Saturday, February 28, 2026

******స్త్రీలు తప్పు ఎలా చేస్తారు? వారి యొక్క వస్త్రాలంకరణే దానికి కారణము.

 బోంబేలో ఒక పాఠము నేర్చుకొన్నాను

పురాణ పుణ్యకథ పేరుతో నా వ్రాత ఇంకా ముగియలేదు, అక్కడ నేను నా గురించి మరొక ఆడపిల్ల గురించిన కథ చెప్పినాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను గూర్చి వివరించాలను కొంటున్నాను. మేమొక విజ్ఞానయాత్రకు వెళ్ళాము. అది 1943-44వ సంవత్సరములో కావచ్చు. మేము బోంబే చేరుకున్నాము. అక్కడ ఆడ, మగ పిల్లలు జంకు, భయము లేకుండా కలిసి మెలసి పోవుటను నేను చూచాను. ఒకసారి, ట్రాములో నాప్రక్కన కూర్చొన్న ఒక అందమైన బాలిక స్పర్శవల్ల నా మసస్సు గందరగోళమైంది. ఈమెకు కన్నడ రాదనుకొని, నా స్నేహితునితో '' మనమెందుకు ప్రయత్నించరాదు" అన్నాను. వెంటనే కండక్టర్ వచ్చి ‘‘మిమ్ములను చూస్తుంటే మీరు మైసూరు నుండి వచ్చిన వారిలా ఉన్నారు'' అన్నాడు. దానిని మరచి పోయారులా ఉంది. వీరందరూ బోంబే పిల్లలు. వారు మిమ్ములను నడి రోడ్డులోనే చెంప పగులగొడతారు. మీరు చెప్పినది వారికి అర్థమయిందంటే, మీరు చిక్కుల్లో పడతారు. మీరింత మూర్ఖులని నాకు తెలియదు!' మేము అతనితో పళ్ళికిలించి ఆ బస్సునుండి బయట పడ్డాము. ఇది కేవలము స్పర్శ యొక్క ఒక ఫలితము.

కాని స్త్రీలు తప్పు ఎలా చేస్తారు? వారు స్పర్శకే అవకాశము ఇవ్వరాదు. వారి యొక్క వస్త్రాలంకరణే దానికి కారణము. అది అద్దములో లాగ, కనిపింప చేస్తుంది. కోణాలు వేరే కావచ్చు. ఇది చాలా స్పష్టము. పల్చని వస్త్రధారణ కావచ్చు, వస్త్రధారణ శరీరాన్ని దాచడం కంటే బహిర్గతం చేస్తుంది. సహజముగా మగపిల్లలు హేళనచేయుటకు (పేరేపింప బడతారు. స్త్రీలు తమను అలంకరించు కోరాదని కాదు నా అర్ధం. వారు చేసుకోవచ్చును, కాని పెళ్ళికాని యువతులకు గౌరవప్రదమైన అలంకరణ అవసరము. వారు తమలోని దివ్య తేజస్సును పెంపొందించు కోవాలి . అప్పుడు వారిని చూసినపుడు, మన మనస్సులు గౌరవముతో నిండి ఉంటాయి. వారివల్ల ఇంద్రియపరమైన ఉద్రేకాన్ని పొందజాలము.

Captured from book: Vishwaroopa Darshanamu



No comments:

Post a Comment