాళీగా ఉంటారో ఎవరైతే తమ కాళ్ళ మీద తాము నిలబడలేరో వాళ్లే అవతలి వాళ్ళని పరీక్షిస్తారు. వాళ్ళ లాజిక్ చాలా సింపుల్ నేను అసంపూర్ణంగా ఉన్నాను నువ్వు వచ్చి నన్ను పూర్తి చేయాలి అని నా బరువు నేను మోయలేను నువ్వు మోస్తావా నా బాధ్యతలు నేను మోయలేను నువ్వు మోస్తావా నా మూడ్ స్వింగ్స్ నేను కంట్రోల్ చేసుకోలేను నువ్వు భరిస్తావా నా ఖర్చులు నేను భరించలేను నువ్వు భరిస్తావా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును అని వస్తే అప్పుడు ఐ లవ్ యు చెప్తారు దీన్నే
(03:05) కండిషనల్ లవ్ అంటారు అంటే కల్తి నెయ్యి లాగా కల్తి లవ్ అన్నమాట అంటే వీళ్ళు వెతుకుతుంది భర్తని కాదు భారాన్ని మోసే కూలి కూలీని వీళ్ళు వెతుకుతుంది లైఫ్ పార్ట్నర్ ని కాదు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఒక స్త్రీ లేదా పురుషుడు ఇంకొకరిని పరీక్షిస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళ ఒక రిలేషన్షిప్ కోసం వెతకడం లేదు వాళ్ళ బరువుని మోసే ఒక ఊతకర్ర కోసం వెతుకుతున్నారు.
(03:27) వాళ్ళకి ప్రేమ అక్కర్లేదు వాళ్ళకి ఒక సేవకుడు కావాలి. రేపు పొద్దున నీ దగ్గర ఆ సామర్థ్యం పోయిందనుకో ఆ ప్రేమ కూడా ఎగిరిపోద్ది. ఎందుకంటే ఆ ప్రేమ పుట్టిందే ఆ పరీక్షి తాలూకా రిజల్ట్ మీద. పునాదే వ్యాపారం అయినప్పుడు బిల్డింగ్ ఎలా నిలబడతది? ఇక మన మగ మహారాజులు వీళ్ళ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అనే స్టేజ్ లో ఉన్నారు. ఎందుకంటే అమ్మాయిలు టెస్ట్ చేస్తారు సరే మరి మీకుేమైంది మీరెందుకు ఆ టెస్ట్ రైడ్ అని క్యూ లో నిలబడుతున్నారు మీకు సిగ్గు లజ్జ ఆత్మగౌరవం లాంటివి ఏవి లేవా మీరు ఒక బిచ్చగడ్డల తయారవుతున్నారు.
(03:57) మీకు ఆమె శరీరం కావాలి లేదా ఆమెతో సాన్నిహిత్యం కావాలి దానికోసం ఎంత దిగజారడానికైనా సిద్ధం ఏమిటిది నువ్వు నన్ను టెస్ట్ చేయి నేను నీకోసం 10 గంటలైనా వెయిట్ చేస్తాను నా ఫ్రెండ్స్ నైనా వదిలేస్తున్నాను అంటున్నావ్ నువ్వు ఎంతగా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావో అంతగా నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావ్ ఆమె పెట్టిన కండిషన్లకి ఆమె గీసిన గీతలకి లోబడి బ్రతికేవాడు ప్రేమికుడు అవ్వడు పెంపుడు జంతువు అవుతాడు నిజమైన మగాడు అంటే ఎవరో తెలుసా నన్ను నేనుగా అంగీకరిస్తే రా అంతేగానీ నీ కొలబద్దలో నన్ను కొలవడానికి కాదు నేను సూపర్ మార్కెట్ లో అమ్ముడిపోయే
(04:30) వస్తువుని కాదు నీకు నచ్చినట్టు పేక అయి ఉండడానికి అని చెప్పగలిగేవాడు. ఆమెకి భయం మీకు భయం ఇద్దరు భయస్తులే ఇద్దరు భయస్తులు కలిసి ఉండేదాన్ని మీరు ప్రేమ అనుకుంటున్నారు. రెండు సున్నాలు పక్క పక్కన పెడితే దాని విలువ ఎంత ఒక పెద్ద బండ సున్నా అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి నీ కళ్ళ ముందు ఒక అందమైన పువ్వు ఉంది.
(04:54) దాన్ని ప్రేమిస్తే దాన్ని అలాగే చూస్తావ్ దాని వాసనని ఆస్వాదిస్తావ్. అంతేగాని ఈ పువ్వురేకులు గట్టిగా ఉన్నాయా ఇది రేపు రాలిపోద్దా దీని మార్కెట్లో అమ్మితే నాకెంత వస్తది అని పరీక్షిస్తావా ఒకవేళ నువ్వు అలా పరీక్షిస్తున్నావు అంటే నువ్వు దాన్ని వాడుకుందామని చూస్తున్నావు అని అర్థం రిలేషన్షిప్ లో కూడా అంతే మీరు ఎప్పుడైతే అవతల వ్యక్తిని పరీక్షిస్తున్నారో మీరు అహంకారంలో ఉన్నారు.
(05:18) నేను జడ్జ్ ని నువ్వు ముద్దాయివి నిన్ను నేను జడ్జ్ చేస్తాను ఏంటిది ప్రేమలో జడ్జ్లు జడ్జిమెంట్లు అనేవి ఉండవు. అక్కడ ఇద్దరూ సమానమే సముద్రం నదిని టెస్ట్ చేయదు స్వీకరిస్తది ఆకాశం భూమిని టెస్ట్ చేయదు ఆలింగనం చేసుకుంటది అంటే ప్రకృతి ఎప్పుడు పరీక్షించదు పరవసిస్తుంది. నువ్వు ఇలా మారితేనే నువ్వు ఇది నిరూపిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనేది ప్రేమ కాదు అదిఒక బేరవం మాత్రమే కాబట్టి అమ్మాయిలకు ఒక మనవి మీరు పరీక్షిస్తున్నారు అంటే మీకు ఇంకా మనుషులని చదవడం రాలేదని అర్థం.
(05:47) నిజాయితిగా ఉండండి నాకు భయంగా ఉంది నాకు ఒక తోడు కావాలని అడగండి. ప్రపంచం మొత్తం మీ కాళ్ళ దగ్గరికి వస్తది. కానీ ఈ టెస్ట్లు గేమ్స్ మైండ్ ట్రిక్లు ప్లే చేసి అబ్బాయిల్ని మాయ చేయకండి. మీక సో కాల్డ్ మగపురుషులారా జీవితం అంటే ఎగ్జామ్ హాల్ కాదు మీరు ఆన్సర్ షీట్లు నింపడానికి రిలేషన్షిప్ అంటే అదేదో ఇంటర్వ్యూ కాదు మీరు సెలెక్ట్ అవ్వడానికి నిన్ను నువ్వుగా ఇష్టపడే వారితో ప్రయాణించు టెస్ట్లు పెట్టే అమ్మాయిలకి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపించు.
(06:11) సో వ్యాపారం చేయాలనుకుంటే సంతక వెళ్ళండి ప్రేమ కావాలనుకుంటే మీ మైండ్ లో ఉన్న కొలబద్దల్ని కింద పడేయండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ఈ ఒకరికొకరు పెట్టిన టెస్ట్లఅన్నీ రాసుకుంటూ కూర్చుంటే చివరికి మిగిలేది రిజల్ట్ షీట్ మాత్రమే జీవితం కాదు మీరే ఆలోచించండి

No comments:

Post a Comment