Thursday, April 2, 2026

మనసు మనల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసా? | Satya Darshanam | Meditation Awareness | PMC Telugu

మనసు మనల్ని ఎలా మోసం చేస్తుందో తెలుసా? | Satya Darshanam | Meditation Awareness | PMC Telugu

Author Name:PMC Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=N3l7YPkXH34



Transcript:
(00:03) [సంగీతం] బ్రహ్మర్షి పితామ పత్రీజి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ అలాగే పిఎంసి ఛానల్ సభ్యులకు నిర్వాహకులకు ప్రేక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. పిఎంసి ఛానల్ నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా శాఖహారం గురించి పిరమిడ్ శక్తి గురించి మెడిటేషన్ గురించి చాలా అద్భుతంగా ప్రచారం అవుతా ఉంది. ఎంతోమంది ఈ పిఎంస్ ఛానల్ చూసి ధ్యానం చేస్తూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతా ఉన్నారు.
(00:36) మరి పత్రి గారి యొక్క సంకల్పం అద్భుతంగా నెరవేరుతుంది భూమిమీద. ఈరోజు మరికొన్ని విషయాలు పిఎన్సి ద్వారా మనం అందితాము. శరీరము, మనసు బుద్ధి, ఆత్మ శరీరము మనకు ఎలా వస్తుందంటే మనమే ఉన్నతమైన లోకాల నుంచి సంకల్పం చేత ఆ జీవాత్మ శరీరాన్ని సృష్టించుకుంటుంది తల్లి గర్భంల మన అమ్మవాళ్ళకు శరీరాన్ని తయారు చేయలేరు మన అమ్మ తల్లి ఆ గర్భసంచిలో ఉన్న ఆ మాస్టర్స్ అందరూ
(01:24) గార్డియన్ ఏంజెల్స్ నేచర్ స్పిరిట్ ప్రకృతి ఆత్మలు సూష సూక్ష్మ దేవతలు వాళ్ళకు మన జీవాత్మ పైలోకం నుంచి తనకు కావలసిన విధంగా శరీరాన్ని ఆదేశాలు పంపుతుందన్నమాట ఆడగనా మొగగనా కుంటిగనా గుడ్డిగనా తెల్లగనా నల్లగనా పొట్టెంత పొడవెంత ఆ గత జన్మల సంస్కారాలను బట్టి ఆ కర్మను బట్టి ఆ తెలివి తేటలను బట్టి ఆ జీవాత్మ తనకు నచ్చినట్లుగా ఆదేశాలు ఇస్తే ఆ గర్భసంచిలో ఉన్న ఆ మాస్టర్స్ అందరూ ఆ తల్లి లోపల ఉన్న మెటీరియల్ తీసుకొని పంచభూతాలతో తయారైన మెటీరియల్ తీసుకొని
(02:12) మళ్ళీ అట్లాంటి శరీరాన్ని తయారు చేస్తుంది. అంటే మా అమ్మకు ఈ శరీరము తయారు చేసే విధానం తెలియదు వాళ్ళకు ఒకవేళ నిజంగా ఆ తల్లికి తనే గన శరీరాన్ని సృష్టిస్తుంటే కుంటిగా గుడ్డిగా ఏ తల్లి స్వీకరించదు. తన పిల్లలు సరిగ్గా పుట్టాలి అనే ఆలోచనతో ఉంటం. మరి అట్లాటప్పుడు నిజంగా తల్లికి తన పిండము లోపల ఎలా తయారవుతుంది ఆడనా మొగనా అని తెలుసుకోగలిగితే ముందుగానే చెప్పొచ్చు కదా మనకు మన అమ్మ ఎందుకు చెప్తలేదు అంటే తనకు తెలియదు పిండం ఎలా తయారయ్యేది.
(02:59) మరి డాక్టర్స్ స్కానింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది ఆడనా మొగనా అని చూసి చెప్తారు కదా డాక్టర్స్ కూడా ఏమన్నా అవయవాల లోపం ఉంటే కూడా మనకు డాక్టరే చెప్తాడు కానీ తల్లి చెప్తలేదు అంటే తల్లికి ఆ పిండాన్ని రూపం తయారు చేయడం తెలియదన్నమాట కాకపోతే తన ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ తత్వము ఆ శ్రద్ధ అదల్లా చాలా ఉపయోగపడుతుంది ఆ పిండం తయారు కావడానికి రెండోది ఆ తల్లి ఆ గర్భము దాల్చకముందే ఏ ఆత్మ అయితే భూమి మీదకి రావాలని నిశ్చయించుకున్నదో వాళ్ళతో మాట్లాడి ఒప్పుకొని స్వీకరించిన తర్వాతనే మనము ఆ
(03:45) గర్భములో దూరుతాం అన్నమాట. అంటే తల్లి పూర్తిగా అంకరిస్తుంది. మీరు రండి నా శరీరంలకు భూమిమీదకి నేను మీకు ఎంతైనా హెల్ప్ చేయగలుగుతా అని ఒప్పుకుంటుంది. ఇప్పుడు సపోజ్ కొంతమంది పుట్టుకతోనే పిల్లలకు కాళ్ళు లేకపోవడం చేతులు లేకపోవడం బ్రెయిన్ సరిగ్గా ఉండదు పుట్టినప్పటి నుంచి కూడా మరి అట్లాంటి పరిస్థితి ఆ తల్లికి ముందే తెలుసు అట్లాంటి ఆ సోల్ వస్తుంది నా బాడీలకని ఆవల్ల ఒప్పుకొని తల్లి నిర్ణయించుకొని ఆ స్వీకరించిన వల్ల ఆ సోలు ఆ బాడీని తయారు చేసుకుంటుంది సంకల్పం చేత పుట్టిన తర్వాత అంగవైక అంగవైకల్యం ఉన్న ఆ
