These 7 Signs Reveal Your Past Life Connection 😱 | జన్మ జన్మల బంధం
Author Name:Aryavarta Stories
Youtube Channel Url:https://www.youtube.com/@aryavarta_stories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JCTqB5xzH28
Transcript:
(00:01) మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. వారు మీకు పూర్తిగా స్ట్రేంజర్ కానీ వారిని మొదటిసారి చూసినప్పుడే వారు మీకు చాలా కాలంగా తెలుసు అన్న ఫీలింగ్ మీలో కలిగిందా వారి కళ్ళలోకి చూసినప్పుడు ఏదో తెలియని కంఫర్ట్ ఏదో తెలియని ఫ్యామిలియరిటీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా అప్పుడు మీకు అనిపించే ఉంటుంది. ఈ పర్సన్ ని ఎక్కడో చూసినట్టు ఉందే అని అవును మీరు వారిని చూశారు కానీ ఈ జన్మలో కాదు వేల సంవత్సరాల క్రితం వేరే శరీరంలో వేరే పేరుతో మీరు వారితో కలిసి జీవించారు.
(00:36) ఆ బంధం యుగ యుగాల నాటిది కాలం మారింది రూపం మారింది. కానీ ఆత్మల మధ్య బంధం తెగిపోలేదు. అందుకే వారు మళ్ళీ వేరే రూపంలో మీ ముందుకు వచ్చారు. అలాంటి మీ పూర్వజన్మ వ్యక్తులను ఈ జన్మలో గుర్తించగలిగే ఏడు పవర్ఫుల్ సంకేతాలను ఈ వీడియోలో నేను మీకు రివీల్ చేయబోతున్నాను. ఈ ఏడు పవర్ఫుల్ సంకేతాలు మీకు తెలిసాక మీ పూర్వజన్మ వ్యక్తులను చాలా మందిని మీరు గుర్తుపట్టేస్తారు.
(01:00) కాబట్టి ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీ జీవితంలో ఇలా సడన్ కనెక్షన్ ఫీల్ అయిన ఒక వ్యక్తి ఉంటే ఆ పర్సన్ ని మీరు ఇప్పుడే గుర్తు చేసుకొని కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే ఎస్ అని కామెంట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. మన వేదాలు వేల సంవత్సరాల క్రితమే ఒక నిజాన్ని చెప్పాయి. ఆ నిజాన్ని ఇప్పుడున్న మోడర్న్ సైన్స్ ఇప్పటికీ కూడా ప్రూవ్ చేయలేకపోతుంది.
(01:24) మీకు ఒక క్వశ్చన్ మీరు ఒక కొత్త వ్యక్తిని చూసినప్పుడు వారు మీకు ముందే తెలుసు అన్న ఫీలింగ్ మీకు ఎందుకు వస్తుంది? మీరు ఎన్నో కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. కానీ వాటిలో కొన్ని ప్రదేశాలను చూడగానే అక్కడికి ఇంతకుముందు ఎప్పుడో వచ్చినట్టు కొంతమందికి అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? దీని గురించి సైన్స్ దగ్గర ఎలాంటి జవాబు లేదు కానీ మన వేదాల దగ్గర ఉంది.
(01:47) గరుడ పురాణం స్పష్టంగా చెప్తుంది. ఆత్మలు ఒంటరిగా ట్రావెల్ చేయవు అవి సోల్ గ్రూప్ గా ట్రావెల్ చేస్తాయి అని అంటే మీతో బలమైన కర్మ బంధం ఉన్న ఆత్మలు జన్మ జన్మలకు మీతోనే వస్తాయి. ఒక జన్మలో మీకు అమ్మగా వచ్చిన ఆత్మ మరో జన్మలో మీకు వేరే బంధంగా వస్తుంది. ఒక జన్మలో మీకు శత్రువుగా ఉన్న ఆత్మ మరో జన్మలో మీకు బెస్ట్ ఫ్రెండ్ గా వస్తుంది.
(02:15) ఇక్కడ శరీరాలు మారతాయి పేర్లు మారతాయి కానీ ఆత్మల మధ్య బంధం మారదు. అందుకే మీతో పూర్వజన్మలో కర్మ బంధంగా ఉన్నవారు ఈ జన్మలో కూడా మీ జీవితంలోకి వస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తులను గుర్తించే ఏడు సంకేతాలు చెప్తాను. మొదటి సంకేతం వినగానే మీ జీవితంలో ఒక వ్యక్తి మీకు గుర్తొస్తారు. వారు మీ దగ్గర మీతో ఉన్న వ్యక్తి కావచ్చు లేక మీకు దూరమైన వ్యక్తి కావచ్చు.
(02:41) కానీ ఈ ఏడు సంకేతాలు వింటే వారు మీ పూర్వజన్మ బంధమా కాదా అనేది మీకే తెలిసిపోతుంది. ఈ సంకేతాలు చెప్పే ముందు ఒక నిజమైన సంఘటన గురించి మీకు చెప్పాలి. 1980 లో అమెరికాలో క్యాథరిన్ అనే ఒక మహిళ ఉండేది. ఆమెకి నీళ్ళంటే చాలా భయం చీకట అంటే చాలా చాలా భయం ఎందుకు అనేది ఆమెకే తెలియదు. ఆ భయం ఎక్కడి నుండి వచ్చిందో ఆమెకే అర్థమయ్యేది కాదు ఆమె నాకు ఎందుకు ఇలా జరుగుతుందని హార్వార్డ్ ట్రైనడ్ సైకాస్ట్ అయిన డాక్టర్ బ్రైన్ వైవ్స్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది.
(03:12) ఆ డాక్టర్ ఒక సైంటిస్ట్ కూడా అయితే ఈయన సోల్ మీద నమ్మకం లేని ఒక హేతువాది. అయితే ఈయన ఈమె భయానికి కారణం తెలుసుకోవడానికి హిప్నాయిస్ థెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ లో ఆమె చెప్పిన మాటలు విన్నాక ఆయనే ఆశ్చర్యపోయి షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పింది ఏమిటంటే నేను 4000 ఇయర్స్ క్రితం ఈజిప్ట్ లో ఉన్నాను.
(03:35) నేను నీళ్లలో చనిపోయాను. అందుకే ఈ జన్మలో నీళ్ళంటే భయం అని చెప్పింది. ఆ డాక్టర్ అక్కడితో ఆగలేదు ఇంకా లోతుగా వెళ్ళాడు. అప్పుడు జరిగింది ఇంకా పెద్ద షాకింగ్ ఆమె తన పూర్వజన్మలో ఉన్న వ్యక్తుల గురించి వర్ణించడం ప్రారంభించింది. వారి రూపాలు వారి స్వభావాలు వారితో తమ బంధం అన్ని చెప్పింది. వారు ఈ జన్మలో కూడా వేరే రూపంలో ఆమె జీవితంలో ఉన్నారు.
(04:02) ఆమె చెప్పినవన్నీ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యాయి. ఇదంతా విన్నాక ఆ డాక్టర్ లోపల ఏదో మారిపోయింది. సోల్ మీద నమ్మకం లేని ఆ సైంటిస్ట్ ఆ రోజు నుండి పూర్తిగా మారిపోయాడు. ఆయన ఆ అనుభవాన్ని మొత్తం దాచుకోలేదు. ప్రపంచానికి చెప్పాలని మెనీ లైవ్స్ మెనీ మాస్టర్ అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో క్యాథరిన్ తో జరిగిన అన్ని సెషన్లు ఉంటాయి.
(04:25) ఆమె చెప్పిన పూర్వజన్మ వివరాలు పూర్వజన్మ వ్యక్తులు ఈ జన్మలో ఎలా వస్తారో అన్ని ఆ బుక్లో రాశాడు. ఆ బుక్కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడయ్యాయి. ఆ బుక్ చదివిన వారిలో చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తమ జీవితంలో ఉన్న వ్యక్తులను చూసి వీళ్ళు నా గత జన్మ నుండే వచ్చారు అని. ఒక్కసారి ఆలోచించండి మన వేదాలు వేల సంవత్సరాల క్రితమే చెప్పింది ఒక వెస్టర్న్ సైంటిస్ట్ నిరూపించాడు.
(04:52) మరి మీ జీవితంలో ఇప్పుడు మీతో ఉన్న వ్యక్తులు వారు అనుకోకుండా మీ జీవితంలోకి వచ్చారని మీరు అనుకుంటున్నారా? కాదు వారు మీతో పూర్వజన్మ నుండే ఉన్నారు. ఇప్పుడు మీ పూర్వజన్మ వ్యక్తులను గుర్తించడానికి మీకు ఏడు సంకేతాలు చెబుతున్నాను. వీటిని ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి సంకేతం మొదటి చూపులోనే గుర్తించడం. గరుడ పురాణం ఇలా చెబుతుంది ఆత్మ పూర్వ స్మృతిం వహేత్ అని.
(05:17) అంటే దీని అర్థం ఆత్మ తన పూర్వజన్మ స్మృతిని ఎప్పుడూ వహిస్తూనే ఉంటుంది అని. అందుకే మీరు ఒక కంప్లీట్ స్టేంజర్ ని చూడగానే మీ మనసు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ మీ ఆత్మలో ఒక రికగ్నిషన్ జరుగుతుంది. మీ మనసుకి అది అర్థం కాదు కానీ మీ ఆత్మకు అది బాగా తెలుసు ఎందుకంటే ఆ ఆత్మను మీరు వేల సంవత్సరాల క్రితమే చూశారు. ఇలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా అయితే ఇప్పుడే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి.
(05:45) రెండవ సంకేతం మాటలు లేకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. కఠోపనిషత్తు ఇలా చెబుతుంది మనసే వేద మాప్తవ్యం అని అంటే ఆత్మను మాటలతో కాదు మనసుతోనే పొందగలం అని అర్థం నిజమైన సోల్ కనెక్షన్ కి మాటలు అవసరం లేదు. గత జన్మలో వారితో గడిపిన వేల గంటల ఎమోషన్స్ మీ ఆత్మ మెమోరీలో చెరగని ముద్రగా నిలిచిపోతాయి. అందుకే వారు నోరు విప్పకపోయినా వారి మనసులో ఏముందో మీకు తెలిసిపోతుంది.
(06:16) మూడవ సంకేతం వారు లేకపోతే తెలియని లోటు మీ జీవితంలో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి లేకపోతే మీకు బాధగా అనిపిస్తుంది. ఇది మీకు తెలుసు కానీ అసలు సమస్య ఏమిటంటే వందల మంది చుట్టూ ఉన్న వారు లేని లోటు మాత్రం మిమ్మల్ని వదలదు. ఆ ఒక్క వ్యక్తి లేకపోతే మిగతా వారందరూ ఉన్నా ఏదో పూర్తి కాలేదు అని మీకు అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు నిత్యయః సర్వగతః స్థానుహు అచలోయం సనాతనః అని అంటే ఆత్మ శాశ్వతమైనది.
(06:51) ఆ బంధం కూడా శాశ్వతమే అని అర్థం. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ ఆత్మ వారిని గుర్తుపట్టింది. వేల సంవత్సరాల బంధాన్ని గుర్తుపట్టింది. అందుకే వారు లేకపోతే ఆ లోటు అంత తీవ్రంగా అనిపిస్తుంది. నాలుగవ సంకేతం కలలో పదే పదే రావడం మాండుక్య ఉపనిషత్తు ఇలా చెబుతుంది. స్వప్నోహి ఆత్మనః స్వయం ప్రకాశః అని అంటే స్వప్నంలో ఆత్మ తనంతట తానే ప్రకాశిస్తుంది అని అర్థం.
(07:19) శరీరం నిద్రించిన ఆత్మ మేలుకొనే ఉంటుంది. మనకు కలలు చాలా రకాలుగా వస్తాయి. ఒకే వ్యక్తి కలలో పదే పదే వస్తూనే ఉంటారు. వారిని మర్చిపోదాం అనుకున్న నిద్రలో వారే కనిపిస్తారు. లేదా మీరు ఎప్పుడూ వెళ్ళని ఒక ప్రదేశం కలలో పదే పదే కనిపిస్తుంటుంది. మెలుకువ వచ్చాక కూడా ఆ ప్రదేశం మనసు నుండి పోదు లేదా ఒక సంఘటన మళ్ళీ మళ్ళీ కలలో జరుగుతూనే ఉంటుంది.
(07:43) ఆ కల చూసినప్పుడు అది రియల్ అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కేవలం కలలు కాదు మీ ఆత్మ నిద్రలో తన పూర్వజన్మ జ్ఞాపకాలను మీకు చూపిస్తుంది. అందుకే అవి పదే పదే వస్తాయి అందుకే వాటిని మర్చిపోలేము. ఐదవ సంకేతం గొడవలు ఉన్నా వదలలేకపోవడం గరుడ పురాణం ఇలా చెబుతుంది. కర్మ బంధేన బద్దః నాత్యజంతి పరస్పరం అని అంటే కర్మ బంధంతో బద్ధులైన ఆత్మలు ఆ కర్మ పూర్తయ్యే వరకు ఒకరినొకరు వదలవు అని దీని అర్థం.
(08:15) వారితో తరచు గొడవలు అవుతాయి బాధ పెడతారు వందల సార్లు వదిలేయాలని అనుకుంటారు కానీ వదలలేరు. వారితో మాట్లాడకూడదని మీ ఫోన్ ని పక్కన పెట్టేస్తారు. కానీ చెయ్యి మళ్ళీ ఆ ఫోన్ వైపే వెళుతుంది. దూరంగా ఉండాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతారు కానీ వారి గురించి ఆలోచన మాత్రం ఆగదు. ఇలా మీ జీవితంలో జరిగే ఉంటుంది కదా అయితే ఇప్పుడే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి.
(08:41) వారితో మీకు ఇంకా కర్మ బాకీ మిగిలే ఉంది. ఆ కర్మ పూర్తి కానంతవరకు మీ ఆత్మ వారిని వదలదు. ఇది బలహీనత కాదు ఇది మీ ఆత్మ యొక్క గొప్ప వివేకం. ఆరవ సంకేతం మీ జీవితాన్నే మార్చే రాక నారద భక్తి సూత్రాల్లో ఒక మాట చెప్పబడింది. తత్సంపర్కేణ ఆత్మ సంస్కారో జాయతే అని అంటే ఆత్మీయ సంపర్కం వల్ల ఆత్మ సంస్కారం కలుగుతుంది అని దీని అర్థం.
(09:10) వారు మీ జీవితంలోకి రాకముందు మీరు ఒకలా ఉన్నారు. వారు వచ్చాక మీరు మారిపోయారు. మీ ఆలోచనలు మారాయి మీరు చూసే విధానం మారింది. మీరు ఫీల్ చేసే తీరు మారింది. మంచిగా మారారా చెడుగా మారారా అది వేరే విషయం కానీ వారు వచ్చాక మీరు పాత వ్యక్తిగా లేరు. ఇదేమి యాదృచ్చికం కాదు వేల సంవత్సరాల నాటి ప్లాన్ ఇది.
(09:35) మీ ఆత్మను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి వారు మీ జీవితంలోకి ఒక పాఠంలా లేదా ఒక వరంలా వచ్చారు. ఇక చివరిదైన ఏడవ సంకేతం అత్యంత లోతైనది. నారద భక్తి సూత్రాల్లో ఇంకొక మాట కూడా చెప్పబడింది. పరమ విరహ శక్తిహి సా పరమ అని. అంటే వియోగంలో కూడా ప్రేమించే శక్తే పరమోన్నత ఆత్మ యోగం అని అర్థం. మనకి ఇష్టమైన పర్సన్ దూరమైనప్పుడు మిగతావన్నీ నార్మల్ గా ఉంటాయి.
(10:03) కానీ మన లోపల మాత్రం ఏదో విరిగిపోయినట్లు అనిపిస్తుంది. తినడం జరుగుతుంది నిద్రపోవడం జరుగుతుంది. కానీ ఏదో లేదు అన్న ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ పోదు. ఆ బాధ మీ గుండెల్లో నుంచి వచ్చింది కాదు అది మీ ఆత్మ నుండి వస్తుంది. ఎందుకంటే మీరు కేవలం ఒక వ్యక్తిని కోల్పోలేదు. యుగాల నాటి అనుబంధాన్ని కోల్పోయారు. కానీ గుర్తుంచుకోండి ఆత్మకు మరణం లేదు. బంధానికి అంతం లేదు.
(10:28) వారు మళ్ళీ వస్తారు వేరే రూపంలో. మీ జర్నీలో ఎప్పుడూ తోడుంటారు. ఈ ఏడు సంకేతాలు విన్నాక ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఇందులో ఐదు కంటే ఎక్కువ మీకు మ్యాచ్ అయితే ఆ వ్యక్తి మీకు సాధారణ పరిచయం కాదు వారు మీ పూర్వజన్మ బంధం జన్మ జన్మల నుండి మీతోనే ఉన్న ఆత్మ. ఇప్పుడే మీరు కామెంట్ లో రాయండి. మీకు ఎన్ని మ్యాచ్ అయ్యాయో మీ కామెంట్ చూసి నేను పర్సనల్ గా మీకు రిప్లై ఇస్తాను.
(10:56) మీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఉంటే ఈ వీడియోని వారికి పంపించండి. మాటలు చెప్పకుండానే వారికి అర్థమైపోతుంది. మీరేం చెప్పాలని అనుకుంటున్నారు. ఇలాంటి మరెన్నో రహస్యాల కోసం మన ఆర్యవర్త స్టోరీస్ YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్ లో ఉంచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం
No comments:
Post a Comment