Sunday, October 11, 2026

“అతి చనువు మీ విలువను తగ్గిస్తుందా? | ప్రతి ఒక్కరికీ ఒక హద్దు ఉండాలి”. It

“అతి చనువు మీ విలువను తగ్గిస్తుందా? | ప్రతి ఒక్కరికీ ఒక హద్దు ఉండాలి”. It

Author Name:Vijaya

Youtube Channel Url:https://www.youtube.com/@vijayajomana

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ra6yuoysMCA





Title: “అతి చనువు మీ విలువను తగ్గిస్తుందా? | ప్రతి ఒక్కరికీ ఒక హద్దు ఉండాలి”. It

Author Name: Vijaya

Description: Does being too friendly sometimes make people take you for granted?
There is a Telugu saying: “అతి చనువు చివరికి చులకన” — Too much familiarity can eventually lead to a loss of respect.
Being kind and friendly is a beautiful quality, but not everyone will value your kindness. When you give people unlimited access to your time, emotions, and personal life, some may begin to take you for granted.
In this video, let's understand why maintaining healthy boundaries is important, why we should never compromise our self-respect to please others, and how to remain kind without allowing others to take advantage of us.
Remember, you don't have to be rude to set boundaries, and you don't have to please everyone to be loved.
Be kind, but know your limits. Give respect, but never forget your self-respect.
Watch till the end and share your thoughts in the comments!
Subscribe to Vijaya Motivations for more Telugu motivational stories, psychology, human behaviour, and life lessons.
#TeluguMotivation #SelfRespect #TeluguLifeLessons #HumanBehaviour #PersonalBoundaries #TeluguMotivationalVideos #LifeLessons #VijayaMotivations

