Saturday, February 28, 2026

*****ఓ తల్లులారా! తండ్రులారా! మంచి పిల్లలకు జన్మనిచ్చే బాధ్యతకలవారా! మీ భూమిక యొక్క ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొనండి.

 భగవాన్ తన గురించి

239

ఓ తల్లులారా! తండ్రులారా! మంచి పిల్లలకు జన్మనిచ్చే బాధ్యతకలవారా! మీ భూమిక యొక్క ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొనండి. మీరు పవిత్రులుకండి, తర్వాత పిల్లలను పవిత్రులుగా చేయండి. మీరు విజ్ఞానవంతులు కండి, పిల్లల్ని కానివ్వండి! ముందు మీలోవున్న చైతన్యతను గుర్తించండి. నిర్భయంగా ఉండండి. అప్పుడు పిల్లలు నిర్భయంగా ఉంటారు. మీరు శారీరకంగా పెరిగేటట్లు చూసుకోండి. మానసిక ఎదుగుదల కూడ ఉండనివ్వండి. మీ యొక్క అహాన్ని జయించండి. క్లుప్తంగా, మీలో ఉన్న చైతన్యాన్ని గుర్తించి అది చూపించే దిశలో నడవండి. అప్పుడు మీ యావత్తు కుటుంబము ఆ స్రవంతిలో ఒక భాగమైపోతుంది. ఇంకొకటేమిటంటే, మీకు దుర్గుణాలు ఉంటే మీ పిల్లలు కూడ వాటిని పొంది మీ పతనానికి దారి తీయవచ్చు.

మీ దుర్గుణాలు ఎంత బలంగా ముందుకు పోతాయంటే అవి మీ సమాజాన్ని, మీ దేశాన్ని కూడా నాశం చేస్తాయి. ఇది అంతా ఎంతో బాధకు కారణం కావచ్చు. ఓ దేవుడా! మీ నుండి ఈ మాత్రం దయాగుణం చాలు.

కనుక మనం మనలోని దైవత్వాన్ని గుర్తిస్తే, మనము స్వచ్ఛమైన సముద్రం వైపు నడువగలం!!

అవును కానీ ఈ జ్ఞానం ముందుగా మీరు నాకు ఎందుకు ఇవ్వలేదు. ఇది ఆహారం ఉడికిన తర్వాత అంటుకున్న నిప్పులాంటిది, తప్పు చేసిన తర్వాత జ్ఞానవంతులు కావటంలాంటిది. ఒక వ్యక్తి మాత్రమే కాదు, మానవ జాతి మొత్తం పాపజ్ఞానం వలన పాపపు బాటలో కదులుతుంది.


Book refrence: Vishwaroopa Darshanamu



No comments:

Post a Comment