*🕉️🌼 ఓం నమఃశివాయ 🌼🕉️*
*సంపద మీద వ్యామోహం ఆధ్యాత్మిక సాధనకు ఓ పెద్ద ఆటంకం.... దీనికి తోడు అజ్ఞానం మరింతగా ఆటంక పరుస్తూ వస్తుంది*
*మానవుడు తన ఇంటి నిండుగా ధనం నింపుకోవడానికి పడే తపన, ఆరాటం, ఆసక్తి, తన ఒంటి నిండుగా గుణం నింపుకోవడంలో చూపడం లేదు*
*జేబు నిండుగా డబ్బు ఉన్నప్పటికీ, పక్కవాడి ఆకలి తీర్చడానికి పైసా కూడా ఇవ్వడు.... ఇంకనూ మెుక్కులు పేరిట హుండీలలో వేలాది రూపాయలు వేస్తాడు...కానీ గుడి బయట ఉన్న దీనులకు పైసా కూడా విదల్చడు*
*భగవంతుడు ఎవరినైనా ధనవంతులుగా చేసారంటే.... వారు దీనులను ఆదుకుంటారని, తద్వారా వారికి సద్గతి కలిగించాలనియే!. దీనికి ఏకైక మార్గం త్యాగమే*
*త్యాగ నిరతి లేకుండా ఆత్మజ్ఞానం పొందాలంటే అది అసాధ్యం*
*అందుకే... మానవుడు భగవంతునిపై భక్తి విశ్వాసంతో ఉంటూ... దీనులను ఆదుకునే సద్బుద్ధి కలిగి ఉండటమే నిజమైన జ్ఞానం*
*🌼 ఓం నమఃశివాయ 🌼*
No comments:
Post a Comment