Sunday, February 15, 2026

కామం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? | మితిమీరిన కామం అతి ప్రమాదకరం? | Part-1..

కామం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? | మితిమీరిన కామం అతి ప్రమాదకరం? | Part-1..

https://www.youtube.com/watch?v=0ChmQQbtt8M



Transcript:
(00:00) కామం ఎందుకు అంత ప్రమాదం మితిమీరిన కామం మనల్ని ఎలాంటి స్థాయికి తీసుకెళ్తుంది ఎలా మనల్ని నాశనం చేస్తుంది ఈరోజు తెలుసుకుందాం. మనిషిని కిందకి లాగేది శత్రువు ఎవరంటే బయట శత్రువు కాదు లోపల పుట్టే కోరికే నిజమైన శత్రువు భగవద్గీతలో శ్రీకృష్ణుని అర్జునుని చూస్తూ ఒక మాట అంటాడు కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవః అంటే కామమే ఇది కోపమే ఇది రజోగుణం నుంచి పుట్టిన మహాశత్రువు ఇదే అని స్పష్టంగా చెప్తాడు.
(00:39) కామం అంటే శరీర కోరిక మాత్రమే కాదు ఎక్కువ కావాలి ఇప్పుడే కావాలి నాకోసమే కావాలి అనే లోభమే కామం మనసులో ఒక కోరిక పుట్టినప్పుడు అది చిన్నగా కనిపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోతే దాన్ని మనం నియంత్రించలేకపోతే అదే కోరిక మనిషిని నియంత్రించడం మొదలు పెడుతుంది. అగ్ని మొరటగా చిన్న మంటలాగే కనిపిస్తుంది. కానీ అది పెద్ద అరణ్యాన్ని కూడా కాల్చగలదని మనం మర్చిపోతాం.
(01:08) కామం కూడా అంతే మొదట ఆనందం ఇస్తుంది. తర్వాత అలవాటఅవుతుంది. చివరికి బానిసని చేస్తుంది. శ్రీకృష్ణుడు ఒక స్పష్టమైన విషయాన్ని చెప్తాడు. [సంగీతం] విషయాలపై ధ్యానం చేస్తే ఆసక్తి పుడుతుంది. ఆసక్తి పెరిగితే కామం పుడుతుంది. కామం అడ్డుపడితే కోపం పుడుతుంది. కోపం పెరిగితే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి తనను తానే నాశనం చేసుకుంటాడు.
(01:36) ఇది కేవలం తత్వం కాదు ఇది ప్రతిరోజు మన జీవితంలో సొసైటీలో జరిగే పచ్చి నిజం ఇది. మితిమీన కామం మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది మితిమీర్న కామం మనిషిని ధర్మం నుంచి దూరం చేస్తుంది. సిగ్గుపోతుంది క్రమంగా భయం పోతుంది. అది నిదానంగా నేను పాపం చేస్తున్నాను అనే భావన కూడా తీసేస్తుంది. ఇది తప్పు అని తెలిసినా మన చేత చేయిస్తుంది.
(02:03) ఇది నాశనం మనల్ని నాశనం చేసేస్తుందని తెలిసినా ఆగనివ్వదు. మనిషి తన కుటుంబాన్ని మర్చిపోతాడు. తల్లిదండ్రుల్ని మర్చిపోతాడు. నువ్వు కన్న పిల్లల్ని మర్చిపోతాడు తన గౌరవాన్ని తానే త్యాగం చేస్తాడు. చివరికి ఆనందం కోసం మొదలైన కామం బాధగా మారుతుంది. తర్వాత బానిసత్వంగా మారుతుంది తర్వాత అవమానంగా మారుతుంది. భగవద్గీతలో కామం గురించి కృష్ణుడు ఏమంటాడు? ఈ ప్రపంచంలో కామం అంటే ఎప్పటికీ తృప్తి చెందని ఆకలి ఎప్పటికీ నిండని గుంట దానికి ఎంత ఇచ్చినా సరిపోదు ఎంత అనుభవించినా తీరదు అదే కామ స్వభావం.
(02:43) కామం వల్ల నాశనమైన జీవితాలు ఉన్నాయా ఉన్నాయి. రావణాసురుడు రావణుడు మహా పండిటుతుడు శివభక్తుడు కూడా ఎన్నో శక్తులు ఉన్నవాడు కానీ సీతపై కామం ఒకే ఒక్క కోరిక ఆ ఒక్క కామమే లంకను కాల్చింది వంశాన్ని నాశనం చేసింది. చరిత్రల్లో రావణుని దుర్మార్గుడిగా మార్చింది. ఇంకొకరు ఎవరైనా ఉన్నారా దుర్యోధనుడు ద్రౌపది పై ఉన్న కోరిక అహంకారంతో కలిసిన కామం ఆ ఒక్క సభలో చేసిన అపకారం మహాభారత యుద్ధానికే కారణమైంది.