(04:32) చిన్న పిల్లలను తల్లి ఎంత కష్టమైనా పడి ఎన్ని అవమానాలు ఎదుర్కొనైనా సరే ఆ పెంచి పెద్దగా చేస్తుంది ఎందుకంటే తను ఆల్రెడీ గర్భంలోకి రాకముందే ఒప్పుకున్నది కాబట్టి అంత ఓర్పు సహనం ఉంటుందన్నమాట అయితే కొన్నిసార్లు ఆ తల్లి ఏం చేస్తుందంటే అంతా మర్చిపోతాం కాబట్టి మనం భూమి మీదకి వచ్చినాక నాకు ఇట్లాంటి పిల్లలు వద్దులే ఎందుకు అవసరం లేదు నాకు అనవసరంగా ఇట్లాంటి పిల్లలు నా గర్భంలో పుట్టిరు కదా అని ఆ మంది చీటిపోటి మాటలు విని తనకు నచ్చక నాకు ఇట్లాంటి పిల్లలు అవసరం లేదని చెప్పి ప్రతిరోజు చీదరించుకోవడము ఇష్టం లేనట్టు మాట్లాడడము తిట్టడము చేసినప్పుడు ఆ సోల్
(05:17) ఏం చేస్తుందంటే కొద్ది రోజులు అయినాక బాడీ వికెట్ చేస్తుందన్నమాట ఎందుకో మా తల్లికి ఇష్టం లేనట్టు ఉంది ఇదని ఒకవేళ ఆ తల్లి మంచిగానే ఉంచుకున్నది అనుకుందాము ఎన్ని రోజులైనా ఉండగలుగుతారు వాళ్ళు ఆ సోల్ అది అంటే ఈ శరీరము మన తల్లి తయారు చేయడం లేదు మన జీవాత్మనే సూక్ష్మ లోకం నుంచి కారణ లోకంలో ఉండి తయారు చేసుకుంటుంది అన్నమాట మరి ఇట్లాంటి శరీరాన్ని మనము తీసుకొని భూమి మీదకి వచ్చి వచ్చిన పనులు చేయకుండా మర్చిపోయి మనసు మాయలబడి మన ఇష్టానుసారంగా చేయవలసిన చేయకుండా చేయరానివి చేస్తూ ఒక జన్మ వృధా అవుతుంది మనకు అంటే ఈ శరీరాన్ని మనము ఎంతో శ్రద్ధతో
(06:05) ఓర్పు సహనంతో సంకల్పం చేత మాస్టర్స్ యొక్క సలహాల పాట తో మనము మన అమ్మ గర్భంలో తయారు చేసుకున్నాం. మరి అట్లా అప్పుడు బయటికి వచ్చినాక మనకు ఆ ఎరుక లేక చిన్న భిన్నం అయిపోతుంటాం. అదే మెడిటేషన్ చేస్తే మనము ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం భూమిమీద వచ్చిన పనులన్నీ చక్కగా చేసుకొని తిరిగి ప్రయాణం అవుతాం మనం అంటే ఈ శరీరము ఎంతో దేదిప్యమానంతో ఎంతో ఎరుకతో మనం తయారు చేసుకున్నాం.
(06:42) మళ్ళీ ఆ సోల్ ఏం చేస్తుందంటే ఓ త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో ఓ ఫైవ్ మంత్స్ గాని మళ్ళీ వచ్చి ఆ తల్లి గర్భంలోకి దూరి తన పిండము అంటే తన బాడీ తనకు అనుకున్నట్లు ఉందా తయారవుతుందా లేదా అని అప్పుడప్పుడు సూపర్వైజర్ చేస్తుంది అన్నమాట. చేసి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. అట్లా మళ్ళీ నైన్ మంత్స్ అయినప్పుడు ఆ సోలు నేను ఇంక వెళ్ళాలి భూమి మీదకి అని నిర్ణయించుకున్నప్పుడు తల్లికి పెయిన్స్ వస్తాయి.
(07:16) ఒకవేళ ఆ సోలు నేను అవసరం లేదు నేను పోను వద్దులే అనుకున్నప్పుడు పెయిన్స్ రావు ఆ పిండము కొద్ది రోజులక చనిపోతుంది. ఎందుకంటే ఆ సోల్ నిర్ణయించుకుంటలేదు ఎందుకో ఫస్ట్ రావాలనుకున్నది కానీ మళ్ళీ ఎందుకో కొన్ని కారణాల వల్ల రాలేకపోతుంది ఆ సోలు అప్పుడు ఆ లోపల ఉండే ఆ పిండం అనేది చనిపోతుంది చనిపోయినప్పుడు డాక్టర్స్ స్కానింగ్ చేసి ఏం చెప్తారంటే లోపల పిండం చనిపోయింది డెలివరీ కష్టం అయ్యేది ఆ ఆపరేషన్ చేసి తీసేస్తే తల్లి సేఫ్ గా ఉంటది ఎట్లా లోపల పాప డెత్ అయింది కాబట్టి అని డాక్టర్ నిర్ణయం తీసుకొని ఆ పేషెంట్ చెప్తాడు అన్నమాట అప్పుడు ఆ పేషెంట్ అయ్యో
(08:00) అట్లానా సరేలే నేను బతికితే చార్లే అని చెప్పి నిర్ణయించుకొని ఆ సీజరియన్ గాని డెలివరీ గాని చేసుకొని ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే ఈవల్ల మనకు ఎలా తెలుస్తుంది అంటే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం చేస్తేనే ఈ లోతైన విషయాలు మనకు ఆధ్యాత్మిక శాస్త్రం మనకు అర్థంఅవుతుంది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి డాక్టర్స్ కు భూమిమీద ఏమాత్రం తెలియదు వాళ్ళకు శరీరం గురించే తెలుసు కానీ లోపల ఉండే ఆ జీవాత్మ గురించి ఏమాత్రం వాళ్ళకు తెలియదు.
(08:35) అందుకే పత్రి గారు నో డాక్టర్ నో మెడిసిన్ అన్నాడు. సరే వాళ్ళు డాక్టర్స్ వల్ల కూడా కొంతవరకు మనందరము ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం లేకుంటే ఒక యాక్సిడెంట్ అయింది బ్లడ్ పోతుంది ఆపాల్సి వస్తది. కొన్ని సీరియస్ కండిషన్ లో ఆక్సిజన్ అవసరం వస్తది. అప్పుడు ఆ పేషెంట్ సేవ్ చేస్తే ఇంకా కొద్ది రోజులు అతను బతకొచ్చు భూమిమీద కానీ చనిపోయే వాళ్ళని బ్రతికేయడం అసాధ్యము కాకపోతే కొంత పోస్ట్పోన్ చేసుకోవచ్చు మన లైఫ్ ను ముందుకు తీసుకెళ్లొచ్చు.
(09:07) మనసు అనేది మనం వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాం ఏమేమ తీసుకుంటాం వచ్చేటప్పుడు అంటే కారణ లోకాలలో అహంకారము తిత్తము సూక్ష్మ లోకంలో మనసు బుద్ధి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచన్మాత్రలు ఆ సూక్ష్మ శరీరం లోకంలో తీసుకొని ఈ ఈ పంచభూతాలతో తయారైన బాడీలో ఆ 20 తత్వాలతో ఆత్మ దూరుతుంది అన్నమాట ఆ ఆ ఫిజికల్ బాడీలోకి ఆ పిండం లోపలికి దూరుతున్నాం మనం బయటికి వచ్చినాక 20 తత్వాలు ఉంటాయి.
(09:46) ఇందులో అత్యంత ముఖ్యమైని మనసు మన ఆత్మ తర్వాత శక్తివంతమైనది ఏందంటే సృష్టిలో మనసు మైండ్ ఈ మనసు ఏ జన్మకు సంబంధించింది ఆ జన్మకు ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి నా మనసు ఎందుకు ఇట్లా ఉంది ధ్యానంలోకి రాకముందు వరకు అంటే మన ఇంటి నడవడి మన తల్లిదండ్రులు ఎలా ఉండరు మన కుటుంబం ఎలా ఉంది మన చుట్టూ ముట్టు ఎలాంటి వాతావరణంలో మనం జీవిస్తున్నాము వృత్తి ఏంది ఈ వల్ల ఈ జన్మకు సంబంధించిన మనసు మనం ఇట్లా ఉంటాం.
(10:22) ఒక ముస్లిం ఇంట్లో పుడితే నేను ముస్లింను నేను మహమ్మదీయున్ని నా మతం ఇది అంటాడు. ఒక క్రిస్టియన్ ఇంట్లో పుడితే నేను క్రిస్టియన్ నేను జీసస్ క్రైస్ట్ నేనే ప్రార్థిస్తాను అని అంటాడు ఆయన మనసు అట్లా ఉంది. హిందువుల ఇంట్లో పుడితే నేను హిందువును నేను కృష్ణుని పూజిస్తా అంటాడు. అంటే ఎందుకు ఇట్లా అంటున్నారు వేరే వేరేగా అంటే వాళ్ళ మనసు అలాంటి ఇంట్లో పుట్టారు కాబట్టి వాళ్ళ మనసులో అలాంటి స్వభావం ఉంటుంది.
(10:48) ఈ మనసును మనము ధ్యానం ద్వారా మన చేతులకు తెచ్చుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ మనసు చేతులో మనం ఉంటాం. ఆ మనసు అనేది ఆ మైండ్ అనేది మహా శక్తివంతమైంది. మనం చేసే ప్రతి ఆలోచనకు ఆత్మ శక్తిని ఇస్తుంటది. ఆత్మకు శక్తిని ఇయ్యడం తప్ప వేరే పని ఏమ ఉండదు. మనసుక ఏముంది ఆలోచించడం ఈ మనసులో ఏముంటాయి ద్వైతం ఉంటుంది అంటే మంచి చెడు కీడు మేలు అదృష్టము దురదృష్టము మంచి చెడు ఇది బాగుంది అది బాగాలేదు ఇట్లాంటి ఈ ద్వైతంలో
(11:37) మనసు ఎప్పుడు పనిచేస్తుంటుంది. అయితే ఈ ద్వైతం అనేది ఎందుకు ఉంది ఇట్లా మంచి చెడు స్వభావం మనసు కంటే ఈ మనసు చేత కొన్ని మంచి పనులు చేసి సంతోషపడతాం కొన్ని చెడ్డ పనులు చేసి బాధపడుతుంటాం. మంచి చేసి కొంత నేర్చుకుంటుంది పాఠాలు చెడు చేసి కొంత నేర్చుకుంటాం పాఠాలు మనం ఇప్పుడు నీకు ఏదైనా ఒక వస్తువు కావాలే ఒక ఇల్లు కావాలి లేదంటే ఒక కారు కొనాలి ఏదైనా తినే ఆహార పదార్థాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనసుల ఆ కోరిక బలంగా ఉన్నప్పుడు ఆత్మ శక్తిని ఇవ్వడం వలన భౌతికంగా అది మన ముందరికి
(12:24) వస్తుందన్నమాట తినే ఆహార పదార్థాలు కావచ్చు మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ కూలర్ ఏదైనా వస్తువులు కావచ్చు ఈ వస్తువులను సృష్టి చేస్తుంది మన మనసు అంటే ఆలోచించే మనసేమో కాన్షియస్ మైండ్ అంటే చేతనా మనసు సబ్కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనసు ఆ పైన ఉండే మనసు ఎప్పుడు ఆలోచిస్తుంటుంది ఆలోచనల ఒకవేళ కంటిన్యూగా అలాగే ఎమోషన్ గా ఫీల్ అయినప్పుడు ఏదైతే మనము ఇది కావా కావాలి నాకు ఖచ్చితంగా అని ఎమోషన్ గా ఫీల్ అయినప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని మనకు సృష్టి చేసి పెడుతుంది.
(13:04) అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఈ సబ్కాన్షియస్ మైండ్ కు మంచి చెడు తెలియదు దానికి ఇది మనకు ఒక సేవకునిలాగా పనిచేస్తుంది చెప్పింది చేస్తుంది అన్నమాట అయితే ఈ విషయం మనం ప్రాక్టికల్ గా ఆ తీరిగా తెలుసు మనకని దాన్ని ప్రాక్టికల్ గా అనుభవంలోకి తెచ్చుకోవాలని చాలా కష్టం దానికి ధ్యానం ఒకటే మార్గం మన మనసును అది ఏమ ఆలోచిస్తు స్తుంది అని ఆ ఎరుక లేకపోతే మనం పప్పుల కాలేస్తాం ఎందుకంటే ఏదో ఒక యాక్సిడెంట్ గురించి లేకుంటే మన అనారోగ్యం గురించి పదే పదే ఆలోచన వస్తున్నప్పుడు మనకు ఎరుక లేకపోతే అయ్యో నాకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు
(13:50) వస్తున్నాయి నాకు ఇది ఇష్టం లేదు కదా అని ఆ ఎరుక అవేర్నెస్ లేకపోతే ఆ ఆలోచన సబ్కాన్షియస్ మైండ్ లోకి పోయినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ పని ఏందంటే ఏది ఏది అడిగితే అది ఇవ్వడమే ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పని అవి జరిగినాక మనం ఏడుస్తూ కూర్చుంటాం. అయ్యో నా జీవితం అంతా ఇలా అయిపోయింది. అంత కష్టాలు సమస్యలు రోగాలు ఉన్నాయి పక్కవాళ్ళు నన్ను ఇలా చేసిరి లేకుంటే భగవంతుడే నన్ను ఇట్లా రాసి పంపించిండు నాకు అని పక్కవాళ్ళను భగవంతుని తిడుతుంటాం.
(14:33) కానీ నా మైండ్ ద్వారా నా ఆలోచనల ద్వారానే నేను ఇట్లాంటి నెగిటివ్ అంతా సృష్టించుకున్నా కదా అనే ఎరుక లేకుంటది మనిషికి ధ్యానం చేయకపోతే ఈ సాధన చేస్తూ చేస్తూ చేస్తూ గంటలు గంటలు చేయడం వల్ల కళ్ళు తెరిసినాక నీ మనసుతో జాగ్రత్త ఉండాలి. నీ ఆలోచనలతో ఎరుక ఉండాలి. ఆ ఎరుక వచ్చినప్పుడు మనం ఆ నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు సాక్షిగా చూస్తూ వదిలేయాలి. ఆలోచన వెళ్ళిపోతుంది.
(15:08) మనకు వచ్చే ఆలోచనలు అన్నీ కూడా మనసులో పుడుతూ సస్తూ ఉంటాయి. పుడతాయి మనం ఏమనకుండా చచ్చిపోతది మళ్లా కొత్త ఆలోచన వస్తది. మళ్ళీ అది ఏమనకుంటే అది చచ్చిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం అంటే వాటిని బిగ్గెర పట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఎరుక లేకపోతే ఏదైనా భయపడుతున్నప్పుడు గానీ ఆందోళన చెందినప్పుడు నాకు ఇలా జరుగుతుందేమో అని ఆలోచన చేసినప్పుడు ఈ చెడు మొత్తము తొందరగా ఎమోషన్లకి వెళ్ళిపోయి తొందరగా సృష్టించబడతాయి అవి అదే మంచిగాన మీరు అనుకున్నారు అనుకోండి అది ఆ మంచి దానికి ఎమోషన్ గా ఫీల్ కాము
(15:55) ఎందుకు కామంటే ఇవి జరుగుతావో లేవో అనే డౌట్ వస్తది మనకు కానీ చెడు ఆలోచన వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా నమ్ముతాం మనం ఇది జరుగుతుంది కచ్చితంగా ఒకాయన ఇంట్లో దొంగలు పడతారేమో అని ప్రతిరోజు అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూ ఓరోజు నిజంగా దొంగలు పడ్డారు. ఎందుకు అట్లా అయింది అంటే అతను ఆ చేసే ఆలోచనలన్నీ ఆ కాన్షియస్ మైండ్ నుంచి సబ్కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయినాయి నెల రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాడు ఆయన ప్రతిసారి బయట పోయేటప్పుడల్లా ఇల్లు చూస్తూ తాలం దిక్కు చూస్తూ దొంగలు పడతారేమో అని అనుకోవడం వల్ల అది కొద్ది రోజులు అయినాక ఆయన సంకల్పము దొంగ కంది
(16:37) వచ్చి తీసుకొని వెళ్తాడు వెళ్ళినప్పుడు ఏం చెప్తాడుఅంటే ఈయన నేను చెప్పలే ఈయన కరెక్ట్ చెప్పిన దొంగలు పడతారని చెప్పాను కాబట్టి కరెక్ట్ పడ్డారు అంటే ఆయన ఒక జాతక రూపకంగా చూస్తున్నాడు అంటే నేను ఏదనుకుంటే అది జరుగుతుంది అంటే కొంతమంది జాతకం చెప్తారు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అట్లా అనుకుంటున్నాడు కానీ నేను సృష్టించుకున్న నా ఆలోచన మీద నాకు స్పృహ లేక దొంగలు పడతారేమో అని పదే పదే ఆలోచన వచ్చినప్పుడు నా ఇంట్లో ఎందుకు పడతారు నేను జాగ్రత్తగా ఉన్నా కదా అని ఆలోచనను కట్ చేసుకోక దాన్ని వదిలేయక అలాగే పట్టుకొని దొంగలు కూడా వచ్చి పడిపోయారు. ఇది ఒక్కటే
(17:18) ఎగ్జాంపుల్ మనకు ప్రతిదాన్ని చెప్పాల్సిన అవసరం ఉండదు. నీకు వచ్చే బీపి షుగర్ క్యాన్సర్ శరీరానికి వచ్చే మొత్తం రోగాలన్నీ కూడా మన కర్మ సిద్ధాంతం ప్రకారము అవి వచ్చి కూర్చున్నాయి మన బాడీల నీవు ఇతరులకు ఏదో ఒక హాని చేసేటప్పుడు నీకు ఎరుక లేదు ఒక జంతువును చంపేటప్పుడు ఆ ఎరుక లేక ఆ జ్ఞానం లేక అజ్ఞానంలా ఆ జంతువును క్రూరంగా చంపినప్పుడు తిరిగి అది నీ దగ్గరికి వస్తుంది.
(17:51) అది ధ్యానం చేస్తే మనకు ఆ ఎరుక వచ్చి మనందరం మాంసం పని చేయడము జంతువులను హింసించకుండా అయినా అంటే మనం చేసే ఆలోచనల మీద మన చేష్టల మీద మనకు ఎరక వచ్చేసింది. ఇప్పటి నుంచి ఏ తప్పులు లేవు ఎవరిని నియంసిస్తలేం బాధ పెడతలేం. ఈరోజు మాంసం పని చేయడం పిరమిడ్ మాస్టర్లు అందరూ మెడిటేషన్ చేయడమే దీన్ని పత్రిగారు మనకు చెప్పడం మాట ఆయన మాటలు మన మీద తీవ్రంగా ప్రభావం చూపించినాయి.
(18:30) మనము ఆయన చెప్పిందల్లా వింటూ ఆచరిస్తూ పోయాం. అంటే మన మైండ్ లో సబ్కాన్షియస్ మైండ్ లో ధ్యానము అనేది ఒక తిష్ట వేసుకున్నది అన్నమాట. ఒక అది ఫస్ట్ మొలకయి కొద్ది కొద్ది వృక్షం అయిపోతుంది అది. ఈ సాధనను పెంచుతూ పెంచుతూ పెంచుతూ పోతే మనకు ఎంతో ఆధ్యాత్మిక శాస్త్రం మనకు అర్థంఅవుతుంది. ఈ మనసు ఎప్పుడు ఏదో ఒక లాజిక్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది మనకు మనము ఏదైనా సృష్టి చేసుకోవాలి మన మనోశక్తి ద్వారా అనుకుంటే పడుకునేటప్పుడు గాని లేదంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే మన కొత్త జీవితాన్ని మనం అద్భుతంగా సృష్టించుకోవచ్చు.
(19:12) మనసు అనేది మైండ్ అనేది అది ఒక ఎనర్జీ ఒక శక్తి అది ఒక మాగ్నెట్ ఒక అయస్కాంతం లాంటిది మన మనసును మనము ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. మనసు అనేది ఒక కరెంట్ లాంటిదే సేమ్ ఇప్పుడు కరెంట్ చేత ఫ్యాన్ కూలర్ ఫ్రిడ్జ్ మోటార్ నడుస్తుంది ఇవన్నీ మనం ఇస్త్రీ చేసుకునేది కూడా కరెంటదే వాడుకుంటున్నాం. గ్లైండర్ కరెంటే మనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ కరెంట్ తోన రకరకాల యంత్రాలు తయారు చేసుకొని దాన్ని అట్లా యూస్ చేసుకుంటున్నాం మంచిగా యూస్
(19:58) చేసుకుంటున్నాం. చాలా రిస్క్ తగ్గిపోయింది మనకు కష్టం తగ్గింది కరెంట్ వచ్చినక బల్బు కూడా వెలుగుతుంది వెలుతురులో ఉంటున్నాం మనం కానీ అదే కరెంటును నీకు గన తెలియకుంటే ముట్టుకుంటే చచ్చిపోతాము అంటే కరెంట చంపుతుంది నీ అజ్ఞానం గన ఉంటే దాని గురించి నీకు అవగాహన లేకుంటే మనం చంపేస్తుంది. ఒకవేళ నీకు అవగాహన ఉందనుకోండి వాడుకోవడం విధానము మంచిగా వాడుకుంటే ఎన్నో పనులు మనకు చేసి పెడుతుంది కరెంట్ సేమ్ మన మనసు కూడా విద్యుత్ లాంటిదే కనపడదు అది ఆ మన ఆ బ్రెయిన్ మనకు బ్రెయిన్ అనే ఒక మెథడ్ ఉంది కదా అది ఫిజికల్ అంటే కంల కనిపిస్తది బ్రెయిన్ మనకు
(20:45) డాక్టర్లు పోస్ట్ మార్టం చేసేటప్పుడు చూస్తారు వాళ్ళు కానీ వాళ్ళకు ఆ బ్రెయిన్ మీద మైండ్ అనే మనసు అనే అనే ఒక శక్తి ఉందని డాక్టర్ల కంటి కనపడదు. వాళ్ళు ఎంతవరకు ఉన్న డాక్టర్లు మెదడు వరకే వాళ్ళకు తెలుసు దాంట్లో ఆ నర్వస్ సిస్టం ఎట్లా పనిచేస్తుంది అనే ఆ విషయాలు మాత్రమే తెలుసు గనీ ఆ బ్రెయిన్ పైన ఒక మైండ్ అనేది ఒక శక్తి అది భగవంతునికి సంబంధించిన ఒకానొక ఎనర్జీ అని డాక్టర్స్ తెలియదు భూలోకంలో స్పిరిచువల్ గా ఉన్న డాక్టర్స్ తెలుసు అయితే ఈ మనసును మనం సరిగ్గా వాడుకుంటే మంచి పనులు చేసి పెడుతుంది మనం దాన్ని చెడ్డగా వాడుకుంటే చంపేస్తుంది.
(21:31) ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరూ ఎందుకు చనిపోలేరు కొంతమంది చనిపోయింరు కొంతమంది బతికినరు మరి జబ్బు వస్తే అందరూ చనిపోలే కదా చనిపోయిన వాళ్ళందరూ ఎందుకు చనిపోయింరు అంటే భయపడడం ద్వారా చనిపోయిండు వాళ్ళు భయం లేని వాళ్ళు చనిపోలే రోగాలు వస్తాయి పోతాయి ఏ జబ్బుకు కూడా భూమండలం మీద చంపే శక్తి ఏ జబ్బుకు లేదు మనం ఒక చైతన్య పదార్థాల మనం సృష్టికర్తలము దేవునిలో మనము మనల్ని చంపేవాడు సృష్టిలో లేడు అసలు అట్టప్పుడు అంత శక్తి ఉన్న మనము ఒక దేహాన్ని తీసుకున్నప్పుడు నీ మనసు చేత భయపడి భయపడి కరోనా వస్తే నేను చచ్చిపోతా ఇంకా బతకను
(22:17) అనే ఆ భయంతో కూడుకున్న ఆలోచన పదే పదే ఆలోచించడం వలన నీకు ఆ ఎరుక లేక విశ్వా విశ్వాసం లేక నీ మీద నీకు నిజంగా చనిపోతా నేను అనే నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ ఆలోచన ఆ ఎమోషన్ నీ సబ్కాన్షస్ మైండ్లకు వచ్చి నీకు కరోనా వచ్చిందే చచ్చిపోతాం అందరూ అలాగే చనిపోయారు. అంటే చూడండి కరెంట్ లాగానే మన మనసు చంపుతుంది మనల్ని బతికిస్తుంది.
(22:52) మనసుతో జాగ్రత్త ఆలోచనల మీద ధ్యాస అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చే ఆలోచనలను గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ వదిలేస్తూ వదిలేస్తూ ఆలోచనలు ఒక సాక్షిగా చూడండి స్పీడ్ గా కట్ చేసుకుంటా ఇట్లాంటి ఆలోచన రాకూడదు మంచి ఆలోచన రావాలి నాకు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకు మనసుకు మంచి చెడు తెలియదు అది ఆలోచిస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన దాని పని అది దాని వృత్తే వ్యాపారం అది మనసు యొక్క వ్యాపారమే ఆలోచించడం అటప్పుడు దాన్ని ఎందుకు మనం నిర్బంధించి ఆలోచించకుండా ఆగిపోవాలే మనసును బంధించాలి మనసును జయించాలి ఇవి ఎప్పుడు మనం పెట్టుకోకూడదు
(23:37) ఈ దేన్ని జయించలేము మనం ఈ మనసును సాక్షిగా చూస్తూ వదిలేస్తూ వదిలేస్తూ పోతుంటే కొద్దిసేపు అయినాక ఆ మనసుకు అర్థంయపోతది వీళ్ళు నా మీద ఎరక ఉంచారు నేను ఇంకా ఆలోచించకూడదు అనే తీరుకవచ్చేసి ఆలోచనలు అన్నీ ఆగిపోయినప్పుడు శక్తి మన లోపలికి పోతుంది ఎన్నో అనుభవాలు పొందుతాం. ఈరోజు ధ్యానం కుదరకపోవడానికి కారణము ఒక చిన్న రీజన్ ఏందంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు ఎక్కువ అవుతాయి.
(24:10) ఆలోచనలు ఎక్కువయినప్పుడు భయపడి అయ్యో ధ్యానం అంటే ఆలోచనలు అసలు ఉండకూడదు కదా అని స్పీడ్ గా కట్ చేస్తూ కట్ చేస్తూ దాంట్లో మీద నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉండడం వల్ల ధ్యానం కుదరకపోవచ్చు. సాక్షిగా చూడండి ఆలోచనలు మంచి ఆలోచన చెడ్డ ఆలోచన అనేది సృష్టి లేదు. మంచి చెడే లేదు అసలు ఒక స్థాయిల వాటి గురించి ఎందుకు ఆలోచించాలి మనం అట్లా ఎప్పుడైతే మీరు మీ మనసును ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక సాక్షిగా ఆలోచనలు గమనిస్తూ వదిలేస్తూ పట్టించుకోకుండా ఉండగలిగితే కళ్ళు తెరిచినాక ఈ ప్రపంచంతో మన కుటుంబ సభ్యులతో మనం సాక్షిగా ఉండగలుగుతాం.
(24:53) ఒక భగవంతునిలాగా చూస్తాం మనం ప్రపంచాన్ని దేన్ని పట్టించుకో మనం పట్టించుకున్నా పట్టించుకోనట్లు ఉంటాం. ఒకవేళ ఆలోచనలు బలవంతంగా తీసేసుకుంటా కట్ చేసుకుంటా ఉంటే మన స్థితి కళ్ళు తెరిసినాక కూడా మనం అట్లానే ఉంటాం. కళ్ళు తెరిసినాక జాగ్రత్త కళ్ళు మూసుకున్నప్పుడు బాగానే ఉంటాం ధ్యానంలో కానీ కళ్ళు తెరిసినాక మన మనసుతో జాగ్రత్త ఉండాలి. నేను చెప్పాను మనసు చేత ఏదైనా మనం సాధించొచ్చు.
(25:23) అయితే ఒక చిన్న విషయం ఏందంటే మనం పడుకునేటప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు మనకు ఒక లాజిక్ మైండ్ ఉంటుందన్నమాట. దాని పని ఏందంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన లేని స్థితిలా నిద్రపోయేటప్పుడు గాని ఆలోచన తగ్గినప్పుడు ఈ లాజిక్ మైండ్ ఏమవుతుందంటే నిద్రిస్తది అది కూడా అది కూడా నిద్రపోతది.
(25:47) అది మట్టుగా అయిపోతుంది అన్నమాట ఈ రెండు టైంల మాత్రమే మట్టుగా ఉంటది అది మెడిటేషన్ ఆలోచన లేని స్థితిలో ఎరుకతో ఉన్నప్పుడు లేదంటే సుషుప్త అవస్థలో అప్పుడు మనసు పని చేయదు అక్కడ అప్పుడు మనము మనక ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలి నా జీవితం ఇలా ఉండాలి భౌతికంగా గాని ఆధ్యాత్మికంగా గాని అని మీకు ఏదైనా కోరికలు ఉంటే ఆలోచన లేని స్థితిలా మనం చెప్పుకున్నప్పుడు ఒక 10 సార్లు విజువలైజేషన్ చేసి చేసినప్పుడు ఆ ఏదైతే ఎప్పుడు లాజిక్ మైండ్ ఆలోచిస్తున్న మైండ్ నిద్రిస్తుంటది కాబట్టి అది నిద్రపోయినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ తలుపులు ఓపెన్
(26:32) అవుతాయి. అప్పుడు మనం ఏదైనా అనుకుంటే నీ ఆరోగ్యం గురించి గాని నీ సమస్యల గురించి అవి నేరుగా సబ్కాన్షియస్ మైండ్ లోకి పోయి అవి భౌతికంగా రూపం తీసుకుంటాయి భౌతికంగా నీకు కల్పిస్తుంది సృష్టి చేసి పెడుతుంది అన్నమాట మనకు ఈ లాజిక్ మైండ్ బందు కావాలి అది నిద్రావస్థలో ఉంటుంది. అది లేసిందే మనము లోపలికి మన ఆలోచనలు పోలేవు. అందుకే ఆలోచన రహిత స్థితి అత్యంత గొప్పది.
(27:05) మనం దేన్నైనా సాధించాలనుకుంటే ఆ స్థితిలో ఉండగలిగినప్పుడు మనం ఆ ఎరుకతో మనం సృష్టి చేసుకోవచ్చు అవి రేపో మాపో లేదంటే ఒక నెలకో 15 రోజులకో అవి రూపం తీసుకుంటాయి. మనం అంతవరకు ఏం చేయాలి పదే పదే అదే ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనము ఏదైనా మన మైండ్ లో ఏం చేసిన ఒక కొత్త విత్తనాలు వేసుకున్నాం వాటికి వాటర్ పోయాలే కదా వాటర్ పోయడం ఏందంటే ప్రతిరోజు పదే పదే అనుకోవడం అనుకున్నప్పుడు ఏమవుతుంది అవి స్థిరపడిపోతుంది అన్నమాట ఆలోచన స్థిరపడి అది యూనివర్స్ కి అందినప్పుడు అవి మెల్లగా ఆ ప్రాసెస్ జరుగుతుంటది.
(27:44) మనం ఏం చేస్తాం అంటే ఎందుకు మన ఆలోచనలు జరగకపోవడానికి సంకల్పాలు అంటే అనుకున్నవి కానీ అది చిన్నగా మూలికెత్తుతుంటే మళ్ళీ మనం డౌట్ను క్రియేట్ చేస్తాం మనం జరుగుతుందో లేదో అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ చిన్నగా మోలికెత్తుతున్న ఆ ప్రాసెస్ అంతటితో ఆగిపోతుంది అది. కొద్దిగా ఓపిక పట్టుకోవాలి మనం ఆ ఓపికతో మనం చూస్తూ గమనిస్తూ ఉంటే అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన జీవితంలోకి వచ్చేస్తాయి.
(28:16) మనసు అనేది మనం మంచిగా వాడుకున్నా మంచి చేసి పెడుతుంది చెడుగా వాడుకున్న చెడు చేసి పెడుతుంది అంటే మన మనసు ఇన్నర్ చైల్డ్ అంటే ఒక చిన్న పసిపాప లాంటిది. దానికి బుద్ధి పెరిగితే జీవితం మారిపోతుంది ఇప్పుడు బుద్ధి గురించి మనం మాట్లాడుకుందాం. బుద్ధి ఎలా వస్తుంది మనకంటే ఎన్నో జన్మ పరంపరల నుంచి బుద్ధి వికసిస్తుంది మనకు బుద్ధి అనేది ఒక జన్మది కాదు ఎన్నో జన్మల నుంచి మనం చేసిన ఆ కర్మ సిద్ధాంతాల ప్రకారము మనం చేసిన ఆ కర్మలను బట్టి మన బుద్ధి వికసిస్తుంది.
(28:59) ఇప్పుడు మనసు అంటే మనస్థితిలో ఉన్నవాళ్ళు ఆ రజోగుణంలో ఉంటారు. బుద్ధి స్థాయిలో వచ్చినప్పుడు మన లోపల ఒక సత్వగుణం వస్తుంది. అంటే సాత్వికత ఎవ్వరిని బాధ పెట్టకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే భావన మన బుద్ధిలో ఉంటుంది. మనసు స్థితి ఏంది నీ ఇష్టం వచ్చినట్టు చెయి అని చెప్తూ ఉంటది మనసు మనకు కానీ బుద్ధి ఏం చెప్తుంది నివారిస్తుంది అలా చేయొద్దు బాగుండదు.
(29:29) నీకు ఇబ్బంది కలుగుతుంది ఫ్యూచర్ లో అనే స్థితికి వస్తుంది. ఈ బుద్ధి పెరగాలంటే కొన్ని జన్మలు పడుతుంది మనకు అంటే ఆ తమో గుణాన్ని రజో గుణాన్ని దాటి సత్వగుణంలోకి వచ్చినాక మనకు బుద్ధి వస్తుంది బుద్ధి పెరిగినప్పుడు మెల్లగా ఆత్మ స్థితులకు వస్తాం. ఇప్పుడు విభీషణుడు ఉండడు అతనికి బుద్ధి బాగా పెరిగింది. బుద్ధి వికసించింది వికసించి ధర్మము న్యాయము నీతి నిజాయితి అంటున్నాడు అన్నమాట ఎప్పుడైతే మనకు బుద్ధి పెరిగి సాత్విక గుణం వచ్చిందే మోక్షం వచ్చినట్లే ఎగ్జాంపుల్ విభీషణునికి బుద్ధి పెరిగింది.
(30:11) బుద్ధి వికసించింది. ఎక్కడికి వెళ్ళాడు ఆయన రాము దగ్గరికి పోయిండు. ఎందుకు రావణాసురుడు పోతలేడు కుంభకర్ణుడు ఎందుకు పోతలేడు రాముని దగ్గరికి అంటే వాళ్ళకు బుద్ధి లేదు ఈ విభీషణ బుద్ధి పెరగడం వల్ల చక్కగా రాముని దగ్గరికి పోయిండు అంటే ఒక నిర్గుణ తత్వంలోకి వెళ్ళిపోయిండు మనం కూడా ఎప్పుడైతే సత్వగుణం వచ్చిందో మెల్లగా నిర్గుణంలోకి వెళ్తాం పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఎక్కడికి వెళ్ళారు పత్రిగారి దగ్గరికి వెళ్ళాం మనం ఎందుకు మనం ఆల్రెడీ సత్వగుణం ఉంది మన లోపల కాబట్టి ఆ నిరు నిర్గుణం ఉన్న పత్రి సార్ దగ్గరికి మనం కలవడం జరిగింది. దీన్ని
(30:50) బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే సత్వగుణం వచ్చిందే నెక్స్ట్ మనం నిర్గుణత్వంలో పోతాము మోక్ష స్థితి సత్వగుణం అని మనం తెలుసుకోవాలి. అందుకే బ్రహ్మం గారు గుణము కుదిరనేని గణయోగి తానవును నీ గుణం కుదురాలి ఫస్ట్ ఆ రజోగుణము పోవాలి ఆ తమో గుణం పోవాలి. ఆ సత్వగుణముల పోయి ఆ నిర్గుణముల పోయి పడ్డమా అత్యద్భుతమైన స్థితి అది అంటే నిర్గుణముల ఏ గుణాలు ఉండవా అంటే ఆ నిర్గుణ తత్వం అంటే ఆత్మతత్వము చివరిది ఈ ఆత్మతత్వంలో ఉన్నప్పుడు 20 శాత తమోగుణం ఉంటుంది 20 శాత రజోగుణం ఉంటుంది.
(31:34) 20 శాత సత్వగుణము 25 శాత నిర్గుణత్వం ఉంటుంది. రామునికి 20 శాత తమోగుణం ఉంది. తింటాడు పాడుకుంటాడు శరీరం ఉంది కాబట్టి మనసు కూడా ఉంది కాబట్టి ఆ రజోగుణం ఉంటుంది కొంత కోపం వస్తుంది వచ్చినప్పుడు రాక్షసులను సంపాల్సి వస్తుంది. బుద్ధి ఉంది ఆయనకు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు నీతి ధర్మం ఉంది ఆయన దగ్గర మళ్ళీ నిర్గుణంలో కూడా పోగలుగుతాడు అంటే ఏమి చేయకుండా ఉండగలుగుతాడు.
(32:07) రాముడు కృష్ణుడు గాని బుద్ధుడు గాని ఏం చేయకుండా ఉండడం అన్ని గుణాలు ఉంటాయి కానీ పట్టించుకోం ఈ దేహం ఉన్న రోజులు భౌతికంగా ఉన్న రోజులు మనము ఈ తమోగుణము రజోగుణము సత్వగుణం అనేటివి కొంత కొంత ఉంటాయి అవి అవి ఉండాలి కూడా ఎందుకంటే వాటితో మనకు చాలా అవసరం ఉంది ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి కొంత తమోగుణం ఉంటే కొద్దిసేపు పండుకుంటాం తింటాం ఆ రజోగుణం ఉండడం వల్ల ఎవరైనా పిచ్చి పిచ్చి అష్టాలు చేస్తే అప్పుడప్పుడు తిట్టాల్సి వస్తది.
(32:43) సత్వగుణం కొన్ని కొన్ని పరిస్థితుల్లో [గొంతు సవరించుకోవడం] రజోగుణం ఎంత ప్రమాదమో సత్వగుణం కూడా అంత ప్రమాదమే ఎందుకంటే నీ ముందర అధర్మం జరుగుతున్నప్పుడు నీవు సాత్వికునిగా మెతుకతనంగా అయ్యో ఎవరిని ఏమ అనకూడదు ఎవరిని ఏమన్నా అంటే పాపం తగులుతుందేమో అనే భావన సత్వగుణం కూడా ప్రమాదకరము. నీ ముందర ఏమైనా జరుగుతుంది అంటే నీవు అధర్మాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి మనం ఈరోజు సత్యదర్శనం అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం అందరికీ నా యొక్క నమస్కారం థాంక్యూ నమస్తే [సంగీతం][బెల్]

No comments:

Post a Comment