Saturday, February 14, 2026

మోజు పేరుతో ప్రేమ: భావోద్వేగ ఆధారపడటం నీ వ్యక్తిత్వాన్ని ఎలా కూల్చేస్తుంది | Logic Explained

మోజు పేరుతో ప్రేమ: భావోద్వేగ ఆధారపడటం నీ వ్యక్తిత్వాన్ని ఎలా కూల్చేస్తుంది | Logic Explained

https://www.youtube.com/watch?v=yJmgmQ187Fk



Transcript:
(00:00) ప్రేమ పేరుతో ఎవరైతే డిప్రెషన్ లో బతుకుతుంటారో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో ఎవరైతే ఇంకో మెట్టు పైకెక్కి ప్రేమించిన వారినే హత్య చేస్తూ ఉంటారో ప్రేమ కోసం చావడం అనేది చాలా గొప్ప విషయము అని ఫీల్ అవుతూ ఉంటారో అలాంటి వారికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు అసలు ప్రేమలోనే లేరు వాళ్ళు భ్రమలో ఉన్నారు. అవును వీళ్ళకు ప్రేమకి నిర్వచనం ఏంటో తెలీదు ప్రేమ అనేది కాపాడేది గానీ చంపేది కాదు అనే విషయము తెలీదు అయినా సరే ప్రేమ కోసం ఏదో పెద్ద గొప్ప త్యాగం చేసేస్తున్నాము మేము చరిత్రలో నిలిచిపోతాము అన్నట్టుగా ఆత్మహత్యలు చేసుకోవడం హత్యలు చేయడం
(00:41) లాంటివి చేస్తూ ఉంటారు. ఏంటి బ్రో నీకు ఏమన్నా పిచ్చిగాని లేసిందా నువ్వు ఏం మాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా అని అంటారా లేదు నేను చాలా సున్నితమైన విషయం మాట్లాడుతున్నానని నాకు అర్థం అవుతుంది కానీ విత్ లాజిక్ తో నేను నిజమే మాట్లాడుతున్నాను. వీళ్ళు అసలు ప్రేమలో ఉండరు ప్రేమ అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. ఇది ఎంత బాధాకరమైన విషయము అంటే నేనేదో ప్రేమ కోసం త్యాగం చేసి చచ్చిపోతున్నానని నువ్వు భావించి ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రేమే అబద్ధం అయితే ఇది నిజంగా ఘోరమైన విషయమే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ విషయంలో మీకు కూడా
(01:17) ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో ఎన్నో రకాల డౌట్లు వస్తూ ఉంటాయి ప్రేమ అనేది నిజంగా అంత గొప్పదా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం అనేది అంత గొప్ప విషయమా అని వాస్తవం ఏందంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి పెద్ద తప్పు ఏందంటే ఆత్మహత్య చేసుకోవడం ఇది ఎంత పెద్ద తప్పు అంటే ప్రేమించిన వారు నిన్ను మోసం చేసి వదిలేసిన దానికంటే కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా పెద్ద తప్పు ఇది వీళ్ళక తెలియదు.
(01:45) అయితే వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు ఎలాంటి పరిస్థితులలో వీళ్ళు ఇలా అయిపోతారు దేన్ని వీళ్ళు ప్రేమని నమ్ముతున్నారు దేనికోసం వీళ్ళు చావడానికైనా చంపడానికిైనా కూడా సిద్ధపడుతున్నారు దీనికి అసలు ఒక మీనింగ్ ఉందా ఇది వీళ్ళ తప్ప లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటే ఎస్ ఇది పూర్తిగా వీళ్ళ తప్పని చెప్పలేం కానీ ఈ సమాజము ఈ సాంప్రదాయం సంస్కృతుల ప్రభావాలు వీరి మీద ఎక్కువగానే ఉంటాయి.
(02:13) ఇదంతా ఒక మిస్ మ్యాచింగ్ వల్ల జరుగుతుంది. అదేంటో విత్ లాజిక్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనేం మోటివేషన్ వీడియో చేయట్లేదు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కచ్చితంగా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం.
(02:40) వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోరికకు ప్రేమ అని ముసుకు తగిలిస్తారు. కోరికను కోరిక ఎలా చెప్పేస్తే మీ పైన నాకు ఈ కోరిక ఉంది మీతో నాకు ఇలా గడపాలని ఉంది అని చెప్పేస్తే సమస్య అనేది లేదు. అయితే ఇద్దరు కలిసి ప్రొసీడ్ అవుతారు లేదా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. కానీ క్లోజ్డ్ సొసైటీస్ లలో ముఖ్యంగా మన దేశంలో ఒక వ్యక్తిని పట్టుకొని మీ మీద నాకు కోరిక ఉంది నేను మీతో కలిసి కోరిక తీర్చుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పడం అనేది నేరం అవతల వారిని కించపరిచినట్టు వాళ్ళ మనోభవాలు దెబ్బ తీసినట్టు అవుతుంది.
(03:17) ఎందుకు మన సమాజంలో మనము అలాంటి రూల్స్ పెట్టుకున్నాము ఇది కరెక్ట్ కాదు అనేసి దీనికి పెళ్లి అనే ఒక వ్యవస్థని మనం తెచ్చుకున్నాము. ఇంతవరకు బాగానే ఉంది. అదే సంస్కృతి సంప్రదాయాల పేరుతో అయితే అది పెద్ద తప్పు పాపము, శాపం అవుతుంది. అది ఓకే మనిషిని కంట్రోల్ లో పెట్టుకోవాలి మనుషులందరూ కొన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ ముందుకు వెళ్తేనే అది ఒక సొసైటీ అవుతుంది.
(03:39) దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఇవి ఏవి తప్పు అని మనం చెప్పేదానికి లేదు. మరి సమస్య ఎక్కడ వస్తుంది నీకు పెళ్లికి సహజంగా 18 సంవత్సరాలు స్త్రీకి 21 సంవత్సరం పురుషునికి పెట్టారు ఇది పెళ్లి వయసు ఈ వయసు ఎందుకంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మైండ్ మెచూరిటీ లెవెల్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ టైం ని ఫిక్స్ చేసుకున్నాం ఇది బాగుంది.
(04:04) కానీ ఈరోజు మన ఇండ్లల్లో మన పరిస్థితులు ఏమైపోయాయి లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఇంకేదో సాధించాలి ఇంకేదో చేయాలి ఇలా చేస్తే గాని పెళ్లి చేసుకోకూడదని ఒక పిచ్చి నమ్మకాన్ని మనం మన జీవితాల్లోకి తెచ్చేసుకున్నాం. ఇది కాస్త ఏమైంది 21 సంవత్సరం కాస్త 25 30 35 కూడా వెళ్ళిపోయింది. మనం సెటిల్ అవుతామో లేదో తెలియదు కానీ పెళ్లిని మాత్రం విపరీతంగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళడం ఒక వయసు దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఇలాంటి పరిస్థితులకి వచ్చేసాయి సరే ఇది వేరే సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి.
(04:43) నేచర్ వేరు నేచర్ లో ఉండే ఈ బయాలజీ యొక్క ప్రాసెస్ వేరు నువ్వు పెట్టుకున్న రూల్స్ నువ్వు పెట్టుకున్న సిస్టం వేరు రెండిటికీ సంబంధం లేదు ఇవి రెండిటి మిస్ మ్యాచ్ వల్లే సమస్యలు మొదలవుతాయి. ఎందుకు ఇప్పటి రోజుల్లో 10 12 సంవత్సరాల వయసు నుంచినే కోరికలు అనేటివి మొదలైపోతున్నాయి. ఆపోజిట్ జెండర్ ని చూస్తే సెక్షువల్ థాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి.
(05:11) ఇలాంటి టైంలో నీ పెళ్లి వయసు నీ సెటిల్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి నీ కోరికల నిమిత్తం నువ్వు ఏం చేస్తావు ఆపోజిట్ జెండని చూసి ఇష్టపడతావు వారితో ఉండాలనుకుంటావు గడపాలనుకుంటావు కోరికలు తీర్చుకోవాలి అనుకుంటావు కానీ నీ కోరికను కోరిక అని చెప్పవు చస్తే చెప్పవు ఎందుకు ఎందుకంటే అది సమాజం ప్రకారం తప్పు అవుతుంది సాంప్రదాయం సంస్కృతుల ప్రకారం అది పాపం అవుతుంది కాబట్టి నువ్వు నేరుగా చెప్పలేవు ఇప్పుడు నీ బ్రెయిన్ కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి తప్పు చేసి శిక్ష భారిన పడకూడదు అలాగే తన కోరికలను తీర్చుకోవాలి.
(05:43) ఇవి రెండు ఇక్కడ బ్రెయిన్ స్మార్ట్ గా ఆలోచిస్తుంది ఎలాగో చూడండి. కోరిక అని డైరెక్ట్ గా చెప్పి అదేదో తప్పు చేసిన ఫీలింగ్ తో సమాజము వేసే శిక్షని భరించాలి అనుకోదు. అది సేఫ్టీ మోడ్ లో ఉండాలనుకుంటుంది కాబట్టి ఇది నా కోరిక అని డైరెక్ట్ గా చెప్పదు. అట్ ది సేమ్ టైం తనలో ఉండే కోరికలను తీర్చుకోవాలి సుఖపడాలి ఆనందపడాలి అనుకుంటుంది.
(06:09) ఇప్పుడు ఏంటా ఏం చేయాలని వెతికితే ప్రేమ అనేది సేఫ్టీ వర్డ్ మన సమాజంలో ప్రేమ అనేది తప్పు కాదని అర్థం చేసుకుంటుంది. ఈ కోరికకి ప్రేమ అనే ముసుకేస్తుంది. ముసుకేసి డైరెక్ట్ గా ఇది నా కోరిక అని చెప్పకుండా ఇది నా ప్రేమ అని చెప్తుంది. ఇది ఆ టైంలో మీకు అర్థం కావు గత అనుభవాల కారణంగా ఎన్నెన్నో రూల్స్ కారణంగా మీ బ్రెయిన్ ఎప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది ఆ ప్రొటెక్షన్ చేస్తూనే ప్రస్తుతం మీకు ఏమ అవసరమో దానికోసం ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటుంది.
(06:41) ఇదంతా సబ్కాన్షియస్ మైండ్ లో జరుగుతూ ఉంటుంది మీకు స్పష్టంగా అర్థం కాదు ఇది నా కోరిక నేను ప్రేమ అని పేరు పెడుతున్నానని మీకు తెలియదు ఆ టైంలో కానీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆపోజిట్ జెండర్ ని చూస్తారు మీరు ఇష్టపడతారు వారితో ఆనందంగా ఉండాలనుకుంటారో సుఖపడాలనుకుంటారు మీ కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారు.
(07:03) ఇది ప్రేమ కాదు నేచర్ ప్రకారం మన బయాలజీ ప్రకారం సహజంగా వచ్చేటటువంటి ఒక కోరిక అయితే మీరు ఏదైతే ప్రేమ అన్నారో దానికి వాళ్ళు కూడా స్పందిస్తూ మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతారు. వారితో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు వాళ్ళతో సమయాన్ని గడపడం అనేది ఆనందంగా ఉంటుంది. ఫైనల్ గా వాళ్ళ ఆనందమే మీ ఆనందం కూడా అయిపోతుంది. అంటే ఇది ఎమోషనల్ డిపెండెన్సీ అన్నమాట.
(07:26) ఇప్పుడు మీ మూడు వాళ్ళ మీద ఆధారపడుతుంది. వాళ్ళ మూడు మీ మూడు ఒకటే అయితాయి అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి వాళ్ళు మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోతే భయము మీ మాటకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే భయము మీకు కొంచెం దూరం పెడితే భయము వాళ్ళు ఇంకెవరితో అయినా మాట్లాడితే భయం ఎందుకు మీకు దూరం అయిపోతారేమో అని ఇక్కడే కంట్రోల్ చేయడం అనేది మొదలు పెడతారు.
(07:51) అప్పటివరకు అది మీకేం తప్పుడు భావన కాదు కానీ ఈ భయాల కారణంగా ఎక్కడ దూరం అయిపోతారేమో అనేసి మీరు కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేయడం మొదలు పెడతారో అవతలవాళ్ళకి ప్రేమ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ కంట్రోల్ పేరుతో ప్రేమ అనేది తగ్గించి ఇది నా సొంతం అని మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యి అదే విధంగా ప్రవర్తిస్తారో ఇప్పుడు కారణాలు ఏవైనా సరే దూరం అవ్వాల్సిన పరిస్థితి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.
(08:21) నిద్ర రాదు ఏమి తినాలనిపించదు జీవితం మొత్తం అయిపోయింది మొత్తం ఖాళీ ఏమి లేదు అనిపిస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇక్కడ ఏం జరిగింది క్లియర్ గా ఒకసారి ఆలోచించండి మీ బ్రెయిన్ కోరికని కోరిక అని చెప్పకుండా కొన్ని పరిస్థితుల కారణం వల్ల దానికి ప్రేమ అని ముసుకేసింది. కానీ దీని మోటివ్ ఏంటి ఫైనల్ గా కోరిక తీర్చుకోవడం.
(08:46) ఇప్పుడు ఆ కోరిక కలిగిన ఆ మోటివ్ ఏదైతే ఉందో అది ప్లస్ ఒక అబద్ధపు ప్రేమ అనే మూసుకు ఈ రెండిటి ప్రక్రియల్లో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళ ఐడెంటిటీ మొత్తాన్ని అవతలవాళ్ళ ఐడెంటిటీగా ఊహించేసుకుంటుంది అంటే వాళ్లే నేను నేనే వాళ్ళు వాళ్ళు లేకుండా నేను లేను నేను లేకుండా వాళ్ళు ఉండకూడదు. మేమిద్దరం ఒకటే అంటే ఇది ఒక అడిక్షన్ అన్నమాట ఇది కాలక్రమేన సమయం గడిసే కొద్ది అడిక్ట్ అయిపోతారు అవతలవాళ్ళకి ఏ కారణం చేత విడిపోయినా సరే ఇంక నిద్ర ఉండదు తిండి ఉండదు అవే ఆలోచనలు డిప్రెషన్ ఏ పని చేయబుద్ది కాదు ఎందుకు ఎందుకంటే మీరు
(09:27) మొత్తం వాళ్లే అని ఊహించుకున్నారు వారు మీరు వేరు కాదని ఊహించుకున్నారు కాబట్టి మీ ఐడెంటిటీ మొత్తం లాస్ అయినట్టే కదా వాళ్ళు దూరం అయిపోతే మీ ఐడెంటిటీ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ చేతుల్లో పెట్టేసారు జీవితం మొత్తం ఖాళీ ఖాళీ అయినప్పుడు ఇంక బ్రెయిన్ కి ఏం పని ఉండది డిప్రెషన్ లోకి వెళ్తాది చేయడానికి ఏం పని ఉండదు ఇంకా ఎందుకంటే నేను ఏది కాదు నేను ఖాళీగా ఉన్నాను నాదంటూ ఏది లేదు నా జీవితమే అయిపోయింది నేను శూన్యం ఇలాంటి భావనలు వస్తాయి కాబట్టి ఈ డిప్రెషన్ లో ఉంటూ ఉంటూ ఏదో ఒక టైంలో ఇంకేదైనా ఎవరైనా మోటివేట్ చేయడం కారణంగానో ఎలా అయినా బయట పడితే ఓకే ఇది బయట పడకుండా
(10:03) ఇంకొక్క స్టెప్ ముందుకు వెళ్తారయ్యా వాళ్ళకు నెక్స్ట్ వచ్చే వచ్చే థాట్ ఏందంటే సూసైడ్ ఇప్పుడు నేను నా ప్రేమ నిజాయితి అనేది నిరూపించుకుంటే నా ఐడెంటిటీ మళ్లా నాకే తిరిగి వస్తుంది. దీనికి వీళ్ళు ఏం చేస్తారో తెలుసునా సూసైడ్ చేసుకుంటారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రాణాలు పోగొట్టేసుకుంటారో దానికి ఒక కారణం ప్రేమ అనేది ఉంది కాబట్టి అరే వీడు పెద్ద గొప్ప ప్రేమికుడు ప్రేమికురాలు అనుకోవాలనేసి సూసైడ్ చేసుకుంటారు.