(03:19) కురువంశం మొత్తం నాశనమైపోయింది. జయద్రదుడు ద్రౌపదిని అపహరించాలనే కామం ఆ ఒక్క తప్పు అతని మరణానికి తండ్రి శాపానికి కారణమైంది. కీచకుడు బలవంతంగా కామాన్ని కోరాడు అదే రాత్రి ప్రాణాలని కోల్పోయాడు. ఇతిహాసం చెప్తుంది కామం బలం కాదు బలహీనత సాధారణ జీవితాల్లో ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఎంతో కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఒక్క అక్రమ సంబంధంతో చదిరిపోతుంది.
(03:52) పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. గౌరవాన్ని వీధిలో పెడుతుంది. మనసులో శాంతి లేకుండా పోతుంది. ఇది కథ కాదు నిత్యం మన జీవితాల్లో చూస్తున్న పచ్చి నిజాలు. శ్రీకృష్ణుడు చెప్పేది ఒకటే కామాన్ని చంపమని కాదు కామాన్ని నియంత్రించమని ఇంద్రియాలపై నియంత్రించమని మనసుని నియంత్రించమని మనిషి ఇంద్రియాలకు సేవకుడైతే బానిస అవుతాడు.
(04:19) ఇంద్రియాలకు యజమాని అయితే యోగి అవుతాడు. కామం మన శక్తిని కిందకి లాగేస్తుంది. బ్రహ్మచర్యం అదే శక్తిని పైకి తీసుకెళ్తుంది. నిన్ను ఒక స్థాయిలో నిలబెడుతుంది. కామానికి లొంగినవాడు క్షణిక ఆనందం పొందుతాడు. కానీ కామాన్ని జయించినవాడు జీవితాన్ని గెలుస్తాడు. చాలామంది కామాన్ని చిన్నదిగా అంటుంటారు ఏముందిలే చిన్నదే కదా అని కానీ కామం అనేది చిన్నదైతే కాదు కామాన్ని ఆటగా తీసుకుంటే జీవితం ఒక ఆటలా మిగిలిపోతుంది.
(04:53) నీ భార్యతో ధర్మబద్ధంగా బాధ్యతతో జరిగితే అది పాపం కాదు అది గృహస్థ ధర్మం. కానీ అదే కామం నీ ఇంటి గడప దాటించి వేరే వారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తే అక్కడే మొదలవుతుంది అసలైన నీ పతనం నువ్వు రాత్రింభవంలో కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నీ భార్యకి నీ బిడ్డకి చేరకుండా వేరే చోట ఖర్చు చేస్తే దానికి చెల్లించాలి కచ్చితంగా భారీ మూల్యం ఇది దేవుడు శిక్ష కాదు ఇది కర్మ లెక్క ఇంట్లో నీ భార్య ఖాళీ పాత్రలు చూస్తూ పడుకున్న ప్రతి రాత్రి నీ బిడ్డలు ఆకలితో నిద్రపోయిన ప్రతిక్షణం వాళ్ళు దాచుకున్న ప్రతి కన్నీటి చుక్క నీ కర్మ ఖాతాలో నమోదు అవుతూనే ఉంటుంది.
(05:38) నువ్వు ఆనందం అనుకున్నది వాళ్ళకు శిక్షగా మారిన రోజు అదే రోజు నుంచి కర్మ నీ జీవితంలోకి అడుగు పెడుతుంది నిదానంగా శబ్దం లేకుండా కానీ తప్పించుకోలేని విధంగా అడుగు పెడుతుంది. నీ శాంతి పోతుంది. నీ గౌరవం కరుగుతుంది. నీ ఇంట్లో వెలుగు తగ్గిపోతుంది. ఇది కథ కాదు ఇదే నిజం. కర్మ ఎప్పుడూ వెంటనే కొట్టదు సరైన సమయం చూసి పూర్తి లెక్కతో తిరిగి వస్తుంది.
(06:05) [సంగీతం] ఆ కర్మ నీ జీవితాన్ని ఎలా తారుమారు చేస్తుంది? [సంగీతం] నీ ఇంట్లోకి ఎలా అడుగు పెడుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామా? కీప్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.

No comments:

Post a Comment