Transcript:
(00:00) హాయ్ నేను విజయ ఆ మనకి ఇష్టమైన వారితో చనువుగా ఉండడంలో తప్పులేదు మన మనసుకి దగ్గరైన వారితో మన విషయాలు పంచుకోవడంలో తప్పులేదు కానీ ఏ చనువుకైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే మన చనువునే ఇతరులు మన బలహీనతగా భావిస్తారు. అందుకే మన పెద్దలు అంటారు అతి చనువు చివరికి చులకన అని ఏంటో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
(00:34) ఎవరి దగ్గరైనా హద్దులు లేకుండా అతిగా కలిసిపోతే ఒక దశలో వాళ్ళ దగ్గర మనకు విలువ లేకుండా పోవచ్చు. ముఖ్యమైన విషయం అందరితో ఒకేలాగా చనువుగా ఉండాల్సిన అవసరం లేదు. మన జీవితంలో పరిచయస్తులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఆత్మీయులు ఉంటారు అందరినీ ఒకే స్థాయిలో మన జీవితంలోకి ఆహ్వానించాల్సిన అవసరం అనేది లేదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎవరితో ఏం పంచుకోవాలి ఎవరితో వ్యక్తిగత విషయాలు పంచుకోవాలి అనే నిర్ణయం మనం ఖచ్చితంగా తీసుకోవాలి చనువు పెరగడం మంచిదే కానీ ఆ చనువుకు హద్దులు లేకపోవడం మంచిది కాదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం
(01:18) ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటే మనకు విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే [గురకలు] ఎవరైనా పిలవగానే మనం వెంటనే వెళ్తాం. ఎవరైనా ఫోన్ చేయగానే వెంటనే స్పందిస్తాం ఎవరైనా సహాయం అడగానే మన పనులన్నీ పక్కన పెట్టేసి చేస్తే మొదట్లో వాళ్ళకి మన పైన చాలా అభిమానంగా ఉంటుంది కానీ ఎప్పుడు అందుబాటులో ఉండు ఉంటూ పోతూ ఉంటే వాళ్ళకి [గొంతు సవరించుకోవడం] అది ఒక మనం చేసే సహాయం ఒక ప్రత్యేకమైంది కాకుండా అది ఒక అలవాటుగా మారిపోతుంది.
(01:52) అందుకే మనం ఎప్పుడైనా ఆ ఇప్పుడు సహాయం చేయడం కుదరదు అంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మనం సహాయం చేయడం మంచిదే కానీ మనం చేసే సహాయానికి మన సమయానికి విలువ ఉందని ఇతరులకు తెలియజేయడం కూడా మన బాధ్యత. ఇంకో విషయం చనువు పెరిగింది కదా అని మన వ్యక్తిగత విషయాలు అందరికీ పంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు మనతో చనువుగా ఉన్న వ్యక్తి రేపు అదే స్థాయిలో మన జీవితంలో ఉంటారో లేదో మనకి తెలియదు కాబట్టి మన బలహీనతలు మన కుటుంబ సమస్యలు మన ఆర్థిక విషయాలు వ్యక్తిగత విషయాలు అన్ని పంచుకోవాల్సిన అవసరం అనేది లేదు.
(02:32) ఇంకో ముఖ్యమైన విషయం మనల్ని మనమే ఇతరుల దగ్గర చులకన చేసుకోవడం చాలాసార్లు మనం మనల్ని ఇతరులు చులకనగా చూస్తున్నారని బాధపడుతూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి మనమే వాళ్ళకు ఆ అవకాశం ఇచ్చామా మనకు వాళ్ళు విలువ ఇవ్వకపోయినా మౌనంగా ఉంటున్నామా పదే పదే అవమానిస్తున్న మళ్ళీ అదే చనువుతో వాళ్ళతో తిరిగి మాట్లాడుతున్నామా మన సమయానికి మనకు వాళ్ళు విలువ ఇవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అందుబాటులో ఉంటున్నామా అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇతరులు మనకు విలువ ఇవ్వాలి అనిఅను అనుకునేటప్పుడు ముందుగా మన విలువ ఏంటో మనకు తెలిసఉండాలి. మరో
(03:18) గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హద్దులు పెట్టడం అంటే అహంకారంగా ఉండడం కాదు కొంతమంది ఏదైనా సమస్య రాగానే ఇంక నేను మనుషులకు దూరంగా ఉంటాను అంటారు కానీ అది సమస్యకు పరిష్కారం కాదు మనుషులను ప్రేమించాలి ఆప్యాయంగా ఉండాలి సహాయం చేయాలి కానీ అవసరమైన చోట లేదు అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. ప్రతిదానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రతి పిలుపుకు వెంటనే పరిగెత్తాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యను మన భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు హద్దులు పెట్టేది మనుషులను దూరంగా ఉంచడానికి కాదు మన విలువను మనం కాపాడుకోవడానికి గుర్తుపెట్టుకోవాల్సిన
(03:58) విషయం ఏంటంటే మన జీవితంలో అతి చనువు ఉన్న వ్యక్తి మనకు ఆత్మీయుడు అయిపోడు [గురకలు] తక్కువ చనువు ఉన్న వ్యక్తి పరాయివాడ అయిపోడు ఎందుకంటే మన సంబంధాల విలువ మాటల్లో కాదు వాళ్ళు మనకఇచ్చే గౌరవంలో ఉంటుంది. అందుకే ఇతరులను సంతోష పెట్టడం కోసం మీ హద్దులను చెరిపేసి విలువను పోగొట్టుకోకండి. [గురకలు] అతి చనువు మన విలువను తగ్గిస్తుంది.
(04:25) అతి దూరం మనుషులను దూరం చేస్తుంది. అందుకే సరైన హద్దులు మన బంధాలను విలువలను మన గౌరవాలను కాపాడతాయి. సో చనువుగా ఉండండి కానీ చులకనయ్యేంతవరకు కాదు ప్రేమగా ఉండండి కానీ మీ విలువను కోల్పోయేంత కాదు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి థాంక్యూ ఫర్ బీయింగ్ హియర్ యా

No comments:

Post a Comment