Sunday, May 31, 2026

డిజిటల్ మేనక: | విశ్వామిత్రుడు నేర్పిన ఫోకస్ | SEETAKANTH TALKIE | #motivation #focus #seetakanth

డిజిటల్ మేనక: | విశ్వామిత్రుడు నేర్పిన ఫోకస్ | SEETAKANTH TALKIE | #motivation #focus #seetakanth

Author Name:SEETAKANTH TALKIE

Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PraUCJwfMa4



Transcript:
(00:00) రాత్రిరెండు గంటలు హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉన్న ఒక చీకటి గది టేబుల్ మీద ఉన్న లాప్టాప్ స్క్రీన్ మీద ఫైనల్ నోటీస్ అకౌంట్ సస్పెండెడ్ అన్న బ్యాంక్ మెసేజ్ టేబుల్ కింద ఒక ఓపెన్ చేసిన పెట్రోల్ క్యాన్ కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు ఒక 24 ఏళ్ల కుర్రాడు. చేతిలో ఉన్న ఫోన్ లో Instagram ఓపెన్ చేసిఉంది.
(00:19) అతని కళ్ళల్లో నీళ్ళు మొహంలో రెండేళ్ళ అలసట. అతని పేరు అర్జున్ ఐఐట హైదరాబాద్ గోల్డ్ మెడలిస్ట్ 24 నెలల క్రితం 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ జాబ్ ఆఫర్ ని జస్ట్ లైక్ దట్ రిజెక్ట్ చేశడు. ఎందుకో తెలుసా? నేను ఒక బిలియన్ డాలర్ స్టార్టప్ బిల్డ్ చేస్తాను 26 ఏళ్లకే నేను నెక్స్ట్ ఎలాన్ మస్క్ ని అవుతాను అన్న డ్రీమ్ తో తల్లిదండ్రులు ప్రౌడ్ గా ఆశీర్వదించారు ఫ్రెండ్స్ రెస్పెక్ట్ చేశారు కానీ ఇవాళ్ళ రెండేళ్ళ తర్వాత అర్జున్ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ తల్లిదండ్రులు అప్పులు పాలయ్యారు క్లాస్మేట్స్ అందరూ పెద్ద పెద్ద కంపెనీలో సెటిల్ అయ్యారు.
(00:47) కానీ అతని స్టార్టప్ మాత్రం 1% కూడా ముందుకు కదలలేదు. ఆ గదిలో ఆ పెట్రోల్ క్యాన్ తో అర్జున్ చేయిం చేయబోతున్నాడు. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ రెండేళ్లల్లో అతన్ని అతని డ్రీమ్ అచీవ్ చేయకుండా ఆపింది ఎవరు ఫ్యామిలీ ప్రెజరా లేదు వాళ్ళు సపోర్ట్ చేశారు ఆర్థిక సమస్యలా కాదు టాలెంట్ లేదా అంటే ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ మరి ఏం జరిగింది అతన్ని కూర్చోబెట్టి రెండేళ్ల పాటు అతని కాలాన్ని మొత్తాన్ని చంపేసిన విషయం ఏంటి ఆ విషయం ఇప్పుడు మీ చేతుల్లో కూడా ఉంది.
(01:16) దాని పేరు స్మార్ట్ ఫోన్ బహుశా ఈ వీడియో కూడా మీరు దాన్ని పట్టుకొనే చూస్తూ ఉండొచ్చు. కానీ ఒక క్షణం ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్పాలి మన ఫోన్ మన శత్రువు కాదు అది ఒక అద్భుతమైన టూల్ మన ఫోన్ మీద మనకి కంట్రోల్ లో లేకపోవడం ఉందే అదే అసలైన శత్రువు ఇంగ్లీష్ లో ఒక గొప్ప లైన్ ఉంది ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ప్రోగ్రెస్ ఈస్ నాట్ ఫెల్యూర్ ఇట్స్ డిస్ట్రాక్షన్ అంటే మన ప్రోగ్రెస్ కి అసలైన శత్రువు ఫెయిల్యూర్ కాదు డిస్ట్రాక్షన్ అంటే మనసు ఒక పని మీద నిలబడకపోవటం సో మనం చెప్పుకోబోయే విషయం ఫోకస్ గురించి కాన్సంట్రేషన్ గురించి ఏకాగ్రత గురించి మనసుని ఒకే విషయంపై
(01:49) కేంద్రీకరించడం గురించి మన పురాణంలో విశ్వామిత్రుడి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇంద్రుడు విశ్వామిత్రుడి తపస్సుని చెడగొట్టడానికి మేనకని పంపించాడు. ఇవాళ మన ఫోకస్ ని ఛాలెంజ్ చేయడానికి ఈ డిజిటల్ మేనక మన చేతిలో ఉంది. ఇప్పుడు విశ్వామిత్రుడి కథ ఏంటో ఇక్కడ గదిలో పెట్రోల్ క్యాన్ పక్కన పెట్టుకొని కూర్చున్న అర్జున్ చివరికి ఏమయ్యాడో ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
(02:07) అర్జున్ లాంటి కథ సినిమాలోనే ఉంటుందా అంటే అస్సలు కాదు ఇది మన కథ. ఒక సీన్ ఊహించుకోండి ఉదయం 9 గంటలు మీరు చాలా మోటివేటెడ్ గా టేబుల్ ముందు కూర్చున్నారు ఈరోజు ఎటు కదలను అని డిసైడ్ అయ్యారు ఫోన్ ని పక్కన పెట్టారు మొదటి అరగంట అద్భుతంగా గడుస్తుంది మీ బ్రెయిన్ ఒక మోడర్న్ తపస్సులోకి ఎంటర్ అవుతుంది. సరిగ్గా అదే టైంలో ఫోన్ స్క్రీన్ లైట్ ఆన్ అవుతుంది టింగ్ అని సౌండ్ వస్తుందివాట్ మెసేజ్ ఆ క్షణంలో మన బ్రెయిన్ ఒక స్మూత్ అబద్ధం చెప్తుంది ఒక్కసారి చూసి వెంటనే పనిలో పడదాం అని మనం ఆ లాజిక్ ని నమ్ముతాం మన చేతికి ఫోన్ ని తీసుకుంటాం. కానీ ఆ ఒక్క సెకండ్ లో మన
(02:38) బ్రెయిన్ హ్యాక్ అయిపోతుంది రిప్లై ఇస్తాం నెక్స్ట్వాట్ స్టేటస్ లకి వెళ్తాం. వేలు దానంతట అదే నెక్స్ట్ఇస్గ మీద పడుతుంది ఒక రీలు ఇంకో రీలు మరో రీలు ఇన్ఫినిట్ స్క్రోలింగ్ అనే చీకటి కారిడార్ లోకి మెల్లగా జారిపోతాం. రెండు గంటల తర్వాత స్పృహ వస్తుంది. తల పైకెత్తి చూస్తే లాప్టాప్ స్క్రీన్ అలానే ఉంటుంది పని ఒక్క శాతం కూడా ముందుకు కదలలేదు కళ్ళల్లో మంట మైండ్లో ఫాగ్ అప్పుడు మనం చెప్పుకునే అబద్ధం కొంచెం రిలాక్స్ అయ్యాను అని అది అబద్ధం.
