*ॐ హనుమజ్జయంతి ప్రత్యేకం*
*(ఈ నెల 12వ తేదీ హనుమజ్జయంతి)*
*భాగం : 1/11*
*హనుమంతుని తండ్రి పేరు కేసరి.*
*అంజన ఆ కేసరి యొక్క భార్య.*
*అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు.*
*హనుమంతుడు, అంజనాదేవి గర్భాన - వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు.*
*అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు.*
*I.హనుమ - వాయు పుత్రుడు - ప్రత్యేకత*
*రావణ వధకై, బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి,*
*విష్ణువు - దశరథుని తండ్రిగా చేసికోవడానికి ఇష్టపడ్డాడు.*
*అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో*
*"అవతరించే విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులూ కామరూపులూ అయి, మీ మీ శక్తులు కలిగియుండేలాగు పుత్రులను సృజింపుడు" అన్నాడు.*
*"ఎలుగుబంటులలో శ్రేష్థుడైన జాంబవంతుని తాను చాల క్రితమే సృజించాను" అని కూడా అన్నాడు.*
*అప్పుడు*
*1.ఇంద్రుని వల్ల - వాలి,*
*2.సూర్యుని వలన - సుగ్రీవుడు,*
*3.బృహస్పతి వల్ల - తారుడు,*
*4.కుబేరుని వలన - గంధమాదనుడు,*
*5.విశ్వకర్మ వలన - నలుడు,*
*6.అగ్ని వలన - నీలుడు,*
*7.అశ్వినీ దేవతల వల్ల - మైంద ద్వివిదులు,*
*8.వరుణుని వలన - సుషేణుడు,*
*9.పర్జన్యుడని వలన - శరభుడు,*
*10.వాయువు వల్ల - హనుమ జన్మించారు.*
*పరాక్రమాలు గల అనేకమంది - గోలాంగూల (కొండముచ్ఫు) స్త్రీలయందూ, ఋక్ష స్త్రీల యందూ, కిన్నర స్త్రీలయందూ జన్మించారు.*
*ప్రధానంగా పైన పేర్కొన్న పదకొండు మందీ, పదకొండు విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులు కలిగి, ఆయావిభాగాలలో నిష్ణాతులు.*
*ఒక సమగ్ర పథకము (Project) చేపట్టేటపుడు కావలసిన 11 ముఖ్య విభాగాలైన*
*ప్రణాళిక(Planning),*
*వ్యవస్థీకృత కార్మిక రంగం(Organised working sector),*
*కుశాగ్రబుద్ధి కలిగిన పరిపాలన(Correct decisive administration),*
*మేధస్సు(Intellect),*
*ఆర్థికం(Finance),*
*నిర్మాణం(Archetech),*
*చైతన్యం(Activeness),*
*ఆరోగ్యం(Health),*
*నీరు(Water),*
*దాపరికం(Secrecy),*
*సర్వజ్ఞత(All round) అనేవి ప్రధాన విషయాలు.*
*అటువంటి వాటికి సంబంధించి వారు "రావణ వధ" అనే ప్రత్యేక ప్రణాళిక(Operation)కి గాను వచ్చిన కారణజన్ములు.*
*అందులో వాయుపుత్రుడు ఒక ప్రత్యేకమైన వాడు.*
*వాయువు సర్వత్ర వ్యాప్తిచెంది, అందరికీ ప్రాణమైనది.*
*అదే విధంగా వాయుదేవుని వలన జన్మించిన హనుమ, అందఱితోనూ అన్ని పనులలోనూ (all round) నేర్పుతో పని చక్కబెట్టగల్గినవాడు.*
*అంతేకాక, వాయువు*
*(అ) సప్త మండలాలలో సప్త వాతస్కంధాలుగా కనబడుతుంది.*
*(EXTERNAL - AT THE SPACE)*
*అవి*
*(i) మేఘమండలం - ఆవహము,*
*(ii) సూర్యమండలం - ప్రవహము,*
*(iii) చంద్రమండలం - సంవహము,*
*(iv) నక్షత్రమండలం - ఉద్వహము,*
*(v) గ్రహమండలం - వివహము,*
*(vi) సప్తర్షిమండలం - పరివహము,*
*(vii) ధ్రువమండలం - పరావహము*
*- అని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అధిష్ఠానదేవతగా ఉంటుంది.*
*అందుకనే వాయుపుత్రుడైన హనుమ అంతరిక్ష సంచారాన్ని అలవోకగా చేస్తాడు.*
*ఆకాశమార్గంలో సముద్ర లంఘనం, సంజీవని పర్వతం పెకలించి తీసుకురావడం, తిరిగి యథాస్థానంలో ఉంచడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.*
*(ఆ) శరీరంలో*
*(INTERNAL - WITH IN THE BODY)*
*అవి*
*హృదిలో - ప్రాణ,*
*గుదిలో - అపాన,*
*నాభి వద్ద - సమాన,*
*కంఠంవద్ద - ఉదాన,*
*సర్వశరీరమందు - వ్యాన*
*- అనే ఐదు వాయువులు అంతర్గతంగా అందరికీ జీవాధారంగా పనిచేస్తాయి.*
*వాయునందనుడు ఈ ఐదు వాయువులతోనూ శారీరకంగా అద్భుతాలు చేసినవాడు కదా!*
*ఈ విధమైన కార్యాలవలనే, విభీషణునితో జాంబవంతుడు*
*"హనుమ జీవించియున్నచో వానరసైన్యము హతమైననూ బ్రతికియున్నట్లే!*
*మారుతి ప్రాణాలు విడిస్తే, మనమందరమూ బ్రతికియున్ననూ మరణించినవారితో సమానమే!"*
*- అని వాయుపుత్రుడైన హనుమ గూర్చి అనగలిగాడు.*
*వాయువు:*
*"గంధనం హింసనం యో వాతి చరాచరం జగద్ధరతి బలినాం బలిష్ఠః స వాయుః" - అని వాయు పదానికి నిర్వచనం. అంటే,*
*- చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపచేయువాడునూ, బలవంతులకంటే బలవంతుడునూ అవడం వల్ల దానికి "వాయువు" అని పేరు అని అర్థం.*
*వాయుపుత్రుడుగా హనుమ శ్రీరామునికి ప్రీతిపాత్రుడై, మనందరికీ ఇష్టమైన "ఇహలోక రక్షకుడు".*
*జై శ్రీరామ్ జై జై శ్రీరామ్*
*జై హనుమాన్ జై జై హనుమాన్*
*కొనసాగింపు ....*
*=x=x=x=*
*— రామాయణం శర్మ*
*భద్రాచలం*
*(86399 68383)*
No comments:
Post a Comment