(10:33) అంతే కదా ఇప్పటి వరకు శూన్యము ఏమి లేదు ప్రేమించిన వాళ్ళేమో దూరంగా ఉన్నారు దూరం పెట్టేశారు ఇంకా దగ్గర అవ్వలేరు అదే వారి కోసం చచ్చిపోతే ఈ విషయం అవతలవాళ్ళకి తెలుస్తుంది కదా నా ప్రేమ కోసం చచ్చిపోయారు అని ఆ ప్రేమకు వాళ్ళు విలువ ఇస్తారండి ఈ ప్రేమ నిజాయిత అయిన ప్రేమ నాకోసం చచ్చిపోయారు ప్రేమ కోసం మరణించారని దీన్ని ఐడెంటిటీ లా ఫీల్ అవుతారు.
(10:56) వీళ్ళ తెలియకుండానే జరిగిపోతుంటాయి ఆత్మహత్య చేసేసుకుంటారు. ఇప్పుడు ఇంకో రకం ఉంటారు. వీళ్ళు చావరు ప్రేమించిన వారు మోసం చేసినారని వాళ్ళని చంపుతారు. వీళ్ళు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వీళ్ళకన్నా ఇంకొక్క స్టెప్ ముందుకెళ్లి మూర్ఖంగా ప్రవర్తించడం మొదలు పెడతారు అంటే వీళ్ళకి ఈ ప్రాసెస్ అంతా జరిగినా సరే నా ఐడెంటిటీ ఎవరి వల్ల పోయింది అనే స్పృహలో ఉంటారు వీళ్ళు నీ కారణంగా నా ఐడెంటిటీ పోయింది.
(11:26) అంటే వీళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది అహంకారం అన్నమాట నా ఐడెంటిటీ నీ చేతుల్లో ఉండడం కాదు నీ ఐడెంటిటీనే నా చేతుల్లో ఉండాలి నాతో ముడిపడి ఉండాలి నువ్వు నాకే సొంతం నువ్వు ఇంకెవరికీ దక్కడానికి వీలు లేదు ఇలాంటి పిచ్చిలో వెళ్ళిపోయి వాళ్ళ ఐడెంటిటీని వీళ్ళ ఐడెంటిటీతో కలిపేసి వీళ్ళు తన ఐడెంటిటీ వదలడానికి ఇష్టపడరు కానీ వాళ్ళ ఐడెంటిటీనే మాయం చేయాలనుకుంటారు.
(11:54) ఓకే నువ్వు నా లైఫ్ లోకి రావు కదా నాకు దక్కవు కదా నువ్వు నాకు మోసం చేసినావు కదా సరే నువ్వు ఎలాగా ఆనందంగా సుఖంగా బతుకుతావో చూస్తా నువ్వు వేరే వాళ్ళకి ఎలా దక్కుతావో చూస్తా అనేసి పోయి చంపేస్తారు. హత్య చేసి పడేస్తారు. ఇది మూర్ఖత్వం అన్నమాట. డిప్రెషన్ లో ఉండడమేమో పిచ్చి ఆత్మహత్య చేసుకోవడమేమో అమాయకత్వమో ఇది మూర్ఖత్వం.
(12:17) డైరెక్ట్ గా వెళ్లి ఒక మనిషిని హత్య చేసేయడం. ఇది అసలు ప్రేమ? ప్రేమ అనేది కాపాడుతుంది కానీ ఒక మనిషిని చంపదు తను చనిపోయేలా చేయదు ఇదైతే ఫాక్ట్ ఎలా నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకునే ముందు వీళ్ళక ఎంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఈ పాయింట్ అర్థం చేసుకోండి బయాలజీ ప్రకారం నీ కోరిక కలిగినప్పుడు కోరిక అని చెప్పేసి ఆ కోరిక తీర్చుకున్నా లేదా అంతటితో జరగదనేసి పక్కక వెళ్ళిపోయినా అది అంతటితోనే మయమైపోతుంది.
