Friday, May 29, 2026

భార్యభర్తల బంధానికి విలువ లేదా? || @sridevi_vlogs515

భార్యభర్తల బంధానికి విలువ లేదా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Grymz0xUiAo



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం కొందరి అమ్మాయిలకి సంసారం అంటే బోరు కొడుతుందండి ఇప్పటి అమ్మాయిలకి గాని ఆడవాళ్ళకి గాని అది ఎందుకు అన్నదే నా ప్రశ్న మాట ఇప్పుడు పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేస్తున్నారో మీ అందరికీ తెలుసు కదా లక్షలు కాదండి వేలు లక్షల దగ్గర నుంచి పెళ్లిళ్ల వ్యవహారం కోట్ల వరకు వెళ్ళింది.
(00:25) కోట్ల ఖర్చు పెట్టి పెళ్లిలు చేసుకుంటున్నారు చాలా గ్రాండ్ లుక్ ఇస్తున్నారు. అలాగే వేలకు వేల మందిని పిలుస్తున్నారు. అందులో రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు. ఎక్కడెక్కడో మనకి తెలియని ఆచార వ్యవహారాలు కూడా అక్కడ చూపిస్తున్నారు. మరి అయినా సరే పెళ్లి ఎందుకు ఫెయిల్ అవుతుంది? అమ్మాయిలకి ఎందులో తృప్తి ఉంటుంది అసలు పెళ్లయిన కొన్ని నెలలకే సంసారం అంటే ఎందుకు బోరుకొడుతుంది? అసలు భర్త మీద ప్రేమ ఎందుకు ఉండట్లేదు అన్నదే ఈరోజు నా వీడియో మాట అసలు అమ్మాయిలకి భార్య భర్తల బంధం అంటే ఏమిటో తెలుసా ఓన్లీ అమ్మాయిలే కాదండి పెద్ద వయసు ఉన్న ఆడవాళ్ళు కూడా ఇదే
(01:10) బాటలో వెళ్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన కల్చర్ పాడైపోతుంది. భార్యా భర్తల బంధం అంటే విలువ లేదు బాధ్యతలు పట్టుకోరు అలాగే పెళ్లిల మీద ఇంట్రెస్ట్ లేదు చేసుకున్న కలిసి బ్రతికే ఓర్పు లేదు అర్థం చేసుకునే తత్వం లేదు పిల్లల్ని కనడం అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళని పెంచడం ఇంకా పరమ వేస్ట్ అనుకుంటున్నారు సోలో బతికే సో బెటర్ గురు అన్న సాంగ్ ఒకటి మనకి గుర్తొస్తుందన్నమాట కేవలం ఈ జనరేషన్ వాళ్లే అలా ఉన్నారా అంటే వీళ్ళని చూసి మంచిగా కాపురం చేసుకుంటున్న వాళ్ళు కూడా పాడైపోతున్నారు.
(01:49) దీనంతటికీ కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం అవ్వటమే అని చెప్పొచ్చు అండి. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదో మన పద్ధతులు మారినియో ఆ రోజే భారతదేశం నాశనం అయిందని గట్టిగా చెప్పొచ్చు. భారతదేశం అంటే అందులో ప్రతి ఒక్క మనిషి భాగం ప్రతి కుటుంబం కూడా భాగస్తుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకోకపోవటం విలువలు ఇవ్వకపోవటం విడిగా బ్రతకడం ఒంటరి లైఫ్లకి అలవాటు పడటమే పెద్ద తప్పుగా మనం చూడొచ్చు అంటే దీనివలనే అధిక స్వేచ్ఛ ఎక్కువైపోయి కలిసి బ్రతకడానికి కూడా ఇష్టపడట్లేదు అన్నమాట ఈరోజు
(02:33) యువత మరి పద్ధతిగా పెళ్లిలు చేసుకొని కాపురాలు చేస్తున్న ఆడవాళ్ళకి ఏమైంది వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా తయారవుతున్నారు పాత పాత రోజుల్లో భార్యా భర్తలు ఎలా ఉండేవారండి తినటానికి తిండి లేకపోయినా గెంజి తాగుతున్న ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేవారు ప్రేమలు గాని విలువలు గాని గౌరవాలు గాని ఎక్కడా ఇంత కూడా తగ్గేవి కాదు కష్టాలు శాసిస్తున్న కనీసం సదుపాయాలు లేకపోయినా పిల్లలకి కనీసం ఒంటి మీద బట్ట కొనలేకపోయినా వారి పరిస్థితి కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారని వాళ్ళకి తెలిసినా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయేవారు వాళ్ళ ధైర్యమే వాళ్ళ ఆయుధం అన్నమాట మరి దీని
(03:18) వల్ల ఉపయోగం ఏమిటి అంటే చిరకాలం గౌరవ మర్యాదలతో ధీమాగా బతికేవారన్నమాట మరి ఈ గౌరవ మర్యాదలు దీమా దేనికి శ్రీదేవి గారు అని మీరు అడిగితే జీవితంలో ఎటువంటి సమస్య రాకుండా అడ్డగోల వ్యవహారాల్లో మనం బుక్ అవ్వకుండా నలుగురిలో మంచి తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే ఇటువంటి జీవితం గౌరవప్రదమైన జీవితం అని మనం చెప్పవచ్చు అందరూ కాలం మారిపోయింది కాలం మారిపోయింది మనం ముందుకు వెళ్ళిపోయాం ఇంకా ఏమిటి మీ పాత ఆచారాలు పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అందరూ ముందుకు వెళ్తుంటే మీరు వెనక్కి ఎందుకు వెళ్తున్నారు శ్రీదేవి గారు అని చెప్పి కామెంట్స్ లో కూడా నన్ను అడుగుతున్నారు.