(03:06) మన భవిష్యత్తుని మన చేతులతో మనమే ఆ స్క్రీన్ కి అమ్ముకున్నాం. మన రెండు గంటలు జోకర్బర్గ్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. విలియం పెన్ అనే ఆయన ఒక గ్రేట్ లైన్ చెప్పాడు టైం ఇస్ వాట్ వ వాంట్ మోస్ట్ బట్ వాట్ వ యూస్ వస్ట్ అంటే మనక అన్నిటికంటే ఎక్కువ కావాల్సింది టైం కానీ మనం దాన్నే చాలా దారుణంగా వేస్ట్ చేస్తాం. ఒక బ్రూటల్ రియాలిటీ ఏంటంటే మనకు ఒక వెబ్ సిరీస్ ని మూడు గంటలు బీంజ్ వాచ్ చేయటానికి అంటే వరుసగా బ్రేక్స్ లేకుండా చూడటానికి ఓపిక ఉంది రీల్స్ ని తల ఎత్తకుండా ఐదు గంటలు చూడటానికి స్టామినా ఉంది కానీ మన ఫ్యూచర్ కి సంబంధించిన పని మీద ఒక్క గంట కూర్చోవటానికి మాత్రం ఓపిక
(03:37) లేదు ఎందుకు ఎందుకంటే మనక ఒక భయంకరమైన రోగం ఉంది అది క్యాన్సర్ కాదు డిప్రెషన్ కాదు ఆ రోగం పేరు బ్రోకెన్ అటెన్షన్ స్పాన్ ఒక షాకింగ్ ఫాక్ట్ ఏంటంటే 2000 సంవత్సరంలో మనిషి సగటు అటెన్షన్ స్పాన్ 12 సెకండ్లు ఇవాళ అది ఎనిమిది సెకండ్లు ఒక గోల్డ్ ఫిష్ అటెన్షన్ స్పాన్ 9 సెకండ్లు అంటే ఇవాళ మనం ఒక చిన్న చేప కంటే తక్కువ ఏకాగ్రత ఉన్న వ్యక్తులుగా తయారయ్యాం.
(03:59) మీకు తెలుసో లేదో సగటు మనిషి రోజుకి 96 సార్లు ఫోన్ అన్లాక్ చేస్తున్నాడంట. అందుకే మనలో చాలా మంది రోజంతా బిజీగా ఉంటున్నాం కానీ పవర్ఫుల్ గా ఉండటం లేదు. రాత్రి బెడ్ మీద నేను ఈరోజు ఏం సాధించాను అని ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఉండదు. ఇదే డెస్టినీ గ్యాప్ మన గోల్స్ ఆకాశం అంత పెద్దవి ఫోకస్ మాత్రం జీరో కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్ గా మాట్లాడుకోవాలి ఫోన్ చెడ్డది కాదు సోషల్ మీడియా చెడ్డది కాదు ఇవాళ ఫోన్ లేకుండా లైఫ్ లేదు YouTube లో టీచ్ చేసే గొప్ప గురువులు ఉన్నారు యూస్ఫుల్ కంటెంట్ ఉందిలింక్డిన్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయివాట్ లో బిజినెస్
(04:29) కనెక్షన్స్ ఉన్నాయి ఫోన్ ఒక ఇంక్రడిబుల్ పవర్ఫుల్ టూల్ ప్రాబ్లం ఏంటంటే ఆ టూల్ ని మనం యూస్ చేయాలి కానీ ఆ టూల్ మనల్ని యూస్ చేస్తుంది. జేమ్స్ రెడ్ ఫీల్డ్ చెప్పిన ఒక లైన్ ఉంది వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అంటే మన అటెన్షన్ ఎక్కడికి పోతుందో మన ఎనర్జీ అక్కడికే ఫ్లో అవుతుంది. మీ అటెన్షన్ ప్రొడక్టివ్ కంటెంట్ లో ఉంటే మీ గ్రోత్ అక్కడ ఉంటుంది.
(04:51) మీ అటెన్షన్ మైండ్ లెస్ రీల్స్ లో ఉంటే మీ ఫ్యూచర్ అక్కడ డిసప్పియర్ అవుతుంది. మరి మీ ఫోన్ మీద కంట్రోల్ ఎలా తెచ్చుకోవటం దీనికి సమాధానం విశ్వామిత్రుడి కథలో ఉంది. ఆయన పేరు కౌశికుడు ఒక మహా పరాక్రమవంతుడైన క్షత్రియ రాజు చేతిలో లక్షల సైన్యం భయంకరమైన ఈగో ఒకరోజు వేటకు వెళ్లి అలసిపోయి వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ముని దగ్గర కామదేనువు అనే అడిగింది ఇచ్చే గోవు ఉంటుంది.
(05:14) వశిష్ఠుడు ఆ గోవు ద్వారా రాజు యొక్క లక్షల సైన్యానికి క్షణాల్లో రాజభోజనం పెడతాడు. అది చూసి కౌశికుడిలో అసూయ నిద్రలేస్తుంది. రాజులైన నా దగ్గర ఈ గోవు ఉండాలి అని బలవంతంగా లాక్కోవాలని చూస్తాడు. వశిష్టుడి దగ్గర ఉన్న ఆ కామదేనువు తన శరీరం నుంచి వేల మంది దివ్య యోధులను సృష్టిస్తుంది. ఆ యోధులు కౌశికుడి లక్షల సైన్యాన్ని చిన్న భిన్నం చేస్తారు. కౌశికుడు సొంత కొడుకులు వశిష్టుడిని అటాక్ చేయబోతే ఆ ముని కేవలం ఒక మంత్రం ఉచ్చరిస్తాడు ఆ ఒక్క శబ్దంతో వాళ్ళంతా బూడిద అయిపోతారు.
(05:44) కౌశికుడు ఒంటరిగా తల వంచుకొని ఓడిపోయి నిల్చుంటాడు. ఆ క్షణంలో ఆయనకి ఒక భయంకరమైన రియలైజేషన్ వస్తుంది. నా శారీరక బలం వేస్టు, నా రాజ్య బలం వేస్టు, అసలైన బలం మెంటల్ ఫోకస్ అంటే తపస్సు శక్తి ఇది. వశిష్టుడు ఏ ఆయుధం ముట్టుకోలేదు. కేవలం ఏకాగ్రతతోనే నన్ను ఓడించాడు. నేను ఇంతకంటే గొప్ప ఏకాగ్రతను సంపాదించాలి గొప్ప తపస్సు శశక్తిని సంపాదించాలి వశిష్ఠుడులా బ్రహ్మర్షిని అవ్వాలి అంతే రాజ్యం, [గురకలు] భార్యని, పిల్లల్ని అన్ని వదిలేస్తాడు.
(06:10) అడవిలో భయంకరమైన తపస్సు మొదలు పెడతాడు. లక్ష్యం, బ్రహ్మర్షి పదవి. కౌసికుడి తపస్సు ఎంత ఇంటెన్స్ గా ఉందంటే స్వర్గంలో ఇంద్రుడి సింహాసనం వణకటం మొదలవుతుంది. ఆయన ఏకాగ్రతను బ్రేక్ చేయాలి అని ఇంద్రుడు ఫిక్స్ అయిపోతాడు ఇంద్రుడు ఏం చేశడో తెలుసా రాక్షసుల్ని పంపలేదు సైన్యాన్ని పంపలేదు స్వర్గంలో అత్యంత అందమైన అప్సరసైన మేనకని పంపించాడు.
(06:31) మేనక భూమి మీదకు వచ్చి కౌశికుడి ఆశ్రమం ముందు నాట్యం చేయడం మొదలు పెట్టింది. ఎన్నో ఏళ్లగా కళ్ళు మూసుకున్న కౌశికుడు కళ్ళు తెరిచాడు ఒక్క చూపు ఆ సుందరు యొక్క సౌందర్యానికి ఆయన మనసు చెలించింది తపస్సు మర్చిపోయాడు. మేనకతో పాటు సంసారంలో మునిగిపోయాడు ఎన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేసిన మహాత్ముడు ఒక చిన్న టెంప్టేషన్ కి ఇబ్బలై ఏళ్ల జీవితాన్ని వృధా చేసుకున్నాడు.
(06:52) పఏళ్ల 10 ఏళ్ల తర్వాత హటాతగా స్ప్రహ వచ్చింది నేను ఎవరిని అసలు నా లక్ష్యం ఏంటి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఆ క్షణంలో అర్థంఅయపోతుంది ఇది ఇంద్రుడి ప్లాన్ అని ఆ క్షణంలో చాలా మంది బ్లేమ్ గేమ్ ఆడతారు కానీ కౌశికుడు ఒక భయంకరమైన నిజాన్ని ఒప్పుకున్నాడు నాకు ఈ పతనం ఇంద్రుడి వల్ల కాదు మేనక వల్ల కాదు నా మనసు మీద నాకు కంట్రోల్ లేకపోవడం వల్ల జాన్ మెల్టన్ అన్న గ్రేట్ పోయెట్ చెప్పిన లైన్ గుర్తుపెట్టుకోండి ద మైండ్ ఇస్ ఇట్స్ ఓన్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్సెల్ఫ్ కెన్ మేక్ హెవెన్ ఆఫ్ హెల్ ఏహెల్ ఆఫ్ హెవెన్ అంటే మన మనసే మన స్వర్గం మన మనసే మన నరకం అని యుద్ధభూమి బయట ఎక్కడో లేదు మన తలలోనే
(07:25) ఉంది. ఈ సత్యం అర్థమైన కౌశికుడు తిరిగి తపస్సు స్టార్ట్ చేస్తాడు. ఈసారి 10 రెట్లు కఠినమైన తపస్సు హై ఫోకస్ రంబ లాంటి అప్సరసలని ఇంద్రుడు మళ్ళీ పంపిన ఆయన ఏకాగ్రత చెక్కు చెదరలేదు. ఏళ్ల తర్వాత త్రిమూర్తులు ప్రత్యక్షమై నువ్వు బ్రహ్మర్షివ అయ్యావు అని ప్రకటించారు. ఆ మాట మీరు చెబితే కుదరదు బ్రహ్మర్షి అయిన వశిష్టుడే వచ్చి చెప్పాలి అన్నాడు.
(07:44) చివరికి ఆ బిరుదుని కౌశికుడికి సాక్షాత్తు వశిష్ట మహర్షి చేతుల మీదగానే ప్రకటించారు. ఎవరి చేతిలో ఓడిపోయాడో వారి చేతుల మీదగానే ఎదిగాడు. ఆ రోజు నుంచి ఆయన పేరు బ్రహ్మర్షి విశ్వామిత్ర ఇప్పుడు ఈ కథని మనం ఇవాల్టి జీవితానికి అప్లై చేద్దాం విశ్వామిత్రుడు ఎవరో కాదు మీరు నేను మన అందరం మరి ఆ ఇంద్రుడు ఎవరు మెటాగగుఇగ టిక్టాక్ కానీ ఆగండి ఈ టెక్ కంపెనీలు విలన్స్ కాదు వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేస్తున్నారు కానీ ట్రూత్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ మోడల్ మన అటెన్షన్ మీద ఆధారపడి ఉంది.
(08:15) వాళ్ళ అలగరిథమ్స్ మనల్ని ఎంగేజ్డ్ గా ఉంచడానికి డిజైన్ చేయబడ్డాయి. ఈ ట్రూత్ తెలుసుకోండి వాళ్ళని తిట్టకండి జస్ట్ మీ యూసేజ్ ని స్మార్ట్ చేసుకోండి. ఇంద్రుడు మేనకను పంపించినట్లు ఈ అల్గారిథమ్స్ మీకు మూడు మోడర్న్ అప్సరసలని పంపుతున్నాయి. ఒకటి నోటిఫికేషన్స్ రెండు ఇన్ఫినిట్ స్క్రోలింగ్ మూడు చీప్ డోపమైన్ ద్వారా వచ్చే ఇన్స్టెంట్ ప్లెజర్ మీ చేతిలో ఉన్న ఫోన్ పింగ్ అని మోగిందంటే మీ ముందుకు మేనక వచ్చి నాట్యం చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి.
(08:38) ఒక్క ఐదు నిమిషాలు రీల్స్ అనుకున్న ఆ ఒక్క చిన్న క్షణం మీ రెండు గంటల ప్రొడక్టివిటీని మీ మూడు నెలల ప్రోగ్రెస్ ని మింగేస్తుంది. ఇక ఈ ఎడిక్షన్ ఎక్కడిదాకా తీసుకెళ్తుంది అంటే మనం మన రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఎస్కేప్ అయ్యే అంతల చిన్న చిన్న పనులు కూడా మనం చేసుకోలేనంతగా పక్కన ఉన్న మనుషులతో కూడా మాట్లాడలేనంతగా సహజమైన అందాల్ని ఆనందాల్ని ఆస్వాదించలేనంతగా ప్రభావితం చేస్తుంది.
(08:59) మరి ఫోన్ ని స్మార్ట్ గా ఎలా యూస్ చేయాలి అబ్రహం లింకన్ చెప్పిన ఒక లైన్ గుర్తుపెట్టుకోండి డిసిప్లిన్ ఇస్ చూసింగ్ బిట్వీన్ వాట్ యు వాంట్ నౌ అండ్ వాట్ యు వాంట్ మోస్ట్ అంటే ఇప్పటికిప్పుడు కావాల్సిన దానికి జీవితంలో నిజంగా అత్యంత ముఖ్యమైన దానికి మధ్య సరైన దాన్ని ఎంచుకోవడమే డిసిప్లిన్ అంటే ఇన్స్టంట్ కిక్లని వదిలేస్తే పర్మనెంట్ కిక్ దొరుకుతుంది.
(09:21) లాస్ట్ పంచ్ మంది అవ్వాలంటే కొంచెం ఓర్పు సహనం ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే ఐదు సింపుల్ రూల్స్ ని 30 రోజులు పాటిస్తే మీ ఫోన్ తో ఉన్న రిలేషన్షిప్ పూర్తిగా మారిపోతుంది. మొదటి రూల్ ఫోన్ బరియల్ అవర్ ప్రతిరోజు ఉదయం లేచిన మొదటి గంట ఫోన్ ని వేరే గదిలో పెట్టేయండి. ఆ ఒక్క గంటలో ఫోన్ చూస్తే మీ రోజు మొత్తం రియాక్టివ్ గా మారిపోతుంది. అదే ఆ సమయంలో మీ గోల్స్ గురించి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ఇంటెన్షనల్ గా మారుతుంది.
(09:43) రెండో రూల్ ది 30 మినిట్ రూల్ ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెడితే ఆ 30 నిమిషాలు అదే పనిపై పూర్తిగా ఫోకస్ చేయండి. మధ్యలో ఫోన్ ని ముట్టుకోకండి ఇక మూడో రూలు నోటిఫికేషన్ మర్డర్వాట్ కాల్స్ లాంటి ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ తప్ప అవసరం లేని సోషల్ మీడియా నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేయండి ఎందుకంటే సోషల్ మీడియా నోటిఫికేషన్స్ మీకు సమాచారం ఇవ్వటానికి కాదు మిమ్మల్ని మళ్ళీ ఆ యాప్లోకి లాగటానికి డిజైన్ చేశారు.
(10:09) నాలుగో రోల్ బోర్డం టాలరెన్స్ ట్రైనింగ్ ప్రతిరోజు 10 నిమిషాలు ఫోన్ లేకుండా నిశశబ్దంగా కూర్చోండి మొదట్లో అసహనంగా అనిపిస్తుంది కానీ ఇదే ట్రైనింగ్ మీ ఫోకస్ ని ఇనుముల బలంగా చేస్తుంది. ఐదో రూల్ ది సండే ఆడిట్ ప్రతి ఆదివారం రాత్రి ఫోన్ సెట్టింగ్స్ లో స్క్రీన్ టైం చూడండి ఒక పేపర్ మీద రాసుకోండి ఈ వారం ఫోన్ ద్వారా ఏం కన్స్ూమ్ చేశాను ఏం క్రియేట్ చేశాను కన్స్ూమ్ ఎక్కువ క్రియేట్ తక్కువ అయితే వచ్చే వారం దాని బాలెన్స్ ని మార్చండి.
(10:35) ఈ ఐదు రూల్స్ ఫాలో అవ్వడం మీకు ఈజీ కాదు మీ బ్రెయిన్ రెబెల్ అవుతుంది కానీ ఆ క్షణంలోనే మీకు విశ్వామిత్రుడి ఫోకస్ గుర్తుకు రావాలి. సూర్యరశ్మి సాధారణంగా మన మీద పడితే వెచ్చగా ఉంటుంది కానీ అదే రశ్మిని ఒక భూతద్దం ద్వారా ఒకే పాయింట్ మీద కాన్సంట్రేట్ చేస్తే అది నిప్పును పుట్టిస్తుంది. మనిషి మనసు కూడా అంతే స్కాటర్ అయిన అటెన్షన్ మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది కాన్సంట్రేట్ అయిన అటెన్షన్ మిమ్మల్ని అన్స్టాపబుల్ గా మారుస్తుంది.
(10:56) బ్రూస్ లీ చెప్పిన ఇమ్మోర్టల్ లైన్ ఉంది ది సక్సెస్ఫుల్ వారియర్ ఇస్ ద యవరేజ్ మన్ విత్ లేజర్ లైక్ ఫోకస్ అంటే ప్రపంచాన్ని జయించే విజేత ఏదో ప్రత్యేకమైన మనిషి కాదు సాధారణ మనిషే కానీ లేజర్ లాంటి ఫోకస్ ఉన్న మనిషి టాలెంట్ కాదు ఫోకస్ లక్ కాదు క్లారిటీ ఎక్స్ట్రార్డినరీ పర్సన్ కాదు ఆర్డినరీ పర్సన్ విత్ ఎక్స్ట్రార్డినరీ కాన్సంట్రేషన్ కౌశికుడు విశ్వామిత్రుడిగా మారింది ఇలానే ఇప్పుడు మనం అర్జున్ కథకుి తిరిగి వెళ్దాం ఆ గదిలో అర్జును ముందు ఒక్కటే దారి ఉంది పెట్రోల్ క్యాన్ తో జీవితాన్ని ముగించటం అప్పుడే అనుకో కుండా ఫోన్లో రుణం తీర్చుకోవడానికి అన్నట్టుగా
(11:28) ఒక YouTube నోటిఫికేషన్ కౌశికుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడో తెలుసా ఇది టైటిల్ ఓపెన్ చేశడు వీడియో చూస్తున్నప్పుడు అర్జున్ గుండె ఆగిపోయింది. ఇది నా కథ విశ్వామిత్రుడు మేనక వల్ల డిస్ట్రాక్ట్ అయ్యానని తెలుసుకున్నాడు తన మనసు మీద కంట్రోల్ తెచ్చుకున్నాడు సో నేను ఫోన్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. ఆ క్షణంలోనే అర్జున్ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఆ పెట్రోల్ క్యాన్ లోని పెట్రోల్ ని బైక్ లో పోసాడు ఫోన్ ని పడేయలేదు అకౌంట్స్ ని డిలీట్ చేయలేదు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాడు అన్నెసరీ నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేశడు యప్స్ కి టైం లిమిట్ సెట్
(11:58) చేశడుఇగ రోజుకి 30 మినిట్స్ YouTube రోజుకి వన్ అవర్ ప్రొడక్టివిటీ యప్స్ కి నో లిమిట్. ఆ రోజు నుంచి అర్జున్ ఫోన్ తో ఒక కాన్షియస్ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేశాడు. రోజుకుఎనిమిది గంటలు డీప్ వర్క్ మధ్యలో ఫోన్ వాడతాడు కానీ పర్పస్ తో YouTube లో కోడింగ్ ట్యుటోరియల్స్ చూస్తాడు లింక్డిన్ లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్టట్wిitటter లో టెక్ న్యూస్ ఫోన్ అతనికి మాస్టర్ కాదు సర్వెంట్ అయింది.
(12:21) మొదటి వారం బ్రెయిన్ అల్లాడిపోయింది కానీ అతను పడిపోలేదు అతని ఫోకస్ టాప్ నార్చ్ లో ఉంది ఒక నెలలో ప్రొడక్ట్ యొక్క మొదటి వర్షన్ రెడీ అయిపోయింది. ఆరు నెలల్లో మొదటి ఇన్వెస్టర్ ఫండింగ్ వచ్చింది. మూడు సంవత్సరాల తర్వాత అర్జున్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అతని స్టార్టప్ యూనికార్న్ ఇంటర్వ్యూర్ అడిగాడు మీ సక్సెస్ రహస్యం ఏంటి అని అప్పుడు అర్జున్ తన ఫోన్ ని పైకి తీసి చూపించాడు ఇది నా శత్రువు కాదు ఇది నా అత్యంత పవర్ఫుల్ టూలు రెండేళ్ళు ఇది నన్ను యూస్ చేసింది తర్వాత నేను దీన్ని యూస్ చేయడం నేర్చుకున్నాను అదే తేడా అని చెప్పాడు.
(12:50) ఫ్రెండ్స్ అర్జున్లో ఏ సూపర్ పవర్ లేదు మనలో ఉన్నవే అతనిలోనూ ఉన్నాయి. తను చేసింది ఒక్కటే తన ఫోన్ మీద తను మాస్టర్ అయ్యాడు. మీరు అలా కాగలరా ఫోన్ అనేది మీ టూల్ ఈరోజు సోషల్ మీడియా అనే విండో లో నుంచే మనం మన ప్రపంచాన్ని చూస్తున్నాం. ఈ టూల్ ద్వారా మీరు లెర్న్ చేయొచ్చు ఎర్న్ చేయొచ్చు గ్రో అవ్వచ్చు కానీ ఈ టూల్ ని మీరు కంట్రోల్ చేయాలి.
(13:09) ఈ టూల్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. ఇక ఫైనల్ పవర్ఫుల్ లైన్ ఉంది యువర్ ఫ్యూచర్ ఈస్ క్రియేటెడ్ బై వాట్ యు డ టుడే నాట్ టుమారో అంటే మీ ఫ్యూచర్ రేపటి ప్లాన్స్ తో క్రియేట్ అవ్వదు. ఇవాల్టి యాక్షన్స్ తో క్రియేట్ అవుతుంది. అలా మీరు యాక్ట్ చేయాలి అంటే విశ్వామిత్రులా ఫోకస్ ఉండాలి. అప్పుడు మీరు మీ ఫీల్డ్ లో బ్రహ్మమర్షి అవుతారు. ఈ వీడియో మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిఉంటే ఫోన్ తో స్ట్రగుల్ అవుతున్న మీ ప్రతి స్నేహితుడికి షేర్ చేయండి.
(13:30) జై విశ్వామిత్ర అని కామెంట్ చేయండి. ఇవాల్టి నుంచి మీ ఫోన్ మీద మీరు మాస్టర్ అవ్వడానికి కమిట్ అవ్వండి మరో పవర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవ్ నమస్కారం జై హింద్

No comments:

Post a Comment