కర్మ బంధాన్ని ఎలా వదులుకోవాలి? | How to Overcome Karma? | Ramana Maharshi | Sviya Prerana
Author Name:Sviya Prerana
Youtube Channel Url:https://www.youtube.com/@Sviya_Prerana
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RkYBU_MHeaU
Transcript:
(00:07) ఒకరోజు శిష్యులు రమణ మహర్షి దగ్గరకు వచ్చి స్వామి మేము ఎన్నో పనులు చేస్తున్నాము కదా మరి కర్మ బంధం నుండి ఎలా విముక్తులమ అవుతాము అని అడిగారు. అప్పుడు మహర్షి చిరునవ్వుతో ఈ ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తి రైలుఎక్కాడు. తన దగ్గర ఉన్న ఒక బరువైన మూటను తలమీద పెట్టుకొని కూర్చున్నాడు. రైలు వేగంగా వెళ్తోంది. కానీ ఆ వ్యక్తి మాత్రం బరువుతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
(00:35) పక్కన ఉన్న ప్రయాణికుడు అది చూసి అయ్యా ఆ మూటను కింద పెట్టవచ్చు కదా ఎలాగో రైలే కదా అన్నింటిని మోస్తోంది అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి లేదు లేదు ఈ బరువును నేను మోయకపోతే రైలుకు భారం ఎక్కువైపోతుంది అని సమాధానం ఇచ్చాడు. మహర్షి శిష్యులను చూసి ఇలా అన్నారు. నాయనా మన పరిస్థితి కూడా ఆ ప్రయాణికుడి లాగే ఉంది. అనంతమైన శక్తి కలిగిన ఆ భగవంతుడే ఈ ప్రపంచం అనే రైలును నడిపిస్తున్నాడు.
(01:06) మనం ఆ రైలులో ప్రయాణిస్తున్న చిన్న పాత్రధారులం మాత్రమే. కానీ మనం ఏమనుకుంటామంటే నేను చేస్తున్నాను నేనే మోస్తున్నాను అని ఆ కర్మ అనే బరువును మన తలమీద వేసుకుంటాం. ఆ నేను అనే భావనే కర్మ బంధానికి మూలం. నేను చేస్తున్నాను అనే అహంకారం లేనప్పుడు చేసే ప్రతి పని ఒక సేవగా మారుతుంది. అప్పుడే కర్మ మనల్ని అంటదు. హృదయంలో వెలుగువి నువ్వే రమణ ఆత్మజ్యోతి స్వరూపమే నువ్వే రమణ నిజమై
No comments:
Post a Comment