(04:01) పాతది అంటే రోత కాదండి పాతది అన్నప్పుడే మన పునాదులు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఇది ఎందులో అన్నా మీరు పోల్చి చూసుకోండి మరి ఒకప్పుడు ఆడపిల్లల్ని ఎలా పెంచేవారు అది కూడా పాతకాలంలో మొన్నటివరకు మా వరకు మరి ఇప్పుడు ఎలా పెంచుతున్నారు ఆడపిల్లని అతిగారాభం చేస్తున్నారు సున్నితంగా పెంచుతున్నారు.
(04:29) ఇంకా అధిక స్వేచ్ఛలు ఇస్తున్నారు. మరి ఈ రోజుల్లో చదువులు కదండీ మరి స్వేచ్ఛ ఇవ్వకపోతే అమ్మాయి ఎలా చదువుకుంటది ఎలాగ ఉద్యోగాలు చేస్తది అని మెళ్లి మీరు అడగొచ్చు. అందరూ ఉద్యోగాలు చేస్తారు అందరూ చదువుకుంటున్నారు కానీ అందరూ ఇలా ఉండరు కదా ఇది కూడా నేను మిమ్మల్ని అడగొచ్చు ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఏంటి వీడియోస్ కి అని మీరు అన్నా సరే నేను వివరం చెప్పాలి కదా అవసరమైతే నా వీడియోస్ చూడాలి అనుకుంటే చూస్తున్న వాళ్ళు స్పీడ్ పెట్టుకొని చూడండి దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు సంస్కారం నేర్పకపోవడం చాలా పెద్ద తప్పుమాట ఎంతసేపు మన పనులు మన బిజీల లైఫ్ మన డబ్బు
(05:09) వెనకాతలో పరిగెత్తడం ఒకటే లైఫ్ కాదని నేను నా ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇక్కడ మనం ప్రతి బంధువర్గాన్ని కలుపుకొని ఉండాలి మరి బంధువులే ఈ మధ్యన శత్రువులుగా తయారయ్యారు కదా శ్రీదేవి గారు అని మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు. అవన్నీ ఉన్నా కూడా మనం ఎవ్వరిని వదలు పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ప్రతి కుటుంబంలో మార్పు వస్తదని నా ఆశ మాట అందుకనే నేను గట్టిగా చెప్తాను మీరు అంటారు ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఏంటి పాత పద్ధతులు ఏంటి ఈ బంధువులను కలుపుకోవడం ఏంటి ఈ బోడు వ్యవహారాలు ఏంటి అని చెప్పి నన్ను మీరు సింపుల్ గా తీసేయొచ్చు కానీ పిల్లలకి
(05:49) ఉమ్మడ కుటుంబాలు గాని మన పాత పద్ధతులు గాని మనం దగ్గర ఉండి కూర్చొని మాట్లాడే విధానం గాన మంచి చెట్టలు చెప్పుకోవడం గాన ఆచార వ్యవహారాలు గాని ఇవన్నీ అర్థమైనట్టు చెప్తేనే మనందరి లైఫ్ లో ఏం జరిగింది అని లోతుగా వెనకటి రోజులకి వెళ్తేనే వాళ్ళకి కూడా జీవితం మీద మక్కువ ఏర్పడుతుంది. వాళ్ళకి కూడా జీవితం అంటే అర్థంఅవుతుంది.
(06:16) జీవితం అనే ప్రశ్నని ఒక సవాలుగా తీసుకుంటారు అన్నమాట. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్ లో తెలపండి. ఇప్పటి ఆడవాళ్ళు గాని ఆడపిల్లలు గాని సంసారం అంటే చిరాకు పడుతున్నారు. కాపురం అంటే విసుగు పోతున్నారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇందాక మనం మాట్లాడుకునేటట్టు అతి సున్నితంగా పెంచడమే దీనంతటికీ కారణం అతి స్వేచ్ఛలు ఇవ్వడమే దీనంతటికీ కారణం అన్నమాట మరి ఎలా పెంచాలి అన్నది నేను ఆల్రెడీ చెప్పాను అంత అట్టహాసంగా పెళ్లి చేసుకొని కొన్ని నెలలకి సంవత్సరానికే విడిపోవడానికి కారణాలు చాలానే ఉంటున్నాయి.
(06:52) ఇద్దరు మనుషులు కలిసి బ్రతకాలి అంటే భార్య భర్తలు అయ్యే ఉండాలా విడిగా ఉండకూడదా అని మీరు ప్రశ్న వేయొచ్చు అటువంటి లైఫ్ కి ఏం జరుగుతుంది ఎలా మోసపోతున్నారు చిరకాల బంధం భార్యాభర్తలు నూరేళ్ల వివాహ బంధం ఎలా ఉంటుంది మీ తల్లిదండ్రులు కూడా మీకు చెప్పవచ్చు భార్యా భర్తలు సంతోషంగా ఉండాలన్నా కలిసి ఉండాలన్నా కేవలం ఒక డబ్బు ఉంటే సరిపోతుందా లగ్జరీ లైఫ్ ఉంటే సరిపోతుందా అన్ని వసతులు ఉంటే సరిపోతుంది తాయా మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం లోట అండి తినటానికి తిండి లోట బట్ట లోట డబ్బు లోట లగ్జరీ లైఫ్ లోట మరి మీరు చెప్పండి ఇదివరకు లాగా ఆడవాళ్ళు సంసారం అంటే
(07:36) కొత్తగా పెళ్లి అయిన తర్వాత బోలడని ఇబ్బందులు ఉండేవి సిగ్గు ఉండేది మగుమాటాలు ఉండేవి గొడ్డు చాకిర్లు ఉండేవి అప్పటి అప్పటి రోజుల్లో ఇప్పటిలాగే మిషన్లు లేవు బట్టల్ మిషన్ గ్రైండర్లు మిక్సీలు ఏమీ లేవు గ్యాస్ పో పొయ్యలు తట్టెల పొయ్యి మీద వంటలు చేసి పెట్టేవారు అది కూడా ఉమ్మడి కుటుంబాలకి ఇంటికివచ్చి పోయేవాళ్ళు రోజు వస్తూనే ఉండేవారు తిరణలాగా మరి ఇప్పుడు అన్ని వసతలు వచ్చేసినయి మనకి కటికి నేల మీదే పడుకునేవారు మరి ఇప్పుడు మరి మంచం లేనిదే పడుకోం మనం నడిచి వెళ్ళేవారు కాళ్ళ నడకన ఎక్కడికైనా సరే గొడ్డు చాకిరలు చేసేవారు అన్నమాట
(08:14) ఇప్పుడు అవేమి లేవు కదా ఇలా చిటికేస్తే మీకు పార్సెల్స్ వస్తున్నాయి చిటికేస్తే మీకు వంట అయిపోతుంది వంగు ఉంటే పొంగు వస్తుంది ఇలా పొయ్యి మీద అన్నం పెడుతుంటే అలాగే ప్రతిది మిషన్ల మీదే వ్యవహారం నడుస్తుంది. మరి మీకు ఎందులో సుఖం లేదు ఎందులో తృప్తి లేదు మరి కాపురం అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు సంసారం అంటే ఎందుకు చేదుగా చూస్తున్నారు కేవలం డబ్బు ఒకటి ఉంటేనే సరిపోదండి లగ్జరీ లైఫ్ ఒకటి ఉంటేనే సరిపోదని మనకి వీళ్ళందరినీ చూస్తే అర్థమవుతుంది.
(08:47) మరి ఇక్కడ ఏం కావాలి ఇద్దరు భార్యా భర్తలు కలిసి ఉండడానికి అంటే ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉండాలి అలాగే గౌరవం ఉండాలి విలువలను ఇవ్వాలి ఒకరినొకరు అర్థం చేసుకొని బతకాలి కష్టాల్ని సరిసమానంగా పంచుకోవాలి అప్పుడే ఆ లైఫ్ ముందుకు వెళ్తుంది. మరి మీరు చేసే పొరపాట్లు ఏమిటి అంటే ఫస్ట్ నమ్మకం కోల్పోతున్నారు. భార్య గాని భర్త గాని ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలు పెళ్లికి ముందున్న స్నేహాలు పెళ్లి అయిన తర్వాత అలాగే కంటిన్యూ అవుతున్నాయి అది స్నేహం వరకే పరిమితమా లేకపోతే రిలేషన్ ఏమైనా ఉంటుందా అన్నది చాలా డౌట్ అన్నమాట మీ భర్తకి అలాగే భార్యకి కూడా ఫోన్లు పట్టుకొని గంటలు
(09:32) గంటలు మాట్లాడుతూ ఉంటారు భర్తకి ఏ విషయం చెప్పరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే భార్యకి ఇంత చిన్న విషయం కూడా చెప్పకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తిరగటం అర్ధరాత్రి వరకు తిరగటం ఇటువంటివి కూడా ఉంటాయి ఫ్రెండ్ సర్కిల్ కే ఎక్కువ టైం పెడుతున్నారన్నమాట భార్యకి ఎవ్వరు టైం ఇవ్వట్లేదని భార్య బాధ భార్యది అలాగే భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు ఫ్రెండ్సే ముఖ్యం అని అనడం ఇక్కడ ఎన్నో పొరపాట్లు దొర్లిన కూడా నేను చెప్పిన నాలుగు పాయింట్స్ మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది.
(10:09) ప్రేమ ఉంటేనే సంసారం కడ వరకు నడుస్తుంది. అంటే ప్రేమ లేకుండా పెళ్లి చేసుకోవడం మెళళ ఒక పుస్తల తాడు కట్టుకోవడం పెళ్లి అయిపోయింది అనటం అలాగే మగవాళ్ళు కూడా అలాగే నాకు ఒక పెల్లం వచ్చింది అని భ్రమలో బ్రతకకూడదు. ఎక్కువ బాండింగ్ ఎక్కడ ఏర్పడేది అంటే ప్రేమ. ప్రేమ అన్నది ఏ బంధం లేకపోయినా తాలి బంధం లేకపోయినా కూడా కడ వరకు తీసుకెళ్తదని నా ఉద్దేశం అన్నమాట ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని విచ్చలివి విడితనాన్ని వదిలితే సంసారాలు సగం చక్కబడినట్టేనండి ఇక చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటికంతట అవే సర్దుబాటు అయిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళు
(10:53) ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా బద్దకిస్తున్నారు. టీవీ సీరియల్స్ ఫోన్లు చూసుకొని కూర్చోవడం షాపింగ్ మాల్స్ లేతే ఆన్లైన్ యాప్స్ షాపింగ్ ఇవన్నీ కలిపి టైం వేస్ట్ చేయడం వంట వారిపొని కూడా పట్టించుకోవట్లేదు. చిన్న గొడవ కూడా పెద్దది అవుతది కదండీ మరి అందుకనే ఆడపిల్లలకే అసలు సంసారం మీద ఇంట్రెస్టే లేదున్నమాట. పెళ్లి అంటేనే ఇంట్రెస్ట్ లేదు ఏదో చేసుకోవడం తర్వాత కొన్ని రోజులకే ఆ బంధం తెగిపోవటం ఇంకా స్వేచ్ఛను కోరుకుంటున్నారు అధిక స్వేచ్ఛ ఈరోజు ఆడవాళ్ళకి బంది అయి కాపురం చేయడం గాన బందీగా బతకడం గాన స్వేచ్ఛను కోల్పోవడం గాన అసలు ఇష్టం లేదన్నమాట మరి దీని మీద మీ అభిప్రాయాన్ని
(11:37) చెప్పండి మంచి సంసారం గాని మంచి సంతానం గాన మంచి జీవితం గాన మన చేతుల్లోనే ఉంటుందని మర్చి మర్చిపోకండి ఎవ్వరూ దాంపత్యాన్ని అవహేలన చేయకండి అలాగే భార్యా భర్తల మీద ఒకరినొకరు నమ్మకాల్ని కోల్పోకండి. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ ముందుక వెళ్తుందని నేను దీమాగా చెప్పగలనున్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
(12:06) ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment