Monday, May 4, 2026

ప్రతి యోగి తప్పక చదవాల్సిన పుస్తకం | ఒక యోగి ఆత్మ కథ | by @SwamiAatma | Swami Aatma-TEL #SwamiAatma

ప్రతి యోగి తప్పక చదవాల్సిన పుస్తకం | ఒక యోగి ఆత్మ కథ | by @SwamiAatma | Swami Aatma-TEL #SwamiAatma

Author Name:Swami Aatma

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatma

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WrQuG4blQNI



Transcript:
(00:01) [సంగీతం] సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవ్వరికైనా నయం చేయగలడు ఆహా ఎంత అద్భుతమైన మాట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మ కథ అనే ఈ పుస్తకాన్ని ఎప్పుడూ నాతో పాటే ఉంటది. ఎప్పుడు నేను దీన్ని ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెళ్తూనే ఉంటాను. ఎన్నిసార్లు ఈ పుస్తకాన్ని చదివింటానో నాకే తెలియదు లెక్క లేదు ఎందుకంటే ప్రతిసారి
(00:47) చదివినప్పుడల్లా ఇది నాకొక కొత్త అనుభూతిని ఇస్తది. పరమహంస యోగానంద గారు మహాగురు. ఆయన రాసిన శైలి ఆయన వ్యక్తపరిచిన విధానము ఆయన ఇచ్చిన సూచనలు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే ఒక ఉత్తేజాన్ని కలిగించడానికి ఇంత బాగుంటుందా ఆధ్యాత్మికమైన ప్రపంచం ఆధ్యాత్మికమైన వాసనతో నిండిన జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనడానికి ఇన్ని అద్భుతాలతో నిండి ఉంటు ఉంటుందా అని చెప్పడానికి పరమహంస యోగానంద గారి జీవితమే ఒక సాక్ష్యం ఆయన
(01:35) రచించిన ఈ పుస్తకం ఒక యోగి ఆత్మకథ దయచేసి నేటి యువత తప్పకుండా చదవాల్సిన పుస్తకం నేను ఎన్నో సార్లు చెప్పాను పదే పదే చెప్తూనే ఉంటాను ఈ దేహాన్ని వదిలేంత వరకు చెప్తూనే ఉంటాను పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథ పుస్తకం పుస్తకాన్ని చదవండి ప్రపంచంలోని అన్ని భాషల్లో నాకు తెలిసి ప్రపంచంలోని అన్ని భాషల్లో ఈ పుస్తకం అయితే అనువాదం జరిగింది.
(02:08) ఆ మీకు తెలిసి నేను నా దగ్గర అయితే తెలుగులో ఎప్పుడూ నా దగ్గర ఉంటది ఆ తెలుగు ఇంగ్లీష్ జర్మన్ లో కూడా ఉంది నా దగ్గర బట్ కానీ మీ భాషలో మీరు పుస్తకాన్ని కొనుక్కొని చదవండి చదివిన తర్వాత మీరే చెప్తారు అది ఒక పుస్తకం కాదు ఇది ఒక గురువు ఒక గురువే ఆయన ఒక శక్తిగా మీతో పాటు ఉన్నాడు మీతోనే ఉన్నాడు అనేది మీరు నమ్ముతారు. స్నేహితులు అడిగారు ఆహ్ ఎందుకు ఎప్పుడు నువ్వు ఇదే ఈ పుస్తకం గురించే చెప్తా ఉంటావు ఎందుకు ఈ పుస్తకం ఆహ్ ఏమి అంత
(02:52) గొప్పది ఏముంది దాంట్లో ఏం అంత రాసి ఉంది అంటే ఇట్స్ వెరీ పర్సనల్ ఆ ఇది చాలా ఆ మనసుకు దగ్గరగా కొంతమందికి కొన్ని పుస్తకాలు నచ్చుతాయి. ఎందుకు నచ్చుతాయి అంటే వాళ్ళు అలా కనెక్ట్ అయిపోతారు ఆ పుస్తకానికి అది ఎందుకో అలాగా నేను కనెక్ట్ అయిపోయిన పుస్తకం నేను మాత్రమే కాదు నా స్నేహితులు కూడా చిన్నప్పటి నుంచి ఆ నా స్నేహితులు కూడా కొంతమంది ఆ నాకు నాకు చిన్నప్పుడే ఈ పిచ్చి ఉండేది ఆ ఆధ్యాత్మికమైన పిచ్చి అలా ఉండేది ఈ పిచ్చిని కొద్ది మంది స్నేహితులకు నేను అంటించాను అన్నమాట అదే ఇలాగ అంటే వాళ్ళు నన్ను చూసి వాళ్ళు కూడా ఆ అవును అవును
(03:34) అలాగే అని చెప్పి వాళ్ళు ఈ పుస్తకాలను కొనుక్కొని వాళ్ళు చదివి నేను ఏదైతే నిజంగానే ఆ నమ్మానో నేను ఏదైతే ఆ నా అనుభవంలోకి వచ్చిందో నేను ఏదైతే అనుభూతిని పొందానో అవన్నీ వాళ్ళు కూడా పొందారు వాళ్ళు కూడా నిజంగానే అరే అవును ఈ పుస్తకం అంటే కేవలం పుస్తకం కాదు ఇది ఒక శక్తి ఈ పుస్తక రూపంలోనే ఆ గురువులు మనల్ని నడిపిస్తూ ఉన్నారు అని నేను కాదు నా స్నేహితులు కూడా నమ్ముతారు.
(04:11) సో అంతటి గొప్ప పుస్తకం ఇది సో కాబట్టి అవకాశం ఉంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి ఆ చిన్న చిన్న కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మనలో ఒక ఇంకా ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఇంకా వినాలి అన్నటువంటి ఆ భావనలు కలిగేలాగా చాలా అద్భుతంగా రాశారు చాలా చాలా చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. అసలు ఒక మనిషి ఒక గురువు తో ఎలా ఉండాలి ఒక మనిషికి గురువు ఎంత అవసరం ఒక గురువును పొందాలంటే ఒక ఒక యోగి ఒక ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన
(04:59) ఒక ఒక చిన్న బాలుడు ఎంత తపన పడతాడు ఈ గురు శిష్యుల అనుబంధము ఈ జన్మదేనా జన్మ జన్మలదా ఇవన్నీ చాలా చాలా చాలా చాలా బలంగా మన హృదయాల్లో పాతుకుపోయేలాగా మనకు చాలా సులువుగా అర్థమయ్యేలాగా చాలా చాలా మంచి మంచి ఆ తన గురువుని కలుసుకోవడానికి ఒక శిష్యుడు ఎలాంటి ప్రయాణం చేశాడు తన గురువుతో ఎలాంటి అనుబంధాన్ని పెంపొందించుకున్నాడు తన గురువు గురువు పట్ల ఎంతటి
(05:44) భక్తిని తాను కలిగి ఉన్నాడు ఆ ఆ ప్రయాణం వాళ్ళిద్దరి ప్రయాణం ఎలా జరిగింది ఆ గురువుగారు శిష్యునికి ఎలాంటి బోధనలు చేశారు ఎలా ఒక మార్గదర్శంగా తన జీవితాన్ని నువ్వు నువ్వు ఇలా జీవించాలి నువ్వు ఇలా ఉండాలి ఇదే నీ లక్ష్యం ఆ అని చెప్పేసి వాళ్ళ గురువుగారు ఎలా చెప్పారు అన్నది కూడా ఈ పుస్తకంలో చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ గురువులే గాక వాళ్ళ గురువు యొక్క గురువులు కూడా అంటే మహావతార్ బాబాజీ గారి గురించి కూడా లాహిరి మహాశయుల గురించి కూడా వారికి ఉన్న అనుభవాలు వాళ్ళ గురువుల ద్వారా వాళ్ళు విన్నటువంటివి కానీ ఇవన్నీ కూడా చాలా చాలా చాలా మంచిగా ఈ పుస్తకంలో
(06:30) ఉపయోగ ఆత్మకథలో వివరించడం జరిగింది. ఇది మాటల్లో చెప్పడం కంటే చదివి ఆ అనుభూతిని మీరే పొందండి ఒక యోగిని ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ కనిపెట్టుకునే ఉంటది ఆ అదృశ్య శక్తి ఆ యోగిని నడిపిస్తూ ఉంటది అంటే పుష్ చేస్తా ఉంటదిన్నమాట ఆ అదృశ్య శక్తే ఆ యోగిని సరైన గురువు దగ్గరికి తీసుకొని వెళ్తది ఈ రెండు ఆత్మల మధ్య ఉన్న అనుబంధాన్ని అంటే గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ
(07:17) వారిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. ఈ అదృశ్య శక్తే వారికి ఒక రక్షణ వలయాన్ని కూడా ఏర్పరుస్తుంది. ఈ పుస్తకం మీ వెంట ఉంటె ఈ పుస్తకాన్ని మీరు చదివితే పరమ గురువుల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉన్నట్టే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక శక్తి మిమ్మల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అనే సత్యాన్ని మీరే గ్రహిస్తారు మీకు తెలుస్తుంది.
(07:52) ఒక శక్తి ఏదో నన్ను నడిపిస్తా ఉంది. ఒక శక్తి ఏదో నా చుట్టూ ఒక రక్షణ వలయంగా ఏర్పడి ఉంది ఆ శక్తి నన్ను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆ శక్తే నన్ను ఆపదల్లో నుంచి కాపాడుతా ఉంది. ఆ శక్తే నన్ను సన్మార్గం వైపు నడిపిస్తా ఉంది. ఆ శక్తే నాలో ఒక మంచి ప్రవర్తనను తీసుకొని వస్తా ఉంది అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.

No comments:

Post a Comment