Sunday, February 15, 2026

 *అద్భుత పూజాద్రవ్యం ఏకాక్షి నారికేళం.....*
కొబ్బరికాయ అంటే అందరికీ పరిచితమే. , కొబ్బరి, కుడుక, శ్రీఫలం మొదలైనవి దీని నామాంతరాలు శ్రీఫలం అని మారేడు కాయకు, సముద్రతీరంలో లభించే మరో ఫలానికి కూడా వాడతారు.

పూజా కార్యక్రమాల్లో విశేష ప్రాధాన్యత ఉన్న ఈ ఫలానికి ఆధ్యాత్మిక రంగంలో శుభాస్థానం ఉంది. దీని నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ఫలాల్లో మారేడు, బాదం చాలా కఠినమైన ఆవరణ ఉన్నవిగా ప్రసిద్ధి. కాని, కొబ్బరికాయ వాటికన్నా దృఢంగా ఉంటుంది.

పౌరాణిక విశ్వాసాల ప్రకారం కొబ్బరికాయ బ్రహ్మదేవుని సృష్టి కాదు. విశ్వామిత్ర సృష్టి. 

ఒకానొక కథ ప్రకారం ఒకసారి బ్రహ్మదేవునికి, విశ్వామిత్ర మహర్షికి వివాదం జరిగింది. బ్రహ్మ సమస్త సృష్టి రచనకు నిర్మాత. సృష్టిలో కనిపించే చరాచర ప్రాణులు వస్తువులు, జంతువులు, పశుపక్షులు, కీటకాలు, వానరులు, మానవులు బ్రహ్మ సృష్టించినవే.

ఉగ్రమైన, అసాధారణమైన తపస్సు చేసిన విశ్వామిత్రుడు అలౌకిక శక్తులు సంపాదించి, ఒకసారి బ్రహ్మదేవునికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశాడు. ‘నీవు పంచతత్వాలతో సృష్టి చేస్తున్నావు. నేను వృక్షాల నుండి మానవుని సృష్టిస్తాను’ అన్నాడు. 

తన కమండలం నుండి కొంత జలం తీసి భూమిపై చల్లాడు. వెంటనే భూమినుండి అంకురాలు మొలకెత్తాయి. స్వల్పకాలంలోనే అవి పెరిగి, ఆకాశాన్ని అందుకోనేంత ఎత్తుకు సాగి మాహావృక్షాలు అయ్యాయి. ఆ చెట్ల నుండి మానవ శిరస్సు ఏర్పడింది. ముఖం, రెండు కళ్ళు, నోరు మాత్రమే కాక రోమరాశిగా పీచు ఏర్పడింది. ఇక మిగిలింది శరీర నిర్మాణం (చేతులు, కాళ్ళు మొదలైనవి). 

ఇంతలో దేవతలు బ్రహ్మదేవుని గౌరవం కాపాడటానికై విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి క్షమాప్రార్థన చేసి, అతని కోపాన్ని శాంతింపజేశారు. శాంతుడైన మహర్షి సృష్టి కార్యక్రమం విరమించాడు.

ఈ కథనాన్ని మనం మిథ్యగా భావించినా నారికేళ ఉపయోగం విషయంలో మాత్రం సందేహం లేదు. భారతీయ సంస్కృతిలో కొబ్బరి కాయకు చాలా శుభకరం, పవిత్రమైన స్థానం ఉంది. పూజాదుల్లో దేవతలకు నైవేద్యంగా, హోమాదుల్లో ఆహుతులకు కొబ్బరి కాయను ఉపయోగిస్తారు. కానుకలు, కలశస్థాపన, ఫలహారాల్లో, ఔషధంగా కూడా ఈ ఫలాన్ని ఉపయోగిస్తారు. 

కొబ్బరి ఔషధంగా, పౌష్టిక ఖ్యాద్య పదార్థంగానూ ఉపయోగపడుతుంది. ఇవన్నీకాక ఒక ముఖ్య ప్రయోజనం – ఆధ్యాత్మిక సాధనలో కొబ్బరి వాడకం. భారతదేశంలో ధార్మికవిధుల్లో అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగించబడుతుంది.

ఏకాక్షి నారికేళం......

సాధారణంగా కొబ్బరికాయలకు పీచుతీశాక పిలక దగ్గర నల్లని బిందువులు కనబడతాయి. వీటిలో రెండు బిందువులు కళ్ళకు చిహ్నమని, మరొకటి నోటికి చిహ్నమని ధార్మిక విశ్వాసం. జాగ్రత్తగా పరిశీలిస్తే కొబ్బరికాయ గుండ్రని ఆకారం మానవాకారంతో సామ్యం కలిగి ఉంటుంది.

వాస్తవానికి ఇది కొబ్బరికాయ సహజ నిర్మాణం. విచిత్రమేమిటంటే – కొన్ని కొబ్బరి కాయలపై మూడు బిందువులు కాక రెండు నల్లని బిందువులు మాత్రమే కనపడతాయి. అంటే – అక్కడ ఒక కన్ను, నోరు మాత్రమే ఉన్నాయని తెలుసు కోవాలి. దీనిని తాంత్రికభాషలో ‘ఏకాక్షి నారికేళం’ అంటారు. ఒకే కన్ను కలది అని అర్థం. సాధారణంగా ఇది లభించడం దుర్లభం. అరుదైనది.

అలభ్యమైన నారికేళం ఎక్కడైనా లభిస్తే, దాని వెలచాలా అధికంగా ఉంటుంది. కొబ్బరికాయ ఎప్పుడూ శుభప్రదమే. కాకపొతే అది పగులు బాసినదై ఉండకూడదు. కాయ పూర్తిగా ఉండాలి. పూజ తరువాత దానిని పగల కొట్టి, ప్రసాదంగా కొబ్బరి స్వీకరించాలి. కాని, ఏకాక్షి నారికేళం ప్రసాదంగా నివేదన చేయబడేది కాదు. దానిని పూజలోనే ఉంచాలి. పగలకోట్టకూడదు.

ఇది సాధారణంగా దొరికేది కాదు కనుక ఎక్కడైనా లభిస్తే వెంటనే తీసుకోవాలి. శుభముహూర్తం కోసం చూస్తుంటే చేజారిపోవచ్చు. అలా కాకుండా శుభముహూర్తం వరకు జాగ్రత్తగా ఉంచి మీకు అప్పజెప్పే వారుంటే మీరు ముహూర్తం కోసం ఎదురుచూడవచ్చు.

పూజా విధానం.....

దీపావళి పర్వదినం లేదా రవిపుష్య, గురుపుష్య యోగం వంటి శుభముహూర్తంలో ఉదయమే స్నానాదులు పూర్తీ చేసుకోవాలి. పూజాస్థలంలో ఒక బల్ల లేదా పీటను ఆసనంగా అమర్చాలి. దానిపై ఎర్రని వస్త్రం పరవాలి. నిత్యపూజ పూర్తీ చేశాక ఒక పళ్ళెంలో ఏకాక్షి  నారి కేలం ఉంచి, గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని దానిపై చిలకరించాలి. అలా స్నానం చేయించాక శుభ్రంగా వస్త్రంతో తుడిచి, దానిని పీటపై ఆసనంగా అమర్చాలి. దానిపై ఎర్రని వస్త్రం పరవాలి. 

నిత్యపూజ పూర్తి చేశాక ఒక పళ్ళెంలో ఏకాక్షి నారికేళం ఉంచి, గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని దానిపై చిలకరించాలి. అలా స్నానం చేయించాక శుభ్రంగా వస్త్రంతో తుడిచి, దానిని పీటపై ఉన్న ఎర్రనివస్త్రంపై పెట్టాలి. తరవాత అది కేవలం నారికేళం కాదని, లక్ష్మీ స్వరూపమని చిత్తశుద్ధితో భావించి ధ్యానించాలి. 

ఆ నారికేళానికి ఎర్రచందనం, పూలు, అక్షతలు సమర్పించాలి. తరవాత లక్ష్మీదేవి స్తోత్రం, ధ్యానం, పూజ చేస్తూ మంత్రజపం ప్రారంభించాలి. జపం ప్రారంభించ డానికి ముందే ‘నేను నారికేళ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ప్రతిమను పూజలో ఆ దేవి సంతృప్తి కోసం ఇన్ని (సంఖ్య) మాలాజపాలు జపం చేస్తాను’ అని సంకల్పం చేయాలి. అనుకున్న సంఖ్య ప్రకారం మాలా జపం చేయాలి. 

మాలలో 108 పూసలుఉంటాయి. 10 మాలాజపాలు చేస్తే జపసంఖ్య 1080 అవుతుంది. ఈవిధంగా సంకల్పించిన సంఖ్య (కనీసం 11 మాలాజపాలు) ప్రకారం మాలాజపం తప్పక చేయాలి.

తరవాత నారికేళాన్ని ఆ వస్త్రంతో సహా ఒక పళ్ళెంలో లేదా చిన్ని పాత్రలో జాగ్రత్తగా భద్రపరచాలి. వెండిపళ్ళెం (పాత్ర) అయితే ఉత్తమం. మొదటి దినం మంత్రజపం పూర్తయ్యాక అదే మంత్రంతో 21 ఆహుతులు ఇవ్వాలి. హోమం పూర్తి చేశాక కనీసం ఒక బ్రాహ్మణునికి భోజనం, దక్షిణ సమర్పించాలి.

అనంతరం ఏకాక్షి నారికేళాన్ని ఒక పవిత్రమైన సురక్షిత స్థానంలో ఉంచి, ప్రతిరోజూ సింధూరం, ధూపదీపాలు సమర్పించాలి. అప్పుడప్పుడు శక్తికొద్ది నాణెం సమర్పించాలి. ఏకాక్షి నారికేళంతో చేసె ఈ ప్రయోగం చాల లాభకరం. ఆర్ధిక ఉన్నతి, సమృద్ధిదాయకం తప్పక పొందుతారు.

ప్రభావం......

ఏకాక్షి నారికేళాన్ని పూజించే ఇంట్లో నిరంతరం లక్ష్మీనివాసం ఉంటుంది. ధాన్యాగారం, నగదుపెట్టె, బీరువా, పూజాస్థలం…ఎక్కడ ఏకాక్షి నారికేళం ఉంచినా ప్రతి దినం పూజించాలి. అలా చేయడం వల్ల ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. వ్యాపార కేంద్రాల్లో ఉంచినా దీని ప్రభావం లాభకరంగా ఉంటుంది. పూజా సమయంలో జపించాల్సిన మంత్రం..ఓం శ్రీం శ్రియై నమః!

ఏకాక్షి నారికేళాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తాం. కనుక సాధన చేశాక లక్ష్మీదేవికి ప్రియతముడైన విష్ణుమూర్తిని స్తోత్రం చేయడం వల్ల సాధన ప్రభావం ఇనుమడిస్తుంది.   

No comments:

Post a Comment