Thursday, March 5, 2026

మతి మరుపు ఎందుకు వస్తుంది? ఆయుర్వేదం చెప్పే సీక్రెట్!! || SANATHANA LIFE

మతి మరుపు ఎందుకు వస్తుంది? ఆయుర్వేదం చెప్పే సీక్రెట్!! || SANATHANA LIFE

Author Name:Sanathana Life

Youtube Channel Url:https://www.youtube.com/@Sanathana-Life

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ikNapBydenU



Transcript:
(00:00) నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా చాలా ఎనర్జిటిక్ గా ఏదో పని మీద ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళగానే అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని బ్లాంక్ అయిపోతారు. నిన్న జరిగిన విషయం స్పష్టంగా గుర్తుంటుంది. కానీ ఉదయం టిఫిన్ ఏం చేశమో గుర్తుకు రాదు. చిన్న విషయానికే విపరీతమైన కోపం లేదా ఏ నిర్ణయం తీసుకోలేక గంటల తరబడి గందరగోళం చాలామంది ఇది వయసు పైబడటం వల్ల వస్తుందిలే అని సరిపెట్టుకుంటారు.
(00:35) కానీ జాగ్రత్తగా వినండి. ఇది కేవలం వయసు సమస్య కాదు. ఈ రోజుల్లో ఐదవ తరగతి చదివే పిల్లవాడికే ఏకాగ్రత ఉండటం లేదు. 20 ఏళ్ల యువకుడికి నిద్ర పట్టడం లేదు. 40 ఏళ్లకే మతిమరుపు మొదలవుతుంది. అసలు మన మతి ఎందుకు మారుతోంది? మనం తినే తిండి లోపమా లేక మన ఆలోచన విధానంలో లోపమా దీనికి సమాధానం కేవలం డాక్టర్లు మాత్రమే కాదు వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఆయుర్వేదం మన పురాణాలు చాలా స్పష్టంగా చెప్పాయి.
(01:03) ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆనాడు వారు చెప్పిన విషయాలనే ఈనాడు మోడరన్ సైన్స్ న్యూరో సైన్స్ పేరుతో నిర్ధారిస్తుంది. ఈ వీడియోలో ఆయుర్వేదం మోడరన్ సైన్స్ మరియు మన శాస్త్రాలు ఈ మూడింటిని అన్వయించి మన మతిని మన జ్ఞాపక శక్తిని మన మానసిక ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఏడు బంగారు నియమాలు మీ జీవితాన్నే మార్చేయవచ్చు.
(01:32) అసలు ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది మతి అంటే కేవలం జ్ఞాపక శక్తి మాత్రమే కాదు ఆయుర్వేదం ప్రకారం మతి అంటే మూడు శక్తుల కలయక మొదటిగా ధి అంటే నేర్చుకునే శక్తి గ్రహించే శక్తి రెండవది ధృతి అంటే నేర్చుకున్న దాన్ని నిలుపుకునే శక్తి మూడవది స్మృతి అంటే అవసరమైనప్పుడు ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకునే శక్తి. ఈ మూడింటిలో ఏది దెబ్బ తిన్నా మన ప్రవర్తన మారిపోతుంది.
(02:02) దీనికి మూల కారణం గురించి చరక సంహితలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. ప్రజ్ఞాపరాదోహి రోగాణం మూల కారణం దీని అర్థం చాలా లోతైనది. ప్రజ్ఞ అంటే బుద్ధి. అపరాధం అంటే తప్పు చేయడం. మన బుద్ధికి తెలిసినా కూడా మనం చేసే తప్పులే సకల రోగాలకు మతిమరుపుకు కారణం అని దీని అర్థం. ఉదాహరణకు మీకు తెలుసు రాత్రిపూట ఎక్కువసేపు ఫోన్ చూస్తే నిద్ర రాదు అని కానీ చూస్తారు.
(02:28) మీకు తెలుసు ఆ నూనెలో వేయించిన పదార్థం తింటే గ్యాస్ వస్తుందని కానీ తినేస్తారు. మీకు తెలుసు ఆ చిన్న విషయానికే కోప్పడకూడదని కానీ అరిచేస్తారు. ఇదే ప్రజ్ఞాపరాధం. ఎప్పుడైతే మనసు చెప్పినట్టు వినకుండా బుద్ధిని పక్కన పెడతామో అప్పుడు శరీరంలోని దోషాలు ప్రకోపించి తిన్నగా వెళ్లి మెదుడుపై ప్రభావం చూపిస్తాయి. అదే మతి మార్పుకు మొదటి మెట్టు.
(02:52) ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫా దోషాలు బ్యాలెన్స్ తప్పినప్పుడు మన మనసు ఎలా ప్రవర్తిస్తుందో ఒకసారి గమనిద్దాం. మీరు ఇందులో ఏ కేటగిరీలో ఉన్నారో చెక్ చేసుకోండి. మొదటిగా వాతాదోషం. గాలి లాంటి మనసు. వాతం అంటే చలనం. ఎప్పుడైతే శరీరంలో వాతం పెరుగుతుందో మనసు కూడా గాలిలో దీపంలా రెపరెపలాడుతుంది. దీని లక్షణాలు వీరికి ఏది గుర్తుండదు.
(03:18) ఇప్పుడే ఒక విషయం చెప్తారు మరుక్షణం మర్చిపోతారు. విపరీతమైన ఆందోళన చిన్న శబ్దానికే ఉలిక్కి పడతారు. ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే వృద్ధుల్లో మతిమరుపు రావడానికి పిల్లలలో ఏకాగ్రత లేకపోవడానికి ప్రధాన కారణం ఈ వాతా దోషమే. రెండవది పిత్తా దోషం. నిప్పు లాంటి మనసు. పిత్తం అంటే వేడి. శరీరంలో వేడి పెరిగితే మనసు మండిపోతుంది.
(03:42) దీని లక్షణాలు వీరికి జ్ఞాపక శక్తి బాగానే ఉంటుంది. కానీ అది మంచికి వాడరు. పాత గొడవలు అవతలి వాళ్ళు అన్న మాటలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. విపరీతమైన కోపం చిరాకు వెంటనే జడ్జ్మెంట్ పాస్ చేయడం వీరి లక్షణం. ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే యువతలో ఆఫీస్ ఒత్తిడిలో ఉండే మధ్య వయస్కుల్లో ఇది ఎక్కువ. ఇది బర్నోట్ కి దారి తీస్తుంది.
(04:05) మూడవది కఫా దోషం మంచు లాంటి మనసు. కఫం అంటే స్థిరత్వం మరియు బరువు. ఇది పెరిగితే మనసు మొద్దు బారిపోతుంది. దీని లక్షణాలు వీరికి ఆలోచించడమే బద్ధకం. ఉదయం లేవగానే ఫ్రెష్ గా అనిపించదు. మెదడుపై ఏదో మబ్బు కమ్మినట్టు ఉంటుంది. డిప్రెషన్ అతినిద్ర వీరి సమస్యలు ఎవరిలో ఎక్కువ అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళలో శారీరక శ్రమ లేని వారిలో ఇది కనిపిస్తుంది.
(04:27) ఆయుర్వేదం చెప్పేది ఒక్కటే మన శరీరయో సంయోగ జీవః శరీరం మనసు వేరు వేరు కాదు. నీ పొట్టలో గ్యాస్ ఉంటే నీ మెదుడులో ఆలోచన సరిగ్గా ఉండదు. నీ మనసులో ఆందోళన ఉంటే నీ జీర్ణ శక్తి సరిగ్గా ఉండదు. ఇప్పుడు మనం మోడర్న్ సైన్స్ వైపు వద్దాం. ఆశ్చర్యకరంగా ఆయుర్వేదం చెప్పిన వాత, పిత్త, కఫా లక్షణాలని సైన్స్ వేరే పదాలతో వివరిస్తుంది.
(04:53) ఈ రోజుల్లో మతిమరుపు రావడానికి సైన్స్ చెప్పే ప్రధాన కారణాలు ఇవే. మొదటిగా దీర్ఘకాలిక ఒత్తిడి. మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు కార్టిజోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది తక్కువ మోతాదులో ఉంటే పర్లేదు. కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి ట్రాఫిక్ ఆఫీస్ డెడ్లైన్స్ ఈఎంఐ లు ఇలా నిరంతరం స్ట్రెస్ లో ఉంటే ఈ కార్టిజోల్ మెదుడులోని హిప్పోకాంపస్ అనే భాగాన్ని కుచించుకుపోయేలా చేస్తుంది.
(05:16) హిప్పోకాంపస్ అనేది మన మెమరీ సెంటర్ అందుకే స్ట్రెస్ లో ఉన్న వారికి తాళం చెవులు ఎక్కడ పెట్టారో కూడా గుర్తుండదు. రెండవది సమాచార దాడి. ఒకప్పుడు మనకు రోజుకు 10 వార్తలు తెలిసేవి. ఇప్పుడు నిమిషానికి 100 రీల్స్ చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే మన మెదుడికి ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో ప్రాసెస్ చేసే టైం దొరకడం లేదు. దీన్నే కాగ్నిటివ్ ఓవర్లోడ్ అంటారు.
(05:40) రీల్స్ చూసినప్పుడు వచ్చే డోపమైన్ కిక్ వల్ల మన మెదడు నెమ్మదిగా ఉండే పెద్ద విషయాల మీద శ్రద్ధ పెట్టలేకపోతుంది. అందుకే ఈ జనరేషన్ కి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. మూడవది మెదడు వాపు. మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ చెక్కెర మరియు నిద్రలేమి వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అది మెదడును చేరినప్పుడు బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. అంటే ఆలోచనలు మసగబారిపోతాయి.
(06:05) సైన్స్ సారాంశం ఒక్కటే బ్రెయిన్ నీడ్స్ రెస్ట్ అండ్ రిథమ్ మెదడుకి విశ్రాంతి మరియు ఒక క్రమ పద్ధతి కావాలి. సైన్స్ మరియు ఆయుర్వేదం శరీరం గురించి చెప్తే మన శాస్త్రాలు మనసు యొక్క మూల స్వభావం గురించి చెప్పాయి. భగవద్గీతలో అర్జునుడి ప్రశ్న కురుక్షేత్రంలో అర్జునుడు అంటాడు చంచలం హి మన కృష్ణ ప్రమాతే బలవద్రృడం అంటే కృష్ణ ఈ మనసు చాలా చంచలమైనది.
(06:30) గాలిని మూటగట్టడం ఎంత కష్టమో దీనిని నిగ్రహించడం అంత కష్టం అని వాపోతాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానమే మనకు పరిష్కారం. అభ్యాసేనత్తు కౌంతేయ వైరాగ్యేనచ గృహతే నిజమే అర్జున కానీ అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా దీన్ని అదుపు చేయవచ్చు. ఇక్కడ వైరాగ్యం అంటే అడవులకి వెళ్ళిపోవడం కాదు అనవసరమైన ఆలోచనల పట్ల అనవసరమైన గొడవల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం ఈ విషయం నాకు అనవసరం అని ఎప్పుడైతే మనం పక్కన పెట్టగలమో అప్పుడే మన మతి శక్తివంతం అవుతుంది.
(07:04) చివరిగా ఉపనిషత్తులు ఏమంటున్నాయో తెలుసుకుందాం. మనోహేవా మనుష్యానాం కారణం బంధమోక్షయో మన బంధానికి మన విముక్తికి మనసే కారణం. మీరు గమనించండి ఒక సమస్య వచ్చినప్పుడు అయ్యో నాకే ఎందుకు వచ్చింది అని ఆలోచించే మతి ఉంటే అది నరకం. ఈ సమస్య నుంచి నేనేం నేర్చుకోవాలి అని ఆలోచించే మతి ఉంటే అది జ్ఞానం. శాస్త్రాల ప్రకారం మతి చెడిపోవడానికి ప్రధాన కారణం అరిసడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలు అదుపులో లేకపోవడమే.
(07:37) ఇప్పుడు సమస్యలు తెలిసాయి. కారణాలు తెలిసాయి. మరి పరిష్కారం ఏంటి? ప్రతి వయసు వారికి ఆయుర్వేదం ప్రత్యేకమైన పరిష్కారాలు చూపించింది. మొదటిగా పిల్లలు 5 నుండి 15 సంవత్సరాలు పునాది దశ. ఈ వయసులో కఫం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రోజులో స్క్రీన్ వల్ల వాతం పెరుగుతుంది. పిల్లలకు అన్నం తినిపిస్తూ మొబైల్ ఇవ్వకండి. ఇది వారి మెదడుకు పొట్టకు మధ్య కనెక్షన్ కట్ చేస్తుంది.
(08:02) నిద్రపోయే ముందు బ్రైట్ స్క్రీన్ అస్సలు వద్దు. దీనికి పరిష్కారం సరస్వతి ఆకు. ఆయుర్వేద నిపుణుల సలహాతో సరస్వతి ఆకు వాడటం వల్ల జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అలాగే రోజు నిద్రపోయే ముందు కనీసం 11 సార్లు ఓంకారం లేదా చిన్న శ్లోకాలు చదివించండి. శబ్దం మెదడు నరాలను ఉత్తేజితం చేస్తుంది. రెండవది యువత 16 నుంచి 35 సంవత్సరాలు పరుగు పందెం దశ.
(08:28) వీరిలో పిత్తం ఎక్కువ ఓవర్ థింకింగ్ వీరి శత్రువు. వీరు చేసే తప్పులు రాత్రిరెండు గంటల వరకు మేలుకోవడం అతిగా కాఫీలు తాగడం ఇది ఆందోళనను పెంచుతుంది. దీనికి పరిష్కారం ప్రాణాయామం. రోజుకు 10 నిమిషాలు అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఇది మెదడులోని రెండు అర్థభాగాలను బ్యాలెన్స్ చేస్తుంది. [సంగీతం] అలాగే వారానికి ఒక్క రోజైనా లేదా రోజులో ఒక గంట అయినా ఫోన్ పక్కన పెట్టి ప్రకృతితో గడపండి లేదా మౌనంగా ఉండండి.
(08:54) మూడవది మధ్య వయసు 35 నుంచి 55 సంవత్సరాలు బాధ్యతల దశ. వీరికి స్ట్రెస్ ఎక్కువ. వీరికి పరిష్కారం వారానికి ఒక్కసారి నువ్వుల నూనెతో తలకి పాదాలకు మసాజ్ చేసుకోండి. ఇది వాతాన్ని తగ్గించి మంచి నిద్రను స్థిరమైన మతిని ఇస్తుంది. నాలుగవది వృద్ధులు 55 ప్లస్ సంవత్సరాలు విశ్రాంతి దశ. వీరిలో వాతం ఎక్కువైతే మతిమరుపు వస్తుంది.
(09:19) దీనికి పరిష్కారం వేడిగా తాజాగా వండుకున్న సాత్విక ఆహారాన్నే తీసుకోవాలి. చల్లటి పదార్థాలు మానేయాలి. గరుడ పురాణంలో చెప్పినట్టు సాత్విక ఆహారం స్మరణ శక్తిని పెంచుతుంది. భగవద్గీత పటణం లేదా నామస్మరణ చేయడం వల్ల మెదడు యక్టివ్ గా ఉంటుంది. మీ వయసు ఏదైనా సరే మీ మతిని వజ్రంలా మార్చుకోవాలంటే ఈ ఏడు సూత్రాలను పాటించండి. మొదటిగా నిద్ర రాత్రి 10 గంటల కల్లా పడుకోవడం.
(09:45) ఆయుర్వేదం ప్రకారం రాత్రి 10 గంటల నుండిరెండు గంటల మధ్యలో మెదడు శుద్ధి అవుతుంది. ఆ టైం మిస్ అయితే మరుసటి రోజు మతి మందగిస్తుంది. రెండవది ఆహారం మనం తినే ఆహారమే మన ఆలోచన అవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం మసాలాలు తగ్గించి సహజమైన ఆహారం తీసుకోండి. మూడవది శ్వాస. మీకు కోపం వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినప్పుడు గమనించండి.
(10:10) మీ శ్వాస వేగంగా ఉంటుంది. శ్వాసను దీర్ఘంగా మార్చుకుంటే మనసు వెంటనే శాంతిస్తుంది. నాలుగవది నీరు మెదుడులో 75% నీరే ఉంటుంది. నీరు తగ్గితే ఏకాగ్రత తగ్గుతుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం శ్రేష్టం. ఐదవది మల్టీ టాస్కింగ్ వద్దు. ఒకేసారి 10 పనులు చేయడం గొప్ప కాదు. అది మెదడుకు శిక్ష. ఒకసారి ఒక పని మీద ద్యాస పెట్టండి. ఆరవది ప్రకృతి. రోజులో కాసేపు ఆకాశాన్ని చెట్లని చూడండి.
(10:37) గ్రీన్ కలర్ మనసును ప్రశాంతపరుస్తుంది. ఏడవది కృతజ్ఞత. ఉదయం లేవగానే ఈ జీవితం ఇచ్చినందుకు భగవంతుడా నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. పాజిటివ్ మైండ్సెట్ బ్రెయిన్ కెమికల్స్ ని మారుస్తుంది. చివరగా ఒక్క మాట మతి అంటే కేవలం తెలివితేటలు కాదు. కష్టాల్లో కుంగిపోకుండా సుఖాల్లో పొంగిపోకుండా స్థిరంగా ఉండటమే నిజమైన సుమతి. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది.
(11:02) మతిమరుపు లేదా కోపం అనేది మీ స్వభావం కాదు అది మీ జీవన శైలి వల్ల వచ్చిన ఒక లక్షణం మాత్రమే దాన్ని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నైస్ వీడియో అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ విషయాలు మీ ఇంట్లో వాళ్ళకు ముఖ్యంగా పిల్లలకు వృద్ధులకు చాలా అవసరం.
(11:26) కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మన సనాతన ధర్మంలోని ఇలాంటి సైంటిఫిక్ విషయాలను జీవన విధానాలను తెలుసుకోవడానికి మాతో ప్రయాణించండి ధర్మో రక్షితి రక్షితః సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు

No comments:

Post a Comment