(12:49) నువ్వు ఎప్పుడైతే ఆ కోరికకు ప్రేమని ముసుకు తగిలించాల్సిన పరిస్థితి వచ్చిందో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయింది. కన్ఫ్యూజన్ లో ఏమేమో ఊహించుకునింది మీ జీవితాలను వాళ్ళతో ముడి పెట్టేసింది వాళ్ళ జీవితాలు మీతో ముడి పెట్టేసింది సమస్య వచ్చిన తర్వాత నీ హ్యాండిల్ చేసే కెపాసిటీ నువ్వు అర్థం చేసుకునే విధానం బట్టి అయితే డిప్రెషన్ లేదా ఆత్మహత్య లేదా ప్రేమించిన వారినే హత్య చేయడం అన్న స్థాయికి వెళ్ళిపోయింది.
(13:17) ఫైనల్ గా ఈ మూడు ప్రేమ కాదు అనేది మనకు అర్థంవుతుంది స్పష్టంగా ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో చూద్దాం. ప్రేమ అనేది ఆపోజిట్ జెండర్ మీదనే కాదు దానికి వయసుతో సంబంధం లేదు జెండర్ తో సంబంధం లేదు ఎవ్వరి మీదైనా కలుగుతుంది. అదొక ఫీలింగ్ అద్భుతమైన ఫీలింగ్ ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు నీకు నచ్చింది నువ్వు చెయ్ నాకోసం చేయాల్సిన అవసరం లేదు నాకోసం మారాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడున్నా బాగుండాలి ఎలా ఉన్నా బాగుండాలి.
(13:52) నాతో ఉండాల్సిన అవసరం లేదు ఇందులో నా ప్రమేయమో అవసరం లేదు. నువ్వు సేఫ్టీగా సురక్షితంగా ఉండాలి. నాతోనే ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఉండు. సింపుల్ గా చెప్పేసావులే బ్రో అనుకుంటారా కాదు ఎవరైనా సరే ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పగలుగుతారు కానీ ఇలానే ఎందుకు ఉండాయి ఇలానే ఎందుకు ఉండాలి అనేది ఎవరు వర్ణించలేరు. ఎందుకు అదొక ఫీలింగ్ అదొక భావన నువ్వు ఫీల్ అయ్యేదాన్ని బట్టే ప్రేమ అంటే ఏంటో నీకు అర్థం అవుతుంది ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు కానీ ఉండాల్సిన లక్షణాలు అయితే ఇవే ప్రేమలో ఉన్నప్పుడు నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు ఇలానే అనిపిస్తుంది. సింపుల్ ఉదాహరణ
(14:33) ఎక్కడో ఫారెస్ట్ లో తిరిగే చిలక నీ చుట్టూ నీ ఇంట్లో నీ కళ్ళ ముందు తిరగాలని కోరుకోవడం అనేది కోరిక. అసలు ఒక్క క్షణం కూడా నన్ను వదలకూడదు నాతోనే ఉండాలి నేను చెప్పినట్లే అది ఉండాలి అని కోరుకోవడం అది ఒక ఇష్టం అంటే నువ్వు పంజరంలో పెట్టుకుంటావు నువ్వు చూడాలనుకున్న ప్రతిసారి దాని దగ్గరికి వెళ్తావు చూస్తావు ఫుడ్ పెడతావు మళ్ళీ వెళ్ళిపోతావ్ సో ఇప్పుడు అది పూర్తిగా నీ కంట్రోల్ లో ఉంది అలా ఉండడం నీకు ఇష్టం మరి ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటంటే ఆ చిలక ఎక్కడైతే ఎలా అయితే జీవిస్తుందో దాన్ని అలానే జీవించేలా చేయడం దాన్ని నువ్వు సమస్య
(15:10) ఏదన్నా వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాలనుకోవడం ప్రొటెక్షన్ అంటే నువ్వు తీసుకొచ్చి పంజరంలో పెట్టి దానికి ఫుడ్ పెట్టడం కాదు దాని పాటికి అది హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎవడన్నా వేటగాడు వచ్చాడు దాన్ని వేటాడుతున్నాడు ఆ టైంలో నువ్వు కాపాడు అంతే అంతే గానీ తెచ్చి పంజరంలో పెట్టేసి నాది ప్రేమ అంటే ఎట్లా కాదు కదా కోరిక కలగడము దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలని సమాజాలు సాంప్రదాయాలు సంస్కృతులు రూల్స్ పెట్టడము అది కంట్రోల్ లో పెట్టుకోలేక దానికి ప్రేమ అని ముసుగు తగిలిచ్చి ఇంత కన్ఫ్యూజన్ రావడము ఫైనల్ గా ఇలా అయిపోవడం మరి ఏం చేస్తే ఈ పరిస్థితులు రాకుండా
(15:44) ఉన్నాయి అంటే దీనికి సమాధానం ఒకటి కాదు చాలా రకాల ప్రభావాలే ఉన్నాయి పెళ్లికేమో ఒక వయసు రూల్ పెట్టి వేసినారు అంతకంటే ముందు పెళ్లి చేసుకోవడం అనేది నేరం. సరే ఆ వయసు వచ్చినాక చేసుకుందాం అంటే ఆపోజిట్ జెండర్ దొరకడంలే ఎందుకంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలంటున్నారు నీ దగ్గర ఏముంది అంటున్నారు ఉద్యోగం ఉందా ఏం చేస్తున్నావ్ నువ్వు పనికవచ్చేవాడివా పనికి రాని వాడివా పోషించేవాడివా పోషించలేని వాడివా ఎన్నో క్యాలిక్యులేషన్స్ పిల్లలు దొరకడంలే ఈ వయసులో నేచర్ ప్రకారం బయాలజీ ప్రకారం నీ కోరికలేమో అయ్య అయితే కంట్రోల్ అవ్వవు అయేమో వయసు నిమిత్తం వస్తూనే ఉంటాయి. ఏం
(16:19) చేయాలో అర్థం కానప్పుడు ఈ కోరికలు తీర్చుకోవాలి తను సేఫ్టీగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో బ్రెయిన్ గేమ్స్ ఆడడం మొదలు పెడుతుంది. గేమ్స్ ఆడంగా ఆడంగా మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు మారాల్సింది ఒకటా ఇక్కడ లేదు ఇది ఒకటేదో ఏదో ఒక పాయింట్ రెండు పాయింట్స్ మారితే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి అనేది చెప్పేదానికి లేదు.
(16:40) చాలా రకాల ప్రభావాలే ఉన్నాయి అ పరిస్థితులు బట్టి మనమే అర్థం చేసుకోవాలి ముందు కోరిక అంటే ఏంది లవ్ అంటే ఏంది వీటి గురించి కొంచెం నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి మనిషికి ప్రతి మనిషికి తెలియాలి ఇప్పుడు చెప్పండి ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా ఈ ఆత్మహత్యలు చేసుకునేవారు హత్యలు చేసేవారు ప్రేమ పేరుతో వీళ్ళకు నిజంగా ప్రేమకు నిర్వచనం తెలుసా తెలీదు సో ఫైనల్ గా వన్ లైన్ ఆన్సర్ ఏంటంటే ప్రేమ అనేది నీ ఐడెంటిటీని లాస్ చేయకూడదు నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళ ఐడెంటిటీని కాపాడే ప్రయత్నం చేయాలి.
(17:14) వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవాలి వాళ్ళకి ఏదనా సమస్యలు వస్తే అందులో నుంచి నువ్వు బయట వేయాలని కోరుకోవాలి గానీ ఆ ప్రేమ కోసం నువ్వు సమస్యల్లోకి వెళ్ళిపోయి నీ ప్రాణాలు తీసేసుకొని ఇంత ఇదిగా ఉండడం అనేది ఇది ప్రేమ కాదు ఇది 100% అమాయకత్వమో పిచ్చితనమో మూర్ఖత్వమో అవుతుంది. సో ఇది గాయస్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
(17:39) వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా గాని కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment