Sunday, February 15, 2026

 -------------------------------------           *ఈరోజు మహాశివరాత్రి                         --------------------------       శివరాత్రి జాగారం , ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?*
---------------------------------------
*శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ                                  శివ నామ స్మరనతో మారుమోగిపోతున్నాయి, శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు, ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం, వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి, మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది,అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు,దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు,రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి,పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది,                     ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు, దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు, శివపార్వతుల కల్యాణం చేస్తారురోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి,రాత్రి జాగారం చేస్తారు,శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.*
--------------------------------------
*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి?ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు?జాగారం ఎందుకు చేస్తారు?జాగారం ఎవరు,ఎప్పుడు ప్రారంభించారు ?అంటే దానికి ఒక కథ ఉంది, అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు,అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది, హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు, హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు,లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి,గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు, హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి,నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు,గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది,                       ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు,నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.*
---------------------------------------
*అయినా,శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట, అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు, హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట,ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట,అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు, జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు,ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం,నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.*
--------------------------------------
*క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు, క్రీస్తుపూర్వం 1500-1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది,క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది,                                                  ఈ ఉపనిషత్తు                               భగవద్గీత కంటే మునుపటిది,అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్‌ ఫ్లడ్‌ వంటి చరిత్రకారుల అంచనా.*
---------------------------------------
*శివారాధనలో మూర్తి రూపం,లింగరూపంలోనూ పూజిస్తారు,లింగ రూపమే ప్రధానమైనది,ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం,వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి, మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది,అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు,దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు,రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి,పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది,                         ఈ పర్వదినాన లింగాష్టకం,                               శివ పంచాక్షరి జపిస్తారు, దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు,శివపార్వతుల కల్యాణం చేస్తారు,రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి,రాత్రి జాగారం చేస్తారు,శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.*                         ---------------------------------------   *శివ''అంటే "శివుడు - "రాత్రి'' అంటే "పార్వతీదేవి*
-------------------------------------
*శివరాత్రి -"శివ'' అంటే                            "శివుడు,- "రాత్రి'' అంటే "పార్వతి''*
*వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి'',వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.*
---------------------------------------
*అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు''అన్నారు, వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి''విశ్వానికంతటికీ పర్వదినం అయింది.* 
--------------------------------------
*అంతేకాదు,తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి,వారికి జ్ఞానోపదేశం చేసినది,                                                       ఈ"శివరాత్రి'' నాడే, అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.*
---------------------------------------
*ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది,         అభిషేకం ఎందుకు చేయాలి?"అభిషేక ప్రియం శివః'' అన్నారు,శివుడు అభిషేకప్రియుడు,                              నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.*
---------------------------------------
*ఇందులో అంతరార్థం ఏమిటంటే -"నీరము''అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు, నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం,అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం.*
-------------------------------------    *అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడుఆ నీటిస్పర్శతో నారాయణ* *స్పర్శానుభూతితో*
*"శివాయ విష్ణురూపాయ* *శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''*
*శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ,తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి,కానీ                                     ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం''అంటేనే శివునకు ప్రీతికరం.* 
--------------------------------------
*అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం,ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం,అందుకే శివుడు,గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.*
---------------------------------------
*ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.* 
---------------------------------------
*ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే"జలధార శివః ప్రియః'' అన్నారు కదా!                       ఈ అభిషేకాన్ని                               "రుద్రైకాదశిని'' అనబడే నమక,చమకాలతో చేయాలి,అనంతరం మారేడుదళాలతో,                       తుమ్మిపూలతో అర్చించాలి.*
---------------------------------------
*నమకంలోని "నమశ్శివాయ''అను పంచాక్షరీ మంత్రంలో"శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ''అనే హంసకు రెండు రెక్కలవంటివి, జీవుని తరింపజేయడానికి"శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం''                          చెబుతుంది.*
--------------------------------------
*"వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి,దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో,వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది,నమక,చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే,సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.* 
---------------------------------------
*అందుకే,శివుని ప్రతినిత్యం అభిషేకించాలి, అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.*
---------------------------------------
*"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||* *యత్ఫలం మమమ* *పూజాయాం వర్షమేకం* *నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||*
-------------------------------------
*శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క                         "శివరాత్రి''అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.*
---------------------------------------
*శివరాత్రికి ముందురోజున,                అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి,ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి, మరునాడు"మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి             ఆరోజు మొత్తం శివుని అభిషేకించాలి,రాత్రంతా జాగరణ చేస్తూ,శివుని అర్చించాలి, లింగోద్భవకాలంలోఅభిషేకం తప్పనిసరిగా చేయాలి.*
--------------------------------------  *తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి,చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు,*
*"ఓం నమశ్శివాయ''అనే* *మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.*
-------------------------------------
*బిల్వపత్రాల విశిష్టత*
--------------------------------------
*శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి, మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం.*
---------------------------------------
*మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.*
------------------------------------
*సాలగ్రామ దానఫలం,                            శత అశ్వమేధయాగాలు                         చేసిన ఫలం,* 
---------------------------------------
*వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని"బిల్వాష్టకం''లో చెప్పబడింది.*
---------------------------------------
*"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే,అనేక జన్మల పాపాలు నశిస్తాయి,బిల్వదళంలోని మూడు ఆకులూ,సత్త్వ, రజ,స్తమోగుణాలకూ,                                                    శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు,                                                          ఆమూడు ఆకులే త్రిమూర్తులు,బిల్వాదళం ముందు భాగంలో అమృతం,వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక, బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.*
---------------------------------------
*ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి,ఆలోపు                 ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు,కానీ,మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.*
-------------------------------------
*జాగరణ ఎందుకు చేయాలి..*
--------------------------------------
*క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ,రాక్షస గణాలూ,శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట, ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది.*
---------------------------------------
*"జాగరణ''అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ,గడపడం కాదు, జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం,శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు,                         శుద్ధ స్ఫటిక మనస్కుడు, అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.*
---------------------------------------
*మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది,శరీర వ్యామోహం లేని వాడు కనుకే,తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.*
--------------------------------------
*ఆయన జీవనవృత్తి భిక్షాటనం,అందుకనే ఆయనను"ఆదిభిక్షువు'' అన్నారు,ఆయన భుజించే భోజనపాత్ర కపాలము, ఆయన నివాసస్థానము శ్మశానం,ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.* 
---------------------------------------
*ఈ"నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం, ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత,ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.* 
---------------------------------------
*బ్రాహ్మణ వంశంలో జన్మించి,వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి,శివపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి''మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.* 
---------------------------------------
*అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే"శివరాత్రి''మహత్యం.*
--------------------------------------
*రావణసంహారం చేసిన శ్రీరాముడు,బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు,                                                             ఆ క్షేత్రమే "రామేశ్వరం''.*
---------------------------------------
*శివుని శరణుకోరి, మార్కండేయ,యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు,శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు.*
---------------------------------------
*ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి,అట్టి నిరాకార, నిర్గుణ,నిరాడంబర, నిగర్వి అయిన ఆ"నిటలేక్షుని, ప్రేమానురాగాలు అనంతం, ఎల్లలులేనిది ఆయన మమకారం,"శివా''అని ఆర్తిగా పిలిస్తే,చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.*
---------------------------------------
*దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ,                                              ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది, బిడ్డలు,బంధువులు మరుభూమి వరకూ వస్తారు,ఆ తర్వాత,వెంట ఎవరూ రారు,కపాలమోక్షం కాగానే,అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.* 
--------------------------------------
*దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర... "నీకు నేనున్నారురా దిక్కు''అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు                              "శివుడు''ఒక్కడే, పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి,                                       ఆ పరమేశ్వరుడు ఒక్కడే..*
---------------------------------------
*ఇది చాలదా మన జన్మకు?ఏమిస్తే                                                   ఆ సదాశివుని ఋణం తీరుతుంది,?భక్తిగా                                                                   ఓగుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప                                                                             ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప, తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.* 
---------------------------------------
*అందుకే* *"మహాశివరాత్రి''నాడైనా మహాదేవుని స్మరిద్దాం, మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం*
*"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.*
--------------------------------------
*ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..*                       --------------------------------------- *మహా శివరాత్రి వ్రత మహాత్యo*
---------------------------------------
*మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓవ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది,ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు,ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది,కేవలం మహాశివరాత్రి నాడే కాక                               ఈవ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆతరువాత                                  ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది,                                     భక్తి , ముక్తి, సొంతమవుతాయి, ఇంతటి పుణ్యఫలప్రదమైన                                               ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ                                                 ఆ శివుడే.*
---------------------------------------
*ఓసారి బ్రహ్మ ,విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని,ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు,అప్పుడు           ఆపరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ, విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి,దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు, భక్తిని,ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.*
---------------------------------------
*జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు,శివపూజ, రుద్రజపం,శివాలయంలో ఉపవాసం,వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు,అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం, ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది, ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది, ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు,ఏభేదమూ లేకుండా సర్వవర్ణాలవారు,                                              అన్ని ఆశ్రమాలవారు,స్త్రీలు,       పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.*
---------------------------------------
*మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం,రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి, శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి, శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి,                ఆరాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి,ఆ తర్వాత మళ్ళీ స్నానం,లోపల,బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి,శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది,దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి,ఏమంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి,మంత్రం లేకుండా పూజించకూడదు.*
---------------------------------------
*భక్తి భావంతో గీత,వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి, శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి, ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి,ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు, శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి, నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది,తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి,ముందుగా పంచామృతాభిషేకం,          ఆతర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.*
--------------------------------------
*చందనం,నూకలు లేని బియ్యం,నల్లని నువ్వులతో పూజచేయాలి,ఎర్రగన్నేరు, పద్మంలాంటి పుష్పాలతోఅర్చించాలి భవుడు,శర్వుడురుద్రుడు, పశుపతి,ఉగ్రుడు,మహాన్‌, భీముడు,ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి,అన్నం, కొబ్బరి,తాంబూలాలను నివేదించాలి,అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.*
---------------------------------------
*రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి, నువ్వులు,యవలు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి, మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.*
---------------------------------------
*మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి, జిల్లేడు పూలతో శివపూజ చేయాలి,వివిధ ధూపదీపాలను, శాకపాకాలను,అప్పాలను నివేదించాలి,కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి,పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.*
---------------------------------------
*నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు,పెసలు లాంటి ధాన్యాలను,శంఖ పుష్పాలకు,మారేడు దళాలను వాడాలి, నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి,అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి,ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది,ఏజాముకు,         ఆజాము పూజ, పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం,మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.*
---------------------------------------
*నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని ,ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి,                                    ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది,ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు,సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ , విష్ణు,పార్వతులకు వివరించి చెప్పాడు,                                                                  ఈ కథను.*                                        ---------------------------------------

No comments:

Post a Comment