🌒🥀 తండ్రి శివయ్య 🥀🌒
┈┉❀꧁🕉️🌗꧂❀┉┈
🌙జనన మరణాల మధ్యలో ఈ నాటక రంగం,
పాత్రలు మారినా బాధలు మాత్రం మారవు…
🌿కాలం రాసిన గీతల్లో మన జీవితం చిక్కుకుని,
అర్ధం వెతుక్కుంటూ అలసిపోతుంది మనసు…
🔱 వచ్చేది ఖాళీ చేతులతోనే, పోవేది కూడా అలాగే,
మధ్యలో మిగిలేది కొన్ని గాయాల గుర్తులే…
🎻 బంధాల పేరుతో బంధింపబడి బ్రతుకుతూ,
చివరికి ఒంటరితనమే నిజమని తెలుసుకుంటాం…
ఎంత పరుగెత్తినా చివరి గమ్యం ఒకటే,
నీ చరణాల్లోనే ఆఖరి విశ్రాంతి తండ్రి…
┈┉❀꧁🥀ఓం నమఃశివాయ🥀꧂❀┉┈
తండ్రి శివయ్యా…
ఈ జనన మరణాల మధ్యలో
నిజమైన శాంతి నీవే… 🙏🕉️💔
No comments:
Post a Comment