*మనసు ఎందుకు అలసిపోతుంది....?*
గతాన్ని తవ్వటం...భవిష్యత్తు గురించి ఆత్రం...
ఈ పరుగు మనసుని అలసేలా చేస్తుంది, నిజమైన విశ్రాంతి వర్తమానం లోనే ఉంది.
ఏ స్థితినైనా అంగీకరించటంనే, సుఖం అంటారు. పరిస్థితిని అంగీకరించకపోతే అశాంతి.. ఇక్కడ చేయటానికి ఏమీలేదు, అలా ఉండటమే.
అందరికీ నేను జ్ఞానిననే గర్వం ఉంటుంది, కానీ ఆ గర్వం తనకు ఉందని, ఎవరు గుర్తించలేరు.
*ఏకో ధర్మః పరం శ్రేయః*
*క్షమైకా శాన్తిరుత్తమా* |
*విద్యైకా పరమా తృప్తిః*
*అహింసైకా సుఖావహా* ||
ధర్మమొక్కటే పరమశ్రేయస్సును కలిగించును....ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతినిస్తుంది.... చదువొక్కటే మిక్కిలి తృప్తిని ప్రసాదించును....అహింస ఒక్కటే సుఖాన్ని చేకూర్చును"
అబధ్ధంతొ కాసేపు తప్పించుకోగలవు, కానీ సత్యం ఎప్పుడు నిన్ను రక్షిస్తుంది.
శరణాగతి అంటే, జీవితం తో వాదనలను ఆపి, జీవన ప్రవాహం తో కొనసాగటం.
సరియైన వారు, సంతోషం కోసం వెతకరు, అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తారు, అర్ధం చేసుకోవటం ద్వారానే ఆనందం పొందగలము.
తమ బాధ్యతలను నెరవేర్చే అంకిత భావం, ఉన్నవారికి, దైవం లేదా ప్రకృతి అనుగ్రహం ఉంటుంది.
మంచి వాళ్ళు ఎలా వెళ్లాలో చెప్పరు, ఆ దారులను కనుగొని వెళ్లగలిగే దిక్సూచి ఇస్తారు. జ్ఞానం ఇతర విషయాలలో తమపై ఆధారపడకుండా చూసుకొంటారు.
మనిషి ఎంత పిచ్చివాడంటే, చిన్న పురుగుని సృష్టించలేడు, కానీ జగత్తుని సృష్టించారనే, వందల దేవుళ్ళని సృష్టించాడు.
ఏదీ అవసరం లేని, విశ్రాంతి స్థితియే ధ్యానం.తప్పుడు జ్ఞానం పట్ల జాగ్రత్త వహించు, ఇది అజ్ఞానం కన్నా ప్రమాదకరం.
No comments:
Post a Comment