Saturday, February 28, 2026

 *ఓం*


*"శాంతి సూక్తం"*


🕉️🙏
*"అధర్వ వేదము"*
🕉️🙏

🕉️🙏
*"అధర్వ వేదియ*
*శాంతి సూక్తం"*
🕉️🙏

🕉️🙏
*వేదము*
*పరమాత్మ జ్ఞానము.*
🕉️🙏
*చతుర్వ్  వేదాలలో*
చివరిది అయిన 
*అధర్వ వేదము* 
లోని ఈ 
*'శాంతి' ప్రార్ధన* 
కూడా
*భగవంతుడు*
మానవునికి
ఉపదేశించినదే 
*కరుణామయుడు*
*న్యాయకారి*
*సచ్చితానంద*
*స్వరూప పరమేశ్వరుడు*
తన 
*సృష్టి*  లో
నివసించే ప్రాణులు 
అన్ని 
*'శాంతి జీవనము'*
గడపాలని కోరుతాడు.
"అయిన 
*జీవులు* చేసే
*పుణ్య పాప కర్మలను*
వలన 
*సుఖః దుఃఖాలు*
అనుభవింపక తప్పదు".
*సర్వశక్తి వంతుడైన*
*భగవంతుడు కూడా*
*నియమ పాలన*
*చేస్తాడు.*
*అందుకే*
*"ఋషులు*
*కర్మ వైచిత్త్రయాత్*
*సృష్టి వైచిత్య్రమ్".*
జీవులు చేసే 
*పుణ్య పాప కర్మల*
తగిన
*సుఖః దుఃఖములను*
అనుభవించేoదుకు
వీలు గా 
*పరమాత్మ*
ఈ 
*సృష్టి రచన* ను 
చేస్తుంటాడు.
అన్నాద్ 
ఇది 
*పరమ సత్యము*
కనుక మనమంత
ఈ 
*'శాంతి ప్రార్థన'*
ద్వారా 
*మనసా వాచా కర్మణ*
సంకల్పించి తన
అనుకూల క్రియ చరణతో
ప్రపంచములో 
*శాంతి*
నెలకొలుపుకోవాలి.
నేడు 
పండిత పామరుల లేల్లరు
*"ఆత్మ శాంతిని*
*విశ్వ శాంతిని"*
కాంక్షించు వారే, 
మరి అందుకొరకు
ప్రయత్నించు 
వారేందరు❓
*'శాంతి'*
*అను పదమునకు,*
*అర్ధం ఏమి*
*"ఎన్ని రకముల*
*'శాంతి' ని  మనము*
*కాంక్షించ వలెను."*
అందుకు 
*శ్రేష్ఠ* 
తమ 
*ఉపాయం* ఏమి 
ఇవి ఆలోచించవలసిన 
విషయములు.
*"శమో ఉపశమే* 
*అను ధాతువు తో*
*'శాంతి'*
*పదము ఏర్పడును".*
*"'శాంతి' అనగా*
*దుఃఖోపశమనము "*
మనకు 
*కల్గు దుఃఖము* లను
*మూడు  వర్గములు* గా
విభజింప వచ్చును.
🕉️🙏
*1) అధ్యాత్మిక  దుఃఖములు*
🕉️🙏

🕉️🙏
మన 
*శరీరము* 
ద్వారా కలుగు 
*రోగాదులు,*
*మనస్సు* 
ద్వారా కలుగు
*"ఈర్ష్య, రాగ, ద్వేష*
*అవమానదులు."*
🕉️🙏

🕉️🙏
*2) అధి భౌతిక దుఃఖములు*
ఇతర 
*ప్రాణుల* 
ద్వారా కలుగు 
*కష్టములు*
*దొంగలు దోపిడి గాండ్రు,*
*హంతకులు, శత్రువులు*
మొదలగు 
*మానవుల* ద్వారాను
*సర్ప,  వ్వ్యాగ్ర,*
*విష కీటకాది*  
*ప్రాణుల* ద్వారాను 
సంభవించు 
*ఆపదలు.*
🕉️🙏

🕉️🙏
*3)అధి ధైవిక  దుఃఖములు.*
🕉️🙏
*దైవ విధి చే  కలుగు*
*అతి వృష్టి,*
*అనావృష్టి,*
*భూకంప*
*అగ్ని ప్రమాదాదులు,*
ఈ మూడింటిని  నుండి
*ఉపశమనము*
పొందుటకు
*ప్రతి మానవుడు*
తన 
*శక్తి* కొలది
ప్రయత్నించవలెను.
అందుకు 
*తగిన జ్ఞానమును*
వృద్ధి పరచుకొనవలెను.
తదుపరియే
పరమేశ్వరుని
ప్రార్ధించవలెను.
*పూర్ణ పురుషార్ధముతో*
కూడిన 
*ప్రార్ధన* యే 
ఈశ్వరుడి
*అనుగ్రహము* నకు  పాత్రము.
 
*'వేదము పరమేశ్వర వాణి.'*
అందలి ఉపదేశములే
*శాంతి* కి 
*శ్రేష్ఠ* తమ మార్గములు. 
*శాంతి* ని పొందుటకు
అనేక ఉపాయములు
*వేదము* లందు 
విస్తృతము గా కలవు.
అందు కొన్నింటిని
*"ఈ అధర్వ  వేదియ*
*శాంతి సూక్తము*  *వివరించును."*
వాటిని 
*అర్థ భావన* తో
పఠిoచుచు  
మన శక్తికొలది
*అగ్ని హోత్రము* లో
*ఆహుతులను*  ఇచ్చి
భౌతిక పదార్ధములలో
*శాంతి* నెలకొల్ప
యత్నింతము. 
ఏలయన 
*అగ్ని హోత్రము* లో వేసిన
*ఓషది  గృతములు*
భూలోకమున 
*అగ్ని* రూపమున 
భువర్ లోకమున
అంతరిక్షమున
*వాయు* రూపమునను
పరిణమించి  
*సమస్త జడ, చేతన*
*భూతములలో*
*శాంతి* ని  తెచ్చును.
చివరకు సుక్ష్మాoశము 
ద్విలోకమున  సూర్యుని
చేరి 
*దైవిక ఉపధ్రవములు*
రాకుండ నిరోదించును.
🕉️🙏

🕉️🙏
*1) వ శ్లోకం  భావం* 
🕉️🙏👇

🕉️🙏 
*ఓ శాంతి దాయక*
*పరమపిత,*
*పరమాత్మ*
నీ కృప వలన 
*ద్విలోక పృథ్వి లోక*
*అంతరిక్ష ములు*
మాకు
*శాంతి*
ధాయకములు  
అగును గాక 
ఉత్తమ జలముతో
ప్రవహించు 
*నది నదములు*  
*అన్న సోమలతాది*
*ఓషదులు*
మాకు 
*శాంతి* ని
యిచ్చును  గాక.
🕉️🙏

🕉️🙏
*2) వ శ్లోకం భావం* 
🕉️🙏👇

🕉️🙏
*ఓ  అంతర్యామి*
యైన ఈశ్వర 
ఓ *న్యాయకారి*
మేము ఓనర్చు కర్మలకు
పూర్వ రూపమైన 
మా 
*చిత్త*
సంస్కారములు
కార్యరూపములు
ధరించిన
*కర్మలు*
ధరించ నున్న *ఆలోచనలు*
మాకు 
*శాంతి*
నించునవి యే
అవునుగాక.
🕉️🙏

🕉️🙏
*3) వ శ్లోకం భావం*
🕉️🙏👇

🕉️🙏
*ఓ ఈశ్వర*
వేద జ్ఞానముతో 
పదును పెట్టబడిన
*దివ్యమైన*
మా
*"వాణి "(మాట)*
మమ్ము
నీ 
*ఆనంద ధామము*
నాకు చేర్చును. 
ఆ *"వాణి "(మాట)* యే
దూషిత మైన 
*ఘోర  అనర్ధములకు*
కారణము అగును.
కావున ఓ దేవ నీ కృప
వలన 
ఆ మా *వాణి (మాట )*
ఎప్పుడును 
*శాంతి* నిచ్చు నదియే 
అగును కాక.
🕉️🙏

🕉️🙏
*4)వ శ్లోకం భావం*
🕉️🙏👇

🕉️🙏
*హే అంతర్యామిన్* *పరమాత్మ*
*వేద జ్ఞానము* తో 
పుష్టిని  పొందిన 
మా 
*స్త్రీ పురుషుల*
ఇరువురి
*"మనస్సు"*
మమ్ము నిన్ను
చేర్చు చున్నది.
ఆ 
*మనస్సే* 
*అజ్ఞానము* తో కూడి 
*ఘోర పాపము* లకు  కారణమై
నీ నుండి 
దూరముచేయుచున్నది.
కావున హే ప్రభో అట్టి 
మా 
*మనస్సు*
మాకు 
*శాంతి* దాయకమే
అగును కాక.
🕉️🙏

🕉️🙏
*5) వ శ్లోకం భావం*
🕉️🙏👇
🕉️🙏
*హే సర్వ సాక్షి*
*పరమాత్మ*
వేద విజ్ఞానముతో
*తేజస్సు*  వంతమైన  
మా 
*పంచేద్రియములు*
ఆరవదైనా  
*మనస్సు*
మా హృదయమున
నెలకొన్న మాకు
శుభములే కల్గును.
అవియే 
*రాగ ద్వేషము* లతో
*దూషితములు*
అయిన,
*భయంకర పాపములు* 
అగు కారణములు
అగును. 
*హే ఈశ్వర*
నీ కృప వలన
ఆ 
*ఇంద్రియ మనస్సులు*
మాకు 
*శాంతి* నిచ్చునవి
యే అగును గాక.
🕉️🙏

🕉️🙏
*6) వ శ్లోకం భావం*
🕉️🙏👇

🕉️🙏
*హే రక్షక*
మా మిత్రులు,
*శ్రేష్ఠ పురుషులు,*
*విజ్ఞాన వేత్తలు,*
*ప్రజాపతులైన* 
*మా రాజులు*
మాకు 
*శాంతి* 
ని చేకూర్చు
వారే అగుదురు గాక.
"మా దేశ 
*భాగ్యవంతులు*
*మేధావులు,*
*న్యాయవేత్తలు*
మాకు శుభములను
కూర్చుటకు శ్రమింతురు
గాక.
🕉️🙏

🕉️🙏
*7) వ శ్లోకం భావం*
🕉️🙏👇

🕉️🙏
*హే ఈష*
నీ శాసనం వలన
మిత్ర రక్షకుల వంటి
*ప్రాణపాన వాయువులు*
వివిధ ప్రకారముల
భాసించ
వివస్వంతుడైన
*సూర్యుడు* మరియు
*మృత్యుడు*
కూడా మాకు
*శాంతి* దాయకములే
అగునుకాక.
🕉️🙏

🕉️🙏
*8) వ శ్లోకం భావం*
🕉️🙏👇

🕉️🙏
*హే రక్షక*
*సృష్టి*
గమనంలో
జరుగుచుండు
*భూకంప ములు,*
*ఉల్కాపాతములు*
*దోషయుక్త గోక్షీరాదులు* 
*భూమి కృంగుదలలు*
నీ కృప వలన మాకు
*శాంతి* దాయకములే 
అగును కాక.
అట్టి 
*ఉపద్రవములు*
నుండి రక్షించుకొను 
*జ్ఞానము* ను 
మాకు నీవు
ప్రసాదించి మమ్ము
*జాగరూపుల*
చేయుదువు గాక.
🕉️🙏

🕉️🙏
*9) వ శ్లోకం భావం*
🕉️🙏

🕉️🙏
*హే దయా సాగర*
*ఉల్కలు* గా
నష్ట మగుచున్న 
*నక్షత్రములు* 
అట్లే ఇతరుల
*విరుద్దాచరణములు*
*హింసాది ప్రవృత్తులు*
మాకు 
*శాంతి* నిచ్చునది
యే అగునుగాక. 
మేము నిర్మించు
*సరంగాదులు*
భూమి పై
పడుచుండు 
*ఉల్కలు*
దేశంలోని 
*కరువు కాటాకాది*
*ఉపద్రవములు*
మాకు 
*శాంతి* ని 
యిచ్చునదే అగునుగాక
హే ప్రభు వాటిని
తరించు
*'జ్ఞానము'* ను
మాకు యిచ్చి
కాపాడుము  తండ్రి. 
🕉️🙏

🕉️🙏
*10) వ శ్లోకం భావం*
🕉️🙏

🕉️🙏
*హే ఈశ్వర*
నీ కృప వలన
చంద్రులతో కూడి
యుండు 
*గ్రహములు*
ఆదిత్యుని ప్రకాశమునకు
అడ్డుపడు 
*రాహులు,*
మాకు
*శాంతి*
దాయాకములు
అగునుగాక. 
నీ దయ వలన
మృత్యురూపమైన 
*తోక చుక్కాదులు*
తీక్షణ  ప్రకాశము
*బృహస్పత్యాది*
గ్రహములు మాకు 
*శాంతి*
దాయకములే అగుగాక. 
🕉️🙏

🕉️🙏
*11) వ శ్లోకం భావం*
🕉️🙏

🕉️🙏
*ఓ వేద విద్యాదాత*
ఈశ్వర నీ కృప వలన
*వసురుద్ర ఆదిత్య*
బ్రహ్మచారులు 
*నాయకులు*
మాకు 
*శాంతి*  ని
చేకూర్చువారు 
అగుదురుగాక. మహర్షులైన,
*విజ్ఞానవేత్తలు* 
*మేధావులు*
అందరు
మాకు 
*శాంతి* ని 
ప్రాప్తింప జేయువారే
అగుదురుగాక. 
🕉️🙏

🕉️🙏
*12) వ శ్లోకం భావం*
🕉️🙏👇

🕉️🙏
*ఓ శాంతి దాత*
మా దేశమున
పూర్ణ విధ్వాంసులైన
*బ్రహ్మలు,*
*ప్రజపాలకులు,*
*న్యాయదీషులు,*
*సమస్త లోకములు,*
*ఋగాదివేదములు*
*జ్ఞానేద్రియ*
*మనో బుధ్థులు,*
*నాయక గణము,*
పరమేశ్వర రచిత 
సర్వ పదార్ధములు
*వేదములు*
*మాకు శాంతిని*
ప్రసాదించినవే 
అగునుగాక.
*విశ్వకళ్యాణము* ను
కోరు
*విద్వాoసులు*
*విజ్ఞానవేత్తలు*
అందరు మాకు  
*శాంతి* ని తెచ్చు
వారే అగుదురుగాక.
🕉️🙏

🕉️🙏
*13) వ శ్లోకం భావం*
🕉️🙏👇

🕉️🙏
*ఓ అభయదాత*
సప్తఋషులుగా 
వర్ణింపబడు
*"మా త్వక్, చక్షు*
*శ్రోత జిహ్వ గ్రాణ"*
*మనోబుద్ధులు"*
ఏయే  కర్మలను ఎరుగు
చున్నవో అవి అన్నియు
మాకు 
*శాంతి* నిచ్చునవే
అగునుగాక  అవి మాకు
*ఆరోగ్య ధైర్యాదులను*
యిచ్చి 
*శాంతి* ని
*నిర్భయత* ను 
యిచ్చును  గాక. 
🕉️🙏

🕉️🙏
*14) శ్లోకం భావం* 
🕉️🙏👇

🕉️🙏
*ఓ శాంతి దాత*
సర్వేశ్వర నీ దయ వలన
*పృథ్వి అంతరిక్ష*
*ద్విలోకములు*  
మాకు 
*శాంతి* దాయాకములు
అగును గాక.
*"జల ఓషదివనస్పతులు"*
మాకు
*శాంతి* నిచ్చునవి
అగునుగాక  అవి ఇవి
అన నేల 
*సమస్త జడ*
*చేతన దేవతా*
*గణములు*
మాకు 
*శాంతి*
దాయకములే  అగును
గాక. 
*శాంతి* కొరకు చేయు 
మా 
*సర్వ ప్రయత్నములు*
మాకు
*శాంతి* ని
*ధైర్యసాహసములను*
యిచ్చునవి అగునుగాక.
అ 
*శాంతి*
ప్రయత్నములతో
*మేము సర్వవిధ*
*శాంతులను* *పొందుదుము గాక,*
🕉️🙏


🕉️🙏
*సర్వద సర్వద సర్వత్ర*
*శాంతినే పొందుము*
*గాక.*
*అంతర్యామి యైన* 
*హే రక్షక మాలో యే*
*అజ్ఞానఘోర*
*భయంకర*
*క్రూర పాపములు*
*ఉన్నవో*
*అవి అన్నియు*
*నీ దయ వలన*
*శమించి*
*మాకు శుభములే*
*కలుగును గాక*
*సర్వము మాకు*
*శాంతి దాయకమే*
*అగును గాక,*
*హే సర్వ రక్షక*
*సర్వేశ్వర*
*నీ కృప వలన*
*మా*
*'అధ్యాత్మిక,*
*అధిదైవిక,*
*అధిభౌతిక'* 
*కష్టములు అన్నియు*
*శమించును గాక.*
🕉️🙏

🕉️🙏 
*ఓం శాంతిః శాంతిఃశాంతిః*
🕉️🙏

*🕉️🙏ఓమ్ 🕉️🙏*.     

No comments:

Post a Comment