*బౌద్ధంలో 3 శరణ్యాలుంటాయి*
*అనగా 3 ఆశ్రయా లుంటాయి.*
1.బుద్ధం శరణం గచ్చామి
బుద్దత్వాన్ని నేను ఆశ్రయిస్తున్నాను
విశ్వతత్వాన్ని తెలియటమే బుద్దత్వమైతే
అలాంటి స్పృహలోకి బుద్దుని శృతిలోకి
నేను చేరిపోతున్నాను..అని అర్ధం!
2. సంగం శరణం గచ్చామి
సంగాన్నినేను ఆశ్రయిస్తున్నాను
బౌద్ద ఆరామే బుద్ధ సంగం.
బుద్దత్వాన్ని పొందే చోటు
బుద్దత్వమ్ లోకి పయనించే
బుద్ధి పరిణమించే ఓ ప్రదేశం
గతంలోని బుద్దుళ్ళకి;భవిష్య బుద్దుళ్ళకి
బుద్దుడు ఓ మహా ద్వారం. అట్టి వేదికని
నేను ఆశ్రయిస్తున్నాను..అని అర్ధం!
కాలగతిలో ఆవిర్భావ బుద్దుళ్ళకి....
నేనూ ఓ ద్వారాన్నే..అని కూడా అర్ధం!
3.ధర్మం శరణం గచ్చామి..
ధర్మాన్ని ఆశ్రయిస్తున్నాను...
ఏది ఓ మనిషిని ఓ బుద్దుడిగా
చేస్తుందో.. చేయగలదో ఆ కళే
ఆ ప్రజ్ఞే..ధర్మం..అట్టి ధర్మాన్ని
నేను ఆశ్రయిస్తున్నాను..అనిఅర్ధం!
బుద్దత్వం.. ఓ శృతి; ఓ ద్వారం; ఓ కళ
అని చెప్పటమే ఈ 3 శరణ్యాల అంతరార్థం!
దైవాన్ని పూజించటం మనకి తెలుసు. కానీ
దైవంగా మనమే మారటంపట్ల శ్రద్ధ వహించం
కానీ స్వీయ ఆచరణతో స్వీయ అనుభూతితో
బుద్దత్వం పొందటమే బౌద్ధంలోని ప్రాముఖ్యత!
No comments:
Post